కొందరు కారణ జన్ములు
దేశమాత వరపుత్రులై
నిశ్శబ్దంగా ఉదయిస్తారు
దైవదత్త విద్యతో,కళా సాధనతో
అసామాన్య ప్రతిభతో, బహుముఖ ప్రజ్ఞతో
రసహృదయుల నోలలాడిస్తారు
మకుటంలేని మహారాజులై వెలిగి
జే జే ల హారతులందుకుంటారు
వినయంతో తమ ధర్మం నిర్వహించి
ఋణం తీర్చి మౌనంగా నిష్క్రమిస్తారు
ఒక్క గుండెగా యావద్దేశ ప్రజలశ్రుతప్తులై
అర్పించిన నివాళులందుకుంటారు
వంద కోట్ల కొక్కడు మన బాలు
మరొక్కబాలు మళ్ళీ రానే రాడు
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.