Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవితావేశం

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కవితావేశం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మిటో కలం
కదులుతోంది
కదం తొక్కుతోంది
కవితలల్లుతోంది
నిన్నా మొన్నా లేని
వెర్రి ఆవేశం
నేడు ఎందుకో
కవితగా మమతగా
నన్ను దాటుకుని
నాలో నుంచి
ఎగిసిపడుతోంది
ఒడిసిపట్టాలంటే
కుదరదంటోంది
ఇంతకీ ఈ కవితావేశం
ఈ మమతావేశం
ఎందుకో ఏమిటో

Exit mobile version