సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వివిధ చిత్రాల్లో వాన పాటల నేపధ్యం గురించి బాగా వివరించారు. వాన పాటలను రొమాంటిక్ భావాలకు వాడుకోవటం ఎందుకంటే వర్షం లో తడిచిన హీరోయిన్ అందచందాలు చూపించటం కోసమే! చిటపటచినుకులు పాటలో ఏ మాత్రం అసభ్యం లేని సోయగాలను ప్రదర్శించారు హీరోయిన్. వర్షాన్ని కథలో ఒక భాగంగా వాడుకున్న చిత్రం “మల్లీశ్వరి (1951)”. సంత నుంచీ తిరిగి వస్తూ వర్షంలో చిక్కుకుని ఒక సత్రంలో ఆగుతారు నాయికానాయకులు. అక్కడే రాయల వారితో పరిచయం కలగటం, కథ ముందుకు వెళ్ళటానికి బీజం పడుతుంది……ఈ శీర్షికలో తెలుగు చిత్రాల విశేషాలు కూడా చెబితే బాగుంటుంది.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి వ్యాఖ్య: *వడగళ్ల (వివిధ బాషల) పాటల సొగసైన సమీక్ష. ఇవి చూస్తుంటే జుగుప్స రాదు.. అందుకే చిరస్థాయిగా వినూత్న మట్టి వాసన కలిగి ఉన్నాయి. 👌🫡*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది యక్కలూరి శ్రీరాములు గారి వ్యాఖ్య: *మధురగీతాలు.. శీర్షికలో ఇంతదాకా విశ్లేషించిన పాటలన్నీ దేనికవే తృప్తి సంతృప్తి.. వాన చినుకులగురించి వ్రాసిన ఈ సంచిక మహాసంతృప్తి.. కారణం.. తెలుగు.. హిందీ గురించే గాక ఆంగ్లచిత్రం లోని వాన సందర్భాన్ని వివరించిన తీరు.. ఏదైనా విషయాన్ని వివరించేప్పుడు “కూలంకుషంగా” అందివ్వడమే వ్యాస “లక్షణం”. ఈ వ్యాసంలో అది “పుష్కలం” శంతనూ – శర్మిష్ట లకి అభినందనలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *బావుంది విశ్లేషణ. వాన పాటలు ఒకప్పుడు ప్రతి తెలుగు సినిమాలో ఉండేవి. సినిమా సక్సెస్ లో 20 శాతం వాటి వల్లనే అని చెప్పచ్చు. వేటగాడులో “ఆకుచాటు…”, గాంగ్ లీడర్ లో “వాన వాన వెల్లువాయే…” ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాన హిట్స్ వున్నాయి..👏👏*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బృందావనరావు గారి వ్యాఖ్య: *పాట యొక్క శ్రావ్యతనూ, వర్షంలో తెరమీద పడుచు జంట చేసే విన్యాసాలనూ, పాటలోని పదాల అర్థాన్నీ గమనిస్తూ చిత్రీకరణలోని చిన్నాచితకా అనౌచిత్యాలను ప్రేక్షకుడు పట్టించుకోడని మీరన్నది నిజం. ఆయా పాత పాటలను విశ్లేషిస్తూంటే ఆ సన్నివేశాలు కళ్ళముందు మెదిలాయి. మంచి శీర్షిక, చక్కని నిర్వహణ. ఆసక్తిదాయకంగా ఉంది. ధన్యవాదాలు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లాప్రగడ రామారావు గారి వ్యాఖ్య: *సమయం కుదరడంతో పాటలు కూడా విన్నానండి. సాహిత్య విశ్లేషణతో పాటు చిత్రీకరణ లోతుపాతులను వివరించడం బాగుంది. “రోటీ కపడా ఔర్ మకాన్” పాట వివరణలో నాయిక “దూషిస్తూ” అని ఉంది. అచ్చు తప్పు కావచ్చు. లేదా నా అవగాహనా లోపం కావచ్చు.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శీలా సుభద్రాదేవి గారి వ్యాఖ్య: *వివిధ భాషల్లో వానపాటల సందడి బాగా వివరించారు. రాజ్ కపూర్ సినీమాల్లో తప్పని సరిగా వాన సీన్‌తో పాట వుంటుంది. హిందీ, తెలుగులోని మొదటి వాన పాట ఏమై వుంటుంది.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణకుమారి గారి వ్యాఖ్య: *వాన పాటలతో పోలిస్తే విషాదం గీతాలు,భక్తి పాటలు నిజంగానే వెనుకబడ్డాయి. మీ సునిశిత పరిశీలన ప్రశంసనీయం 👏👏*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నవిత్తుల ఎస్.ఆర్. మూర్తి గారి వ్యాఖ్య: *ఒక్క వానపాట చుట్టూ ఎన్ని విశేషాలో.. చిన్నప్పుడు బడిలో ఆ పాట పాడి తిట్లూ దెబ్బలూ తిన్నవాళ్ళెందరో.. వాళ్లలో నేనూ ఉన్నాను. మా కొవ్వాడ మాస్టారు క్లాసులో తిట్టింది చాలక మానాన్నగారికి పితూరీలు చెప్పి కొట్టించారు కూడా. ఆనాటి అయ్యవార్ల క్రమశిక్షణ తలుచుకుంటే కొట్టీ తిట్టీ దారిలో పెట్టినందుకు వారిపట్ల కలిగే గౌరవం వెలకట్టలేనిది..*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సందినేని నరేంద్ర గారి వ్యాఖ్య: *శంతనూ – శర్మిష్ట గారి మధుర గీతాలు – మనోహర దృశ్యాలు పాటల చిత్రీకరణ పాటల విశ్లేషణ చక్కగా ఉంది. తెర వెనుక జరిగే చిత్రీకరణ విశేషాలను చక్కగా తెలియజేస్తున్నారు.
    ధన్యవాదాలు.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ముదిగొండ వీరభద్రయ్య గారి స్పందన: నమస్కారం. మధుర గీతాలు -మనోహర దృశ్యాలు వ్యాసాలనన్నింటినీ చదువలేదు. కానీ చదివినంత వరకు ఈ విధమైన పరిశీలనలు కూడా సాహిత్య విమర్శయే నేనీ, విమర్శ పరిధి ఈ యుగంలో ఇంకా విస్తృతి పొందిందనీ అనిపించింది.‌ చిత్రీకరణలో ఔచిత్య అనౌచిత్యాలు, నటనలో ప్రతిభ,గాఢత, గీత రచయిత వ్యక్తీకరించిన భావం చిత్రీకరణలో తే గలుగడం,తేలేక పోవడం, ఇత్యాది విషయాలను కూలంకషంగా చూపగలిగారీ రచయితలు. వీటిని విశదీకరించ గలిగిన వైదుష్యం ఉన్న వారు వీరిద్దరూ. సాహిత్య క్షేత్రంలో ఇదొక కొత్త పాయ. దీన్ని మీరు ప్రారంభించారు, అదిన్నీ విద్వద్విమర్శకుల రచనతో.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!