2025 మే 10 మరియు 11 తేదీలలో ఏలూరు (ఆం.ప్ర) మహాలక్ష్మి గోపాలస్వామి కళ్యాణమండపము లో 32 ప్రపంచ రికార్డులు కైవసం చేసుకున్న ఏకైక సాహిత్యసంస్థ శ్రీశ్రీ కళావేదిక (ISO గుర్తింపు పొందిన) సాహితీ సంస్థ, నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహితీసంబరాలు/సాహితీ పట్టాభిషేకమహోత్సవములు సందర్భముగా విశాఖపట్నం గోపాలపట్నం కు చెందిన ప్రముఖ కవి కె వి యస్ గౌరీపతి శాస్త్రి (వీరవతి)ని పలువురు నేతలు సాహితీ ప్రముఖుల సమక్షములో ‘కవిరత్న’ బిరుదుతో ఘనముగా సత్కరించారు.
ఈ కార్యక్రములో ఆ సాహితీ సంస్థ సిఈఓ కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రామావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరి భూషణం, కార్యదర్శి పార్ధసారధి, శ్రీనాధ కవి వంశీయుడు శ్రీనివాస శర్మ, టి.డి.పి. అధికార ప్రతినిధి లక్ష్మి కనుమూరి మొదలగు వారు పాల్గొన్నారు.
కవులనుండి ఒక్క పైసా కూడా ఆశించకుండా ప్రతిభను ప్రోత్సహించి గుర్తించడమే తమ సంస్థ అభిమతమని ప్రతాప్ ఈ సందర్భముగా తెలియజేశారు.