[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘మాతృవందనం’ అనే రచనను అందిస్తున్నాము.]
తూరుపుకనుమల రత్నగిరీశుడు
సత్యదేవనిలయ సన్నిధానమున
అన్నివరములిచ్చు సత్యదేవుని
సన్నిధిన ఉధ్భవించినాడు
దుడ్డువారింట దొడ్డబాలకుండు
ఆదిశంకరునిబోలు తేజమున
విమలముఖ దరహాసచంద్రికల
ఎన్నెన్నిజన్మల పుణ్యముల
ఫలమొ ఎంతసుకృతమో
చిన్నారి సోదరిది ఎంత అదృష్టమో
ఇటుఏడుతరములుఅటుఏడుతరముల
తరతరములవారిజన్మతరియించగ
శ్రీధన్వంతరీ మంగాదేవిగర్భమున
జన్మించిన శివాంశసంభూతుడు
ఆ తల్లిదండ్రుల పుణ్యముల రాశి
వేదములునేర్చిన వేదజ్ఞానవారాశి
వారిప్రాంగణము ఆయె శివకాశి
ఆపురంధ్రి అన్నపూర్ణా శివాని
ఏమిఆవినయము విమలనయనమ్ములు
దివ్యతేజాననము ఉదయాద్రిబింబము
ఆదిశంకరునివంటి శాంతవదనమ్ము
రత్నగిరీశునికరుణ కేదారమున
దైవమునుసేవించు వేదకోవిదుల
వేదఘోషలతో మంత్రార్చనలనిరంతర
పావనపవిత్రమా దివ్యధామము
పుణ్యతీర్ధ సద్జన పరోపకార పారీణులు
నిరంతరము నడయాడుపరమ
పావనధరిత్రి వారినడుమనాజీవన
గమనము ఆగమనమున మాప్రాధమిక
పాఠశాలయందు చేరిచదివిన ఆచిన్న
గణేశుడెనేడు కంచికామకోటిఉత్తర
పీఠాధిపతిఅవగ మాజన్మతరియించె
ఆనాడుఆచిన్నిబాలకుని మేధ
ఏకసంధాగ్రాహి పలికేటిపలుకులు
అంబసరస్వతి అనుగ్రహమని
యశోవంతుడగునని భావించితిని
మాతృవందనముతోపాశములు
తెంచుకొనిలోకమునకు నేడుగురువాయె
ఆ కన్నతల్లి ఎంతభాగ్యశాలి
ఎంత త్యాగమూర్తి
ఎన్నినోముల ఫలమొ
ఆ తలపుల అమృతపుసోనల
తనువు తడిసి ఈలీలలన్నియు
ఆదిశంకరులవని తలపునకువచ్చే
లీలా స్వరూపా శివా శంభో శంకరా
కారణజన్ములభువిపై నిలిపినశంకరా
ఉత్తర పీఠాధిపతికి నమోనమః
జయము జయము జయము
శుభము శుభము శుభము
శ్రీ సత్యచంద్రశేఖరేంద్రసరస్వతి స్వామికీ
జయము జయము జయము
శుభము శుభము శుభము