సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    డాక్టర్ రాయపెద్ది వివేకానంద్

    అద్భుతమైన శీర్షిక.
    అలనాడు వీఏకే రంగారావు గారి వ్యాసాలు చదివి ఎంత అనుభూతి చెందామో అంత అనుభూతినీ రసాస్వాదననీ ఈ వ్యాసం కలిగించింది. ముఖ్యంగా ఇంకో సంతోషకరమైన అంశం ఏమిటంతే ఇది కేవలం ఒక వ్యాసంతోపరిమితమై పోలేదు ఇది వ్యాస పరంపర సుమా అన్న భరోసానిస్తూ ఇది శీర్షిక అని తెలిపారు. అయ్యా చెవుల్లో తేనెనో అమృతాన్నో పోస్తే కూడా ఇంత ఆనందం కలగదు.
    నేను ఎంతో ఎంతెంతో అభిమానించే జీకే వెంకటేష్ గారి స్వరకల్పనలోని “పూలు గుసగుసలాడేనని ‘ పాట గూర్చి చదువుతూ మనసు చెవులతో ఆ పాటని వింటూ వ్యాసాన్ని చదువుతూ వెళ్ళాను. ఇలాంటి రసానుభూతిని ఇటీవలి కాలంలో కలిగింఇన అరుదైన వ్యాసం ఇది.
    ఆ పాట వినటమే గానీ ఎప్పుడూ తెరపై చూడలేదు, అమ్మో ఇంత మంచి పాటని కృష్ణగారిపై చిత్రీకరించారా? ఇది ఇంకో కొత్త విషయం నాకు.
    ఆ పాట చరిత్రని చక్కగా వివరించారు. జీకే వెంకటేష్ గారి రావణుడే రాముడైతేలో పాటలు ఎంత గొప్పగా ఉంటాయో మనకి అందరికీ తెలిసిందే. ఆయన వద్ద సహాయకుడిగా ఇళయరాజా ఉన్నరోజుల్లో ఇళయరాజా ఆ పాటలకి స్వరకల్పన చేసారు అని ఒక విమర్శకుడు (రంగావజ్ఝల భరధ్వాజ గారు) ఒక వ్యాసం వ్రాసినప్పుడు నేను విరుచుకు పడ్డాను కొన్నేళ్ళ క్రితం. ఈ వ్యాసం జీకే వెంకటేష్ గారి గొప్పదనాన్ని అందరికీ తెలియజేస్తుంది అనడంలో సందేహం లేదు.
    మూకీ సినిమాల నుంచి శబ్దగ్రాహణం వరకి, ఆ తరువాత వచ్చిన సాంకేతిక విప్లవం అన్నీ చక్కగా వ్రాశారు.
    ఎవరీ శంతనూ శర్మిష్ఠ? వారికి నా హృదయపూర్వక అభినందనలు.

    (సంచికలో కామెంట్స్ వ్రాద్దామని కూర్చున్న కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అంత సులభంగా ఓటమిని ఎలా అంగీకరిస్తాను నేను?
    నేను అధ్యయనం చేశాను కూర్చుని సమస్యని. లాగిన్ అవ్వాలి మెంబర్స్ మాత్రమే కామెంట్స్ వ్రాయాలి అని ఉంది.
    కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటె మెంబర్షిప్ డ్రైవ్ స్టర్ట్ చేయండి.
    ఉత్తరాలు లేకుంటే రచయితలకి డీ మోటివేషన్ వస్తుంది. చప్పట్లే కద కళాకారుడికి ఊపిరి. )

