28-4-25న హైదరాబాద్ రవీంద్రభారతి నందు మహతి సాహితీ కవిసంగమం 5 వ వార్షికోత్సవం సందర్భముగా నిర్వహించిన కార్యక్రమములో విశాఖపట్టణం, గోపాలపట్నంకు చెందిన ప్రముఖ కవి కె.వి.యస్ గౌరీపతి శాస్త్రిని నిర్వాహకులు ఉగాది పురస్కారముగా ‘మహతీ కవిశ్రీ’ బిరుదుతో ఘనముగా సత్కరించారు.
ఈ కార్యక్రమములో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము మాజీ ఉపకులపతి, డా. ఆచార్య కొనకలూరి ఇనాక్, ఆం. ప్ర. జానపద కళా అకాడమీ పూర్వ అధ్యక్షులు కళారత్న పొట్లూరి హరికృష్ణ, ఆం.ప్ర. బంగారు నంది అవార్డు గ్రహీత, సినీ గీత రచయిత సాధనాల వెంకటస్వామి నాయుడు, భవానీ సాహితీ వేదిక కరీంనగర్ వ్యవస్థాపక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్, సంస్థ అధ్యక్షులు డా. అడిగొప్పుల సదయ్య, ప్రధాన కార్యదర్శి పొర్ల వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భముగా సంస్థ ప్రచురించిన శ్రీ విశ్వావసు నామ యుగాది కవితా సంకలనము విడుదల చేశారు. ఇందులో గౌరీపతి శాస్త్రి రచించిన ‘యుగాల ఆది ఉగాది’ అనే కవిత ప్రచురితమైనది. ఈ సందర్భముగా అనేకమంది సాహితీవేత్తలు, స్థానికులు శాస్త్రిని అభినందించారు.