Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవిత్వం ఎందుకు?

[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘కవిత్వం ఎందుకు?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నసులోని భావాలను
మనం వినేటట్లు వ్యక్తపరచుటకు.

సత్యాన్ని – అసత్యాన్ని
స్పష్టంగా వెలికి తీయుటకు.

సమస్యలను సమాజానికి
తేటతెల్లంగా తెలియజేయుటకు.

జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని
అందరితో పంచుకునేందుకు.

భిన్నాభిప్రాయాల మధ్య
అవగాహన వంతెనను నిర్మించేందుకు

వ్యక్తిగత, సామాజిక మార్పుల
పరిణామాలను విశ్లేషించేందుకు.

జోడు గుర్రాల జీవిత సమరాన్ని
అజేయంగా గెలిచేందుకు!

Exit mobile version