Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవితాక్షరాలు

[యామిని కోళ్ళూరు గారు రచించిన ‘కవితాక్షరాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

సూర్యోదయంతోనే మొదలయ్యేది
సన్నిహితంగా భావించే సౌందర్యమది
సువాసనలతో కూడిన విజ్ఞానగుళికది
సుందర సుమధుర సుమనోహరమది
సువాసనలు వెదజల్లుతూ ఆస్వాదించమనేది.

అనంతానంతమైన అపార భావసంపదది
అందరి అంతరాల్లో దాగిన స్వీయ నైపుణ్యమది
అంతరంగాన సాధనతో పదునుపెట్టమనే ప్రతిభది
అణువణువున ప్రవహించే ప్రవాహమది
అనుభవాలని మౌనంగా సంధించే తూటా అది..

కదిలే కాలంతో పరుగులు తీయించేది
కనులువిప్పి చూడమనే నర్మగర్భ నిజమది
కనులముందు కదలాడే సజీవ భావుకతది
కవిత్వప్రవాహ సేవా సాహితీ బృందమది..

కవి సృజనాత్మకతని తెలుపుతూ సేవా సాహితీ
కవి బృందాలు జ్ఞానామృతం ప్రజలకు అందిస్తూ
కవులు అందరి ఆదరాభిమానాలు చూరగొంటూ
కవి పాఠకమదిని కదిలించేలా నిజాన్ని‌ నిర్భయంగా
కవులు సాహితీ బృందంలో కవితాక్షరాలని నింపాలి.

Exit mobile version