[శ్రీలక్ష్మి నందమూరి గారు రచించిన ‘మార్పు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
సంపదతో సమయం కొనగలమా
అందంతో ప్రేమ పొందగలమా
విజ్ఞానంతో విజ్ఞత గడించగలమా
వనరులతో వయససు తరిగించగలమా
భౌతికవాదము స్పందన నొసగునా
ఆడంబరములతో ఆనందం ప్రాప్తించగలదా
జీతముతో జీవితపు విలువ త్రూయగలమా
భోజనంతో భుక్తి తీర్చగలము
ఆలోచనతో ఆర్తి తరిగించగలము
ఆచరణతో ఆదర్శము కాగలము
నేర్పుతో నవ శకము వ్రాయగలము
ప్రాకృతత్వపు స్వేచ్ఛలో అంతిమ ప్రేరణ పొందగలము
ప్రయత్మముతో ప్రపంచము జయించగలము
స్ఫూరితో విశ్వపు మూలాలనే చేధించగలము
మాయ నుంచి ముక్తి వైపు మలుచుకుందాం
ఆశ నుంచి ఆశయం వైపు అంకురార్పణ చేద్దాం
గమనం నుంచి గమ్యం వైపు సాగుదాం