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పెర్కల్లి యాదగిరి గారి వ్యాఖ్య: *మూకీ..నుండి టాకీకి చేరుకోవటం.. చిత్రసీమలో ఒక అధ్యాయం ఆరంభమయ్యింది.. వివిధ రకాలు.. దిశల్లో శబ్దాలు.. పాటలూ.. వింటున్నాము.. ఈ శీర్షిక వలన సినీ సంగీతం..ధ్వని ముద్రణ.. సాహిత్యం.. విషయాలు చాలా తెలుస్తున్నాయి.. అభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బృందావనరావు గారి స్పందన: *ఈ వారం వ్యాసం చాలా చాలా బాగుంది. పాటా, సంగీతం, మెలికలూ, సందర్భమూ, కవనమూ, నటనా, ఇవన్నీ కలిసి సృజించిన‌ ప్రభావమూ, వీటన్నింటినీ సమన్వయిస్తూ వ్రాసిన ఈ వ్యాసం ఒక అద్భుతం. ధన్యవాదాలు.🌸*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దినకర్ రెడ్డి గారి వ్యాఖ్య: *ఇంగ్లీష్, హిందీ మరియు తెలుగు సినిమాల్లోని ఉదాహరణలను వివరిస్తూ సాగిన ఈ వ్యాసం చక్కగా ఉంది. సినీ సంగీతం గురించి మరింత తెలుసుకునే అవకాశం దొరికింది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జోశ్యుల ప్రకాశరావు గారి వ్యాఖ్య: *శుభోదయం.. శీర్షిక బాగుంది.. చాప్లిన్ గురించి మంచి ఇంట్రో ఇచ్చారు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరామ్ గారి స్పందన: *ఎంత అద్భుతంగా రాసారో చెప్పలేను. సినీ గీతాలలోని అంతరార్థం ఇంత నర్మగర్భంగా ఉంటుందా అనిపించింది. ఎంతో పరిశీలన చేస్తేగానీ, ఈ విశ్లేషణ చేయలేరు. హిందీ భాష మీద కూడా ఉన్న పట్టు వలనే పట్టుకోగలిగారు. మంచి writeup. 👌👏 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఆర్. వి. రాసాని గారి వ్యాఖ్య: *శీర్షిక బాగుంది. సినిమా పాటలు అంటే ఏదో ఊక దంపుడుగా గాకుండా ఆలోచనాత్మకంగాను, ప్రత్యేకంగానూ వుంది. చార్లీచాప్లిన్ సినిమాలోని పాట లయను రాజకపూర్, ఇతరులు ఎలా ఉపయోగించుకున్నారనే విషయాల వంటివి కొత్తగా అనిపించాయి.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కాళ్ళకూరి శైలజ గారి స్పందన: *అద్భుతం. ఎన్నో విషయాలు ఒక క్రమ పద్దతిలో ఎవరినీ తూలనాడకుండా ఎంచక్కా చెప్పారు. ఉదయాన్నే నా మెదడు లోపలి పొరల్లో ఒక ఆనంద రమ్య రసం చిప్పిల్లింది. ధన్యవాదాలు మీకు.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గా ప్రసాద్ గారి వ్యాఖ్య: *అత్యద్భుతంగా విశ్లేషణ చేశారు. నిజమే.. సంగీతం, సినిమాకి దేహమునకు ఆత్మ లాగా బాగా ఇమిడినప్పుడే ఆ సంగీతం పది కాలాలు నిలుస్తుంది. చార్లీ చాప్లిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనని స్ఫూర్తిగా తీసుకున్న హిందీ, తెలుగు నటులతో బాటు ప్రపంచ వ్యాప్తంగా అనేకులు ఆయనని అనుసరించారు. 🙏*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జీడిగుంట విజయసారధి గారి స్పందన: *జగదేకవీరుడు అతిలోకసుందరి లో చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్, కారవాన్ లో దయ్యా హై మై కహా ఫసీ లాంటి సిట్యుయేషనల్ సాంగ్ ఒకటుంది.. ‘యమహో’ పాటకి లీడ్ సీన్.. ఈ శీర్షిక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంది.. మూడు భాషల్లో పాటలు, సన్నివేశాలు భలే కనెక్ట్ చేసారు. రాజ్ కపూర్ చాప్లిన్‌ని ఎన్నో సినిమాల్లో ఇమిటేట్ చేస్తూ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న విషయం కూడా బాగా అనలైజ్ చేశారు శంతనూ – శర్మిష్టలు. మరిన్ని మంచి వ్యాసాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సి.ఎన్. చంద్రశేఖర్ గారి వ్యాఖ్య: *చాలా బాగా వ్రాశారు. రీసెర్చ్ థీసిస్ లా ఉంది. గ్రేట్👏. ‘పూలు గుసగుసలాడేనని’ పాట నాకూ చాలా ఇష్టం. సినీ సంగీతంలో మీకున్న పరిజ్ఞానానికి నా జోహార్లు 🙏 *

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పప్పు భోగారావు గారి స్పందన: *శీర్షిక చాలా బాగుందండి. మంచి వివరాలు పొందుపరుస్తున్నారు. చాలా సంతోషం. అభినందనలు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బ్నిం గారి వ్యాఖ్య: “ఎంత బాగుందో. అద్భుతః.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జొన్నలగడ్డ శ్యామల గారి వ్యాఖ్య: *సోదాహరణంగా చక్కగా వివరించారు. 👍*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మణి వడ్లమాని గారి స్పందన: *శీర్షిక బావుంది. చక్కటి పాటలను ఎన్నుకుని, చాలా బాగా వివరంగా రాస్తున్నారు, బాగా లోతుగా వివరాలు తెలుసుకుని రాయడంతో చాలా ఆసక్తిగా అనిపించింది. చక్కటి విషయ విశేషాలతో వ్యాసం చదివించింది. అభినందనలు.*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శాంతి శ్రీ గారి స్పందన: *నటీనటులు సినిమాల్లో పాటలు పాడే విధానం ఎలా వచ్చిందో వివరిస్తూ, దాని చరిత్ర పుటలను తిరగ వేయడం బాగుంది. చార్లీ చాప్లిన్ తో మొదలు పెట్టి, రాజకపూర్ ను దాటుకుని, కొన్ని హిందీ సినిమాల ఉదాహరణలు ఇస్తూ చక్కగా వివరించారు. ఆ తర్వాత తెలుగు పాటల గురించి ఇచ్చిన వివరణ, ఉదాహరణలు బాగున్నాయి. చార్లీ చాప్లిన్ ప్రభావం రాజ్ కపూర్ మీద ఉన్నట్లు, హిందీ పాటల ప్రభావం తెలుగు పాటలపై ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!