Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 5

డాదికి జెండా
రెండు సార్లు కాదు
గుండెలో
నిత్యం ఎగరాలి

తాను కరుగుతూ
తిమిరంతో పోరాడుతుంది
క్రొవ్వొత్తి
ఎంత త్యాగ‌శీలి

శ్వాస
నిన్ను బ్రతకనిస్తుంది
ఆశ
నీకు బ్రతుకునిస్తుంది

ధరలకు
రెక్కలు సరే
ఆదాయానికి
తోక ఉండాలి కదా

Exit mobile version