Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కయ్యూరు హైకూలు 1

ల్లె మొగ్గలు
తల ఆరబోసాయి
పగలే వెన్నెల

కుసుమాలన్నీ
సిగ్గు పడుతున్నాయి
తుమ్మెద వాలి

ఆమె బుగ్గలు
సిగ్గుల మొగ్గలైనాయ్
తొలి చూపుకు

నడిచే చెట్టు
ఊరు,వాడల లోన
వలస కూలీ

చైతన్య దీప్తి
సమస్త జీవులకు
రవి కిరణం

Exit mobile version