Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొన్ని పొడుపు కథలు

[బాలబాలికల కోసం కొన్ని పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

1.
కొండంత తల్లి గోలీలంత పిల్లలు
తల్లి పచ్చన పిల్లలు ఎర్రన

2.
ఆకుపచ్చని ఆకు
తెల్లని ఆల్కలీ
నల్లని విత్తు కలిపితే
ఎర్రని ద్రవం తయారవుతుంది
ఏమీటీ రంగులు? ఎక్కడ?

3.
తల్లేమో పందిరెక్కి పైన కూర్చుంటుంది
పిల్లలేమో పందిరి పట్టుకొని వేలాడాయి!
ఎవరా తల్లీ పిల్లలు?

4.
మూడు అరల్లో పిల్లలు భద్రం
మురిపించే సుగంధ ద్రవ్యం!

5.
మెండల్ ప్రయోగాల తీగలు
తీగ తీగకు వేలాడే కాయలు
కాయ చీల్చితే పచ్చని ముత్యాలు

6.
బంగారు మేని ఛాయ
పొట్టపై నిలువు గాటు
క్లోరోఫిల్ కన్నతల్లి

7.
కాటుక రంగు పిల్లల్ని
కడుపులో దాచుకున్న
మిసిమి మేను గల అమ్మ
ఎవరా అమ్మ! ఎవరా పిల్లలు?

8.
ఒంటి నిండా పొరల చీరలు
తెలుపు ఎరుపు రెండు రకాలు
ఇవి లేనిదే చేయరు కూరలు
తల్లి కూడా చేయదిలా మేలు

9.
కాగితాలు ఉండ చుట్టినట్లుగా
ముడతల మధ్య దాగిన సిగ్గరి
క్యా బే అని హుంకరిస్తూనే
జీ అంటూ మర్యాదిచ్చే నేర్పరి

10.
పేరులో ఏనుగుంటుంది
దారిలో వేపకు పాకుతుంది
కూరలో వేసుకుంటారు!

11.
దీని పేరు కొలకేషియా
పుట్టిందేమో మలేషియా
రెండూ ఉన్నది ఏషియా

12.
ఈ కర్ర కాని కర్రకు
ఒళ్ళంతా తీపి
రసమంతా పిండామో
మిగిలేది పిప్పి

13.
సపోటా రంగు చర్మం
ఆకుపచ్చని కండ భాగం
పక్షి పేరున్న పండు ఇది

14.
తెల్లగా బిళ్ళల్లా ఉంటుంది
పంచదార కాదు
ఘాటైన వాసన ఉంటుంది
అగరుబత్తీ కాదు
దేవుడి గదిలో ఉంటుంది
కుంకుమ కాదు / కొబ్బరి కాయ కాదు

 

జవాబులు
1. మర్రిచెట్టు 2. ఆకు, వక్క, సున్నం 3. ద్రాక్ష గుత్తులు 4. యాలాకులు 5. పచ్చి బటానీ 6. గోధుమ గింజ 7. బొప్పాయి 8. ఉల్లిపాయ 9. క్యాబేజీ 10. కరివేపాకు 11. చేమదుంప 12. చెరుకు 13. కివి 14. కర్పూరం

Exit mobile version