సతత హరిత లత
ప్రపంచం చుట్టుకున్న లత
ప్రతి గుండెలో పాటైన సుమ లత
బాధల దుఃఖం దాచిన సుమధుర లత
ఆనంద ప్రేమ సీమ అంచుల సరిగమలత
ప్రపంచం పాట ఆమే లతామంగేష్కర్
ఆమె పాడిన జీవితం అందరికీ ఆదర్శ లత
మనసును కదిలింది విశ్వ కోయిల గాన లత
మట్టి మురిసేలా ఆకాశ వీధిలో పాటైంది లత
అమరం ఆమె గాత్రం ధాత్రి లత
సరిగమల సాకీ గాలికి ఊగే లత
ధన్యం ఆమె జీవితం మౌనమైన అంతరంగ లత
మనలో విహరించే భారతీయ సుందర లత
పాటే ప్రాణం వినువీధుల ఆమే అందరి లత
సజీవం పాటలో అలలై తేలే లత
చిరంజీవి ఆమె భారతవర్ష జీవన లతా
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.