కవిత్వం..
కొమ్మల మాటున దాగి కమ్మగా కూసే కోయిలమ్మల రాగం!
కవిత్వం..
అవని అంతటా శాంతి కపోతంలా విహరించే స్వేచ్చా గీతం!
కవిత్వం..
మనస్సులకి నిత్య ఉత్సాహాన్ని అందించే సుమధుర గేయం!
కవిత్వం..
ప్రణయ నాదంలా ఆకట్టుకునే అనురాగం!
కవిత్వం..
హృదయాంతరాల తంత్రులను మీటే సమ్మోహనం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.