[శ్రీ రవికిరణం రచించిన ‘మానులారా జ్ఞానులారా’ అనే గేయాన్ని అందిస్తున్నాము]
పల్లవి: మానులారా జ్ఞానులారా పాదులారా సాదులారా అనుపల్లవి: ఎండైన వానైన తపమిడని త్యాగులారా కరువైన చెరువైన జపమిడని యోగులారా ॥మానులారా॥ చరణం1: పక్షులకు గూడువై భిక్షులకు మేడవై పశువులకు నీడవై పరమాత్మ జాడలౌ ॥మానులారా॥ చరణం2: మలిన జలములు తాగి మధుర ఫలములనిచ్చి మరణ వాయువు మేసి మనిషికి ఆయువు పోసే ॥మానులారా॥ చరణం3: పెళ్ళింట పందిరై దాంపత్య దండవై విందులో విస్తరై అందరికి నేస్తమౌ ॥మానులారా॥ చరణం4: భోగులకు రసమువై రోగులకు పసరువై వీణవై వేణువై ప్రాణికే ప్రాణమౌ ॥మానులారా॥ చరణం5: ఒంటిపై బట్టలై వంటకై మట్టలై కడనాడు కట్టెలై విడిపోని సుట్టమౌ॥మానులారా॥
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-1
ఆపన్న హస్తం
అనుబంధాలు
రైల్వే జంక్షన్
భూమి నుంచి ప్లూటో దాకా… -11
నిజమైన దృశ్యకావ్యం ‘శంకరాభరణం’
రూపాంతరం
‘కులం కథ’ పుస్తకం – ‘మంచితనానికి కులమేమిటి?’ – కథా విశ్లేషణ
సంగీత సురధార-9
యాత్రా దీపిక చిత్తూరు జిల్లా-5
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®