కోయిలమ్మ పాట
నెమలి ఆడే ఆట
మాకిష్టం మాకిష్టం
మందార పువ్వు
బుజ్జి బాబు నవ్వు
మాకిష్టం మాకిష్టం
నీళ్ళలో చేప
చిన్నారి పాప
మాకిష్టం మాకిష్టం
మమ్ము కన్న అమ్మ
ఆడుకునే బొమ్మ
మాకిష్టం మాకిష్టం
చేలో పండిన పంట
తియ్యనైన వంట
మాకిష్టం మాకిష్టం
కొమ్మ మీది చిలకా
రాసుకునే పలకా
మాకిష్టం మాకిష్టం
దేవుడు వున్న గుడి
చదువు చెప్పే బడి
మాకిష్టం మాకిష్టం
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.