సంచికలో తాజాగా

Related Articles

14 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Chandrasekhar: *Simply superb. 👍🏼👌🏼👏🏼🙏🏼💐*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. యాదగిరి గారి స్పందన: *మొత్తంగా.. మీ రచన ద్వారా మరోసారి సినిమా చూసాము. నాటి చిత్రాలు వంద రోజులు ప్రదర్శింపబడటం జరిగిందంటే.. ప్రతి కళాకారుడు.. ఒక వాస్తవికతను.. చూపే లక్ష్యంతో పాటుగా.. కథా.. పాత్రల స్వభావాలు.. వాటి పట్ల ఒక పరిశోధన.. ఉన్న సాంకేతిక వసతులతోనే.. మెదడుకు పని పెట్టీ.. ప్రేక్షకులను పాత్రల్లో లీనం చేయగలిగే దృక్పథంతో పని చేశారు..
    రామారావు గారు నెగెటివ్ పాత్రలలోని పాజిటివ్‌నెస్‌ను చూపించే ఆలోచన గలవాడు.. మేఘనాథుడు.. దుర్యోధనుడు.. రావణుడు, కర్ణుడు వంటి పాత్రలను కథానాయకుడిగా చూపించి ప్రేక్షకాదరణ పొందటం అతి సాధారణ విషయం కాదు.. ఇలాంటి విషయాలను అందించినందుకు అభినందనలు..*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గాంధి గారి వ్యాఖ్య: * వండర్‍ఫుల్. ఆ ఒక్క మాటా అనగలను.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. రామచంద్ర గారి వ్యాఖ్య: *సినీమా చూపిస్తున్నారు! నేను ఆ సినిమా చూడకపోయినా మీ వివరణలో కనిపిస్తూంది.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అశ్వనీకుమార్ గారి వ్యాఖ్య: *శీర్షికకు తగ్గట్టు గానే, శంతనూ-షర్మిష్ట (రచయిత/రచయిత్రి జంట అనుకుంటా). పాట భావంతో పాటు, చిత్రీకరణను కూడా చాలా నిశితంగా పరిశీలించి, shot division వంటి సాంకేతికతను కూడా భావపరంగా వర్ణించిన విధానం చాలా గొప్పగా ఉంది. 👌👌👍👍👏👏*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గాప్రసాద్ గారి వ్యాఖ్య: *మంచి విశ్లేషణ. ఆనాటి అపురూప దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూపించారు.. కాదు వర్ణించారు. సీతారామ కళ్యాణం గానీ, భూకైలాస్ గానీ NTR నటనకు గీటురాళ్లు. అందుకే ఆయన జగద్విఖ్యాతి పొందారు.👏👏*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *రెండు పాటలు ఈసారి బోనస్. కానీ రెండో పాట కూడ కలపడం వల్ల సంపూర్ణత్వం చేకూరింది. ఇక విశ్లేషణ గురించి చెప్ఫాలంటే ప్రతి వాక్యాన్నీ ఉదహరించవలసి ఉంటుంది. Media writing అనే paper ని MA Telugu లో నేనే చెప్పాను. పాటల రచన, చిత్రీకరణ, విశ్లేషణ మొదలైనవి. ఇప్పుడు class తీసుకోమంటే నాకు రెమ్యూనరేషన్ లేకపోయినా ఈ పాట విశ్లేషణను చెప్పాలని అనిపించింది. (అంత ఆసక్తి, సాహిత్యం పట్ల ప్రేమ విద్యార్థులకే కాదు అధ్యాపకులకు కూడ లేకపోవడం విషాదం).*

  8. 8

    గోనుగుంట మురళీకృష్ణ

    రావణాసురుడి మీద చిత్రీకరించిన మూడు పాటల గురించి మీ వివరణలు చాలా బాగున్నాయి, గ్రంథాలలో వర్ణించిన ఒక పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని ఆ పాత్రలాగానే చూడటం, నడవటం, మాట్లాడటం వంటివి చేయడమే అభినయం. అలాంటి అభినయం లో ప్రవీణుడు ఎన్టీఆర్ గారు….ఆయన రావణుడిగా ఇప్పుడు చెప్పిన రెండు చిత్రాలే కాకుండా ఇంద్రజిత్, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీకృష్ణ సత్య చిత్రాల్లో కూడా నటించారు (ఉమ్మడి కుటుంబం చిత్రంలో అంతర్ణాటకంలో కొద్దిసేపు రావణుడిగా కనిపిస్తారు)…….చిత్రీకరణ పట్ల మీ పరిశీలన ప్రశంసనీయం.

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీలక్ష్మి చివుకుల గారి వ్యాఖ్య: *భూకైలాస్ లో ఆ పాటలు వచ్చినప్పుడు కళ్ళార్పకుండా చూసిన మా అనుభూతికి అక్షర రూపం ఇచ్చిన శంతనూ-శర్మిష్ట గారికి హృదయపూర్వక అభినందనలు.
    కనురెప్ప పాటలో మేము మిస్ అయిన భావాలను కూడా చక్కగా వివరించారు.
    గాయకునకు, కెమెరాకు, నటునికి, దర్శకుడికి, సంగీతదర్శకునికి మధ్య సంబంధం పంచరంగులు కలిసిన శ్వేత వర్ణం దానికి ప్రేక్షకుని తాదాత్మ్యం తోడైతే రససిద్ధి.
    ఎంత సూక్ష్మదృష్టితో చూడాలి అన్నది ఈ వ్యాసంలో చాలా బాగా అర్థమైంది అసలు ఇది పుస్తకంగా వస్తే తప్పకుండా కొనుక్కోవాలి అని ఉంది.
    వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూన్నాను.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పద్మలతా జయరామ్ గారి వ్యాఖ్య:*మహోజ్వలంగా వెలిగిన కళామతల్లి ముద్దుబిడ్డలు సృష్టించిన చిత్ర రాజాలను స్మృతిపథంలో మెదిలే అవకాశం కల్పించింది మీ write-up. నాటి నటుల నటనా కౌశల్యం , అమరగాయకుడు ఘంటసాలవారి గాత్రం కథన కల్పన, చిత్రీకరణ చాతుర్యం వేటికవే అద్వితీయాలు. మళ్ళీ చూడాలనిపించేలా ఉంది మీ వివరణాత్మక విశ్లేషణ.*

  11. 11

    కస్తూరి రాజశేఖర్

    మధుర గీతాలు – మనోహర దృశ్యాలు: Straight గా పాట, సంగీతం, దృశ్యం ల మేలు కలయిక ల గురించి చెప్పటం వల్ల సంపూర్ణం గా అనిపించి సంతోషం వేసింది. 💐

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి వ్యాఖ్య: *ఈనాటి మధుర గీతాలు శీర్షికన “శంతను – శర్మిష్ఠ” గారు పరిచయం చేసిన ‘తగునా వరమీయ’, ‘కానరారా కైలాసవాసా’ పాటలు దేనికవే అద్భుతాలు. ఇక వాటి చిత్రణ, ఎన్టీఆర్ నటన మాటల్లో వర్ణించనలవి కాదు. లంకాధీశుడిగా, ఈ రెండు పాటలలో తన విశ్వరూపం చూపించారు ఎన్టీఆర్. ఘంటసాల మేష్టారు గొంతులో పలికిన ఆర్ద్రత, విషాదం, పశ్చాత్తాపాలను తన కళ్ళతోనే అభినయించి చూపారు రామారావు. అప్పటికే, జానపద వీరునిగా, శ్రీకృష్ణునిగా ప్రజల హృదయ ఫలకాలపై నిలిచిపోయిన ఆయన, రావణుడి పాత్ర చేయాలి అనుకోవడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. బ్రహ్మ వంశజుడు, శాస్త్రాలను ఔపాసన పట్టినవాడు, సకల కళాసారంగదుడు అయిన రావణబ్రహ్మ పాత్ర పోషణలో నభూతో.. అన్న చందాన నటించారు ఎన్టీఆర్. చక్కటి పాటలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాల్యాల శ్రీనివాసరావు గారి స్పందన: *If camera speaks in Telugu, it will exactly the same words you wrote. ఒక్క ముక్కలో చూపాలి అంటే కళ్ళకు కట్టినట్టు చెప్పారు.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. Malyala Srinivasa Rao: *The joy of watching the song in film/youtube is much more after reading the above. Thank you.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!