Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త రంగు

పండి రాలి పడిన వీరుల సావాసానికి
వీడ్కోలు చెప్తూ
జీవితపు పాఠాన్ని
నెమరేసుకుంటున్న
పెద్దతరపు చెట్లమీద
మొలిచివచ్చే
మొదటి విప్లవాల రంగు

స్వేచ్ఛగా ఎగిరే పాట రెక్క రంగు
కొత్త ఆశల నును లేత ఎర్ర రంగు
కడుపున దాచుకు పెంచే
అమ్మ ప్రేమరంగు
నిను వీడని నెచ్చెలి వలపు రంగు

ఉజ్జ్వల వికాసాన్ని పంచే
కొత్త సూర్యుడి
తొలి కిరణపు రంగు

శిశిరపు చీకటిని దాటుకుని
వెల్లివిరిసే మాధుర్యాన్ని పంచే
పులకింతల పాట రంగు

ఇది ప్రకృతి మొదటి నవ్వు రంగు

Exit mobile version