Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవితా వసంతము

[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘కవితా వసంతము’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

కులు డుల్లిన శిశిరపు మోడుల
అనము లద్దగ వచ్చిన వసంతమా
నీ రాకకు స్వాగతమమ్మా..
నీ ప్రతిభకు వందనమమ్మా..
అనముల అందము
వనముల సొగసులు వర్ణించగ
విచ్చేసిన నా కవితా వసంతమా
స్వాగతమమ్మా.. సుస్వాగతమమ్మా..
పల్లవించిన కోకిల గానంలో
కుసుమాక్షర పద నర్తనలో
ప్రభవించిన భావ సారస్వములో
తారసపడిన తామరమా
హోయలోలికించే నా కవితా వికాసమా
స్వాగతమమ్మా.. సుస్వాగతమమ్మా..
మండుటెండల మల్లెలు పూయిస్తావు
తాపము తీర్చ తాటిముంజు లందిస్తావు
మధురఫల మామిడి రసఝరిలో ఓలలాడిస్తావు
పసందైన పనసల రుచు లందిస్తావు
చెరకుతీపి రసవాహినిలో చెడుగుడు లాడిస్తావు
వలపు పక్షుల వేదనలను పరిమార్చగ
సుందర సముద్ర తీరాల విహరింప జేస్తావు
ఇన్నీ వర్ణించగ మా పెదవుల కులుకులాడ
పలుకులమ్మచే పదనిసలు పలికిస్తావు
అందుకే ఓ కవితా వసంతమా నీకు
ఈ కవితోత్సవ శుభవేళల పలుకుతున్నా..
వినమ్ర పూర్వక స్వాగతమమ్మా.. సుస్వాగతమమ్మా..

Exit mobile version