సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Sudha Rani

    ఇది శ్రీ బసవరాజు అప్పారావుగారు బాపూజీ పైన రచించిన మా గాంధి అనే గీతం కదా. చాలా ప్రసిద్ధమయిన కవిత ఇది. కొల్లాయి గట్టితేనేమి మా గాంధి కోమటైతేనేమీ అని పాట ప్రారంభమవుతుంది. ఈపాట పూర్తి పాఠం ఇది

    174. మాగాంధి
    కొల్లాయి గట్టితే నేమీ,
    మాగాంధి
    కోమటై పుట్టితే నేమీ? కొల్లాయి …
    వెన్నపూసా మనసు
    కన్నతల్లీ ప్రేమ
    పండంటిమోముపై
    బ్రహ్మతేజస్సు కొల్లాయి …
    నాల్గుపరకల పిలక
    నాట్యమాడే పిలక
    నాలుగూ వేదాల
    నాణ్యమెరిగిన పిలక కొల్లాయి …
    బోసినోర్విప్పితే
    ముత్యాల తొలకరే
    చిఱునవ్వు నవ్వితే
    వరహాల వర్షమే కొల్లాయి …
    చకచక నడిస్తేను
    జగతి కంపించేను
    పలుకు పలికీతేను
    బ్రహ్మవాక్కేను కొల్లాయి …
    కౌశికుడు క్షత్రియుడు
    కాలేద బ్రహ్మఋషి
    నేడు కోమటిబిడ్డ
    కూడ బ్రహ్మర్షాయె కొల్లాయి …
    ఇది బసవరాజు అప్పారావుగారి గీతం
    మరి తాళ్ళపూడి గౌరిగారి కవితాత్మక వర్ణన ఎక్కడ ఉంది?

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!