Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 2

చెట్లు
నిలబడే ఉంటాయి
నిన్ను
సగర్వంగా నిలబెట్టడానికి

చెట్లు జతలుగా
సేద తీరుతున్నాయి
బహుశా
సూర్యాస్తమయం కాబోలు

చెట్లకు
వ్యథలుంటాయి
ఇవ్వడమే కాని
తీసుకోవడం చేతకాదు

దోసిళ్ళతో
నక్షత్రాలను పట్టాను
మనిషికి
అత్యాశ కదా!

ధరణి
ఎప్పుడూ సహనశీలే
అన్నిటిని
తనలో దాచుకుంటుంది

ఎక్కడ ఆపావో
అక్కడే మొదలు పెట్టు
ఇక ఆపడం
ఎవరి తరం కాదు

Exit mobile version