Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొరియానం – A Journey Through Korean Cinema-10

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం – Lee Eon-hee

Oldboy సినిమాలో రెస్టరెంట్ సీన్ ఉంటుంది. Punks ను చావగొట్టి తన ఫిజికల్ ఫిట్నెస్ బాగనే ఉందని తేల్చుకున్నాక (ఈ punks కూడా విలన్ చేతే ఎరేంజ్ చేయబడ్డారా అన్న కోణంలో చాలా కొరియన్ సినిమా ఫోరాల్లో డిస్కషన్ జరిగింది. అది నిజమైతే ingenious ఆలోచనే), ఒక ఎలక మొహం మనిషి ఇచ్చిన సొమ్ము, సెల్ఫోను తీసుకుని దగ్గరలో ఉన్న రెస్టరెంట్ లో దూరుతాడు ఓ డే-సు. అక్కడ సన్నివేశంలో చిన్న శబ్దం కూడా మిస్ కాకుండా చూడాలి. అప్పుడే కథలో ఉన్న గొప్ప interplay అర్థమవుతుంది.

Though Oldboy is made in colour, it’s a film in grey. There are no positive or negative characters in the entire film. We may consider Mi-do as one of the purer characters in terms of innocence. And the same applies to Lee Woo-jin’s (మర్చిపోయిన వాళ్ళకు సినిమాలో విలన్) sister.

గ్రే కలర్‌లో మొత్తం పదహారు షేడ్స్ ఉంటాయి. ఒక్కొక్క షేడ్ ఒక్కొక్క కలర్‌కు approximation లాగా పనిచేస్తుందంటారు. విచిత్రం చూడండి. పరిపూర్ణ మానవుడిలో 16 కళలు ఉంటాయంటారు మన పెద్దలు. పాజిటివ్‌గా తీసుకుంటే ఆ పదహారు కళలు శ్రీరామచంద్రునిలో ఉంటాయి. నెగటివ్‌గా తీసుకుంటే అవే కళలు రావణుడిలో ఉంటాయి. మహాభారతంలో ప్రధాన ప్రతినాయకుడైన ధృతరాష్ట్రుడిలో 8 మంచి, ఎనిమిది దుష్ట కళలు ఉంటాయి.

అసలు గ్రే రంగులోని షేడ్స్‌ను ఒక స్పెక్ట్రమ్‌లా అనుకుంటే extreme bad నుంచీ lightest bad వరకు ఉండే 16 గ్రే షేడ్స్‌ను అటు కథనాయకుడైన ఓ డే-సు, ఇటు ప్రతి నాయకుడైన వు-జిన్ చూపెడతారు. They both are the two sides of the coin, and without each other, the coin won’t exist at all. కానీ ఆ రెండు ముఖాలు మంచి కాదు. గ్రేలో షేడ్స్. ఎక్కడా ఏ షేడ్ కూడా ఒకేసారి రెండు వైపులా ఉండదు. అలా వస్తే కాయిన్ ఉండదు. కథ నిలువదు. ఈ విషయాన్ని చాలా గొప్పగా, subtle గా దర్శకుడు చూపిస్తాడు ఈ రెస్టరెంట్ సీన్ లో.

ఫోన్ మోగగానే దానికోసమే ఎదురు చూస్తున్నట్లు క్షణమాలస్యం చేయకుండా ఎత్తుతాడు. అవతల నుంచీ పలకరింపు. తెలిసిన స్వరమే. కానీ సత్వరం గుర్తించలేడు.

“ఎవరు?” అని ప్రశ్నిస్తాడు. తనలాంటి గ్రిజ్లీ వాయిస్ ఉన్న వ్యక్తే సమాధానమిస్తాడు.

“బట్టలు నచ్చాయా?”

పెదాలు కోపంతో వణుకుతుండగా, హృదయాంతరాళాల్లో భయం తాండవం చేస్తుండగా ఓ డే-సు అడుగుతాడు. “ఎందుకు?” మరుక్షణంలో ఓ డే-సు స్వరం మారుతుంది. దృఢంగా అంటాడు. “నన్నెందుకు బంధించావ్?”

ఇంతలో కెమేరా హీరోయిన్ మి-డు మీదకు మళ్ళుతుంది. ఆమె involuntary గా ఈ సంభాషణను ఫాలో అవుతూంటుంది. ఐమూలగా తల తిప్పి చూస్తుంది – అసలు ప్రమాదం ఈమెకు. జరుగబోయే కథ మొత్తం ఈమె గురించే అనే సిగ్నల్. అదెంత కల్లోల భరితమో మనకు ముందు ముందు తెలుస్తుంది సినిమాలో.

“నేనెవరనుకుంటున్నావ్?” – అవతల నుంచి సమాధానం. ఏ ప్రశ్నకూ తిన్నగా సమాధానం రాదు. ప్రతిదీ పజిల్. Something which is unknown and kept in the dark is about to ambush you any moment.

తను అనుకుంటున్న ఒక్కొక్క పేరే చెప్తాడు. ప్రతిసారీ కాదంటాడు ప్రత్యర్థి. ఒక్కొక్క పేరు చెప్తూ పోతుంటే కాదని సమాధానం వస్తుంటే ఓ డే-సు లో frustration పెరుగుతుంటుంది. మొత్తం పదహారు పేర్లు చెప్పి చివరికి… “Who the hell are you?” అంటాడు. తన స్వరంలో పదహారు స్థాయిల intensity చూపుతాడు. నటనాగ్రేసరుడు చోయ్ మి-సిక్… ఓ డే-సు గా. తెలియని భయం చుట్టుముడితే మనిషి ఎలా మృగంలా మారతాడో ఒక step by step process లో చూపిస్తాడు దర్శకుడు. ఎనిమిదే సెకన్లలో.

అదే సమయంలో విపరీతమైన భయాశ్చర్యాలతో ఉన్న హీరోయిన్ మొహం మీద క్లోజప్. ఈ కథంతా ultimate గా ఈమె చుట్టూనే తిరగబోతోంది అనే సిగ్నల్.

అటువైపు నుంచీ సమాధానం – “Me? I am a sort of scholar. My field of study is you. A scholar studying Oh Dae-su. An expert on Oh Dae-su. Who I am is not important. What’s important is ‘why’?”

ఇదంతా జరిగే లోపల కెమేరా క్రమంగా దూరంనుంచీ ఓ డే-సు ను జూమిన్ చేస్తూ ఉంటుంది. స్క్రీన్ ఎడమ వైపు కార్నర్లో హీరోయిన్ తన పని తను చేసుకుపోవటం చూపిస్తూ. మీ ఇద్దరినీ నేను కార్నర్ చేస్తున్నాను అని చెప్తూ దర్శకుడు తన పనితనం చెప్పకనే చెప్తాడు.

ఇంకా అంటాడు విలన్. “ఇదంతా ఒక జీవితకాలపు పని. స్కూల్ లో నీకిప్పుడు చదువు పూర్తైంది (15 సం॥ల బందిఖానా). హోమ్వర్క్ చేయవల్సిన సమయం వచ్చింది. ఒక్కటి గుర్తుంచుకో: అది ఒకే ఒక్క ఇసుక రేణువైనా, పెద్ద బండరాయి అయినా, నీటిలో ఒకేలా మునుగుతుంది.”

ఇక …Ing సినిమా దగ్గరకొద్దాం. దర్శకురాలు Lee Eon-hee పనితనం సినిమా ప్రతి ఫ్రేమ్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మిన్-ఆ రోడ్డు దాటబోవటం, ట్రాఫిక్‌లో చిక్కుకోవటం, ఒకతను ట్రాఫిక్ ఆపి ఆమెను పంపటం. ఇదయ్యాక మాంటేజస్, ఇంతకి మునుపు చెప్పుకున్న లల్లాల్ల లల్ల… background score తో పడతాయి. ఒకవైపు జీవితం ఇంత అందంగా ఉంటుందా అనేటట్లు. బ్రైట్ విజువల్స్. పిల్లలు ఎవరి పని వారు చేసుకుంటూ క్లాస్‌లో. మధ్యలో హీరోయిన్ మందులు మింగటం, పని సరిచూసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటం… వీటితో క్షణాల్లో మిన్-ఆ ప్రస్తుత జీవితాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఆమె చుట్టూ ఎలాంటి ప్రపంచం ఉందో చూపుతుంది.

మిన్-ఆ మిగతా వారిలా ఆటలు ఆడలేదు. కానీ ఆ సమయంలో క్లాస్ బోర్డ్ మీద ఒక స్కెచ్ వేస్తుంది. ఆ స్కెచ్‌లు వివిధ డాన్స్ భంగిమలలో ఉన్న తనవే. లేదా తనలాంటి అమ్మాయివే. తనకు ballet dancer కావాలనే కోరిక కదా. వాటిముందు తాను కూడా డాన్స్ చేస్తున్నట్లు అబినయిస్తుంది. తన మోము మీద తెలియని ఆనందం. ఇదంతా ప్రజంట్ టెన్స్ అని సూచిస్తూ… (actually it’s present continuous tense – జీవితం నడుస్తూనే ఉంటుంది అని చెప్తూ) సినిమా టైటిల్ వస్తుంది.

…Ing.

Blank dark screen తరువాత ఒక బ్యాలే. టీవీలో. విజువల్స్ కాస్త బ్లర్‌గా ఉంటాయి. హీరోయిన్ కల నిజమౌతుందా లేదా అని అనుమానం రేకెత్తిస్తూ. మిన్-ఆ దాన్ని చూస్తుండగా వాళ్ళ అమ్మ వస్తుంది. చేతిలో తినుబండారాలు తెస్తూ. అడుగుతుంది.

“Why do you get excited while watching ballet every time?”

“ఎంత బాగుందో కదా!” మిన్-ఆ సమాధానం.

పగ, ప్రతీకారం తెలియని జీవితాలు ఎంత సుఖంగా ఉంటాయిగా కదా!

“జీవితంలో ఒక్కసారైనా చూడగలనా? మన కొరియాకు ఈ ట్రూప్ (టీవీలోది) వస్తుందా?”

“అక్కడికే వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది?” అమ్మ మి సుక్ అంటుంది.

“నిజంగా?” ఆశ్చర్యపోతుంది మిన్-ఆ.

“నిజంగానే. మన రెస్టరెంట్ అమ్మేస్తున్నాను. మనం అక్కడికే వెళ్ళిపోదాం. నీకు ఇష్టం కదా.”

మిన్-ఆ కళ్ళలో ఆశ్చర్యానుమానాలు. తల్లీ కూతుళ్ళు ఒకేసారి కేరింతలు కొడుతూ వాటేసుకుంటారు.

ఇంతలో మిన్-ఆ కు చిన్న అనుమానం. “ఒట్టు!”

అప్పుడు చెప్తుంది అమ్మ. సరదాగా. నిన్ను నవ్విద్దామని అన్నాను అని.

క్షణకాలం డిజపాయింట్ అయినా మిన్-ఆ కళ్లలో సరదా అయిన ఆనందం. Oldboy restaurant scene సంభాషణతో దీన్ని పోల్చండి. అది ఎంత intense గా గుండె చిక్కబట్టేట్టు ఉంటుందో ఇది అంత హృద్యంగా, మనసు తేలికపడేలా ఉంటుంది. నిజానికి ఈ సీన్‌లో ట్రాజడీ ఎక్కువ. అందులో అసలు సమస్య కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవచ్చు. పగ, ప్రతీకారం వదిలేస్తే. ఎందుకంటే ఓ డే-సు ఎంత తప్పు చేసినా 15 సంవత్సరాల జీవితం బందిఖానాలో నడిచింది. కుటుంబం విచ్ఛిన్నమైంది. ఇక్కడ మిన్-ఆ మరణం ఖచ్చితం.

ఊఁహూఁ మనిషి మనసు లోతులు అర్థం చేసుకోవటం బహు కష్టం.

సుఖం, దుఃఖం కూడా మంచీ చెడు లాగా ఒక కాయిన్‌కు రెండు ముఖాల లాంటివి. ఖం అంటే ఆకాశం. అక్కడంతా శూన్యం. ఏమీ ఉండదు. దాని ముందు సు పెడితే మంచి. దుః పెడితే చెడు. బాధ… ఆ పెట్టేది ఎవరు? మనమే. దేన్నీ వదిలేయలేము. అన్నీ పట్టుకుని వేలాడతాం. కనుకనే ఇన్ని ఇబ్బందులు. Live and let live. Let’s leave it and move on. Let’s go ahead and make beautiful things happen. అని ఎంతమంది అనుకుంటారు?

కూతురు ఎంతో కాలం బతకదు అని తెలిసిన తల్లి ప్రతిక్షణాన్నీ అందంగా మార్చాలని చూస్తుంటుంది …Ing లో. Oldboy లో పగ, ప్రతీకారాలతో రగులుతూ ఒకరి జీవితాన్ని నరకం చేయటమే కాకుండా తన జీవితాన్నీ నరకం చేసుకుంటాడు ఓ డే-సు మీద obsession తో వు-జిన్. ఎవరు గొప్ప? ఆరోగ్యం ఉండీ, ఇంకా జీవితం ఉండీ ఆటలో పావుగా మారి గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు క్షోభ పడుతూ ఓ డే-సు కూడా బావుకున్నదేమీ లేదు.

అందుకే మన జీవితానికి…

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: Lee Eon-hee

అయితే బావుణ్ణు అనిపిస్తుంటుంది. అయినా నా పిచ్చి కానీ, చిన్న పిల్లలు పడితే నేల మీద కొట్టి సంతృప్తి పరిచే పెద్దవాళ్ళు కాదూ ఈ పగలు, ప్రతీకారాలు మొగ్గలోనే మనలో రేకెత్తించేది? తెలియకుండా subconscious లో!

Chapter 8 Epilogue

Oldboy restaurant scene కేవలం సినిమా ప్లాట్ పరంగానే కాదు. సోషల్ కామెంటరీగా కూడా ఉంటుంది (you’re my field of expertly అనే డైలాగ్). కొరియాలో కూడా చదువుల విషయంలో మనలాగానే విపరీతమైన పోటీ. హైస్కూల్ చివరికొచ్చిన విద్యార్థులు రోజుకు ఇరవై గంటలు అదే పనిగా చదవటం, స్కూల్‌లో గడపటం నార్మల్. చదువుకుని, మంచి ఉద్యోగం రాకపోతే సామాజికంగా వెనకబడిపోతామని భయం. అందుకే తల్లి తండ్రులు పిల్లలను అదే పనిగా రాపాడతారు. వారికి వేరే వ్యాపకం ఉండటం సహించరు. చదువు. చదువు. చదువు. అది కూడా టెక్నికల్ చదువులే చదువులు. మనలాగే fine arts కూటికా గుడ్డకా అనే బాపతే. అందుకే తన తండ్రి ధాటికి ఫొటోగ్రఫీ అంటే మక్కువ ఉన్నా, Peppermint Candy సినిమాలో హీరో వేరే మార్గం పడతాడు.

ఈ పోటీనే, ఈ రుద్దుడే ఎలా పిల్లలను ప్రభావితం చేస్తాయో Our Twisted Hero లో కూడా దగ్గరగా చూస్తాం. వాటి వల్ల కలిగే విపరిణామాలను కూడా చూస్తూనే ఉన్నాం.

ఫిర్?

పదకొండో ఎపిసోడ్‌లో చూద్దాం!

Exit mobile version