[‘కౌశిక్ – కుందేలు’ అనే పిల్లల కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]
చాందీపూర్ అనే గ్రామంలో కౌశిక్ అనే పిల్లాడు ఉండేవాడు. వాడు చాలా చురుకైనవాడు. కానీ బయటకు ఆడుకోడానికి వెళ్ళినప్పుడు అమ్మకు చెప్పేవాడు కాదు. తల్లి గాభరా పడేది. కౌశిక్ ఉండే ఇంటి దగ్గరలో ఒక పెద్ద మఱ్ఱి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద తన స్నేహితులతో కలసి రోజూ మట్టితో గూళ్లను కట్టి వాటిని ఆకులతో అలంకరించి ఆడుకునేవాడు. ఒకరోజు సాయంత్రం మర్రి చెట్టుకు దగ్గరలో కౌశిక్‌కి తెల్లని కుందేలు కనిపించింది కుందేలుని పట్టుకొని ఆడుకోవాలనుకున్నాడు. సరదా పడి కుందేలు దగ్గరికి వెళ్ళాడు. కౌశిక్‌ని చూసి కుందేలు భయపడి పొదల్లోకి పారిపోయింది. చుట్టూ వెతికాడు, ఎక్కడా కనపడలేదు.
ఏడుస్తూ “కుందేలూ! కుందేలూ! ఒకసారి నా దగ్గరికి రావా, ఎత్తుకుంటాను” అన్నాడు కౌశిక్.
“నేను రాను. నాకు భయం” అంది కుందేలు పొదల్లోంచి.
“నేను నీ జట్టు ఉంటాను. నిన్నేమీ చేయను. మనిద్దరం కలిసి ఆడుకుందాం.. రా” అని బ్రతిమలాడాడు కౌశిక్. జాలిపడి పొదల్లోంచి బయటకు వచ్చింది కుందేలు. ముట్టుకుని ముద్దాడి మురిసిపోయాడు కౌశిక్.
అలా కొన్నాళ్ళకి వారిద్దరు మంచి స్నేహితులయ్యారు.
ఒకరోజు వడివడిగా ముందుకు వెళ్తున్న కుందేలు నేస్తాన్ని చూశాడు కౌశిక్. ఏమయ్యిందోనని గాబరా పడుతూ “మిత్రమా, మిత్రమా” అని అరిచాడు. అయినా ఉలుకు పలుకు లేకుండా ముందుకు సాగింది కుందేలు. వెనకాలే వెళ్ళాడు కౌశిక్. కొంతదూరం వెళ్ళాక పొదలచాటున ఉన్న బొరియ దగ్గరికి వెళ్ళి కప్పి ఉన్న మట్టిని బయటకు లాగింది కుందేలు. కాసేపటి తర్వాత బొరియలోంచి పిల్లలన్నీ బయటకి వచ్చేయి. వాటికి కడుపునిండా పాలిచ్చింది. మళ్లీ తిరిగి పిల్లలన్నీ బొరియలోకి వెళ్లిపోయాయి. మట్టితో బొరియను కప్పివేసింది.
“కుందేలూ కుందేలూ, నీ పిల్లలు ఉండే బొరియని మట్టితో ఎందుకు కప్పావు?” అని అడిగాడు కౌశిక్.
“శత్రువుల కంటపడకుండా ఉండాలని అలా చేసాను” అంది.
“అలా చేస్తే నీ పిల్లలు చచ్చిపోవా?” అని సందేