Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధులేపనం

వెన్నెల ఇలా
దాడి చేస్తుందనుకోలా

చూపులు కూడా
కౌగిలించుకుంటాయని తెలియలా

వయ్యారాలు కూడా
వడి వడిగా పైపైకి పాకుతాయని

రెప్పల దాగిన
స్వప్నాలు స్వేచ్ఛగా రాతిరి గుండెకు చేరుతాయని

ఊపిరిసలుపనీయక
గాయపడిన గుండెకు
నీ జ్ఞాపకాల మధులేపనం పూస్తున్నా

నీ భావనా
ఊయలనుండి జారిపడిన
మది బాధను
ధ్యాన మందిరాన
ఏకాంత ప్రశాంతంతో నింపుకొంటున్నా

 

Exit mobile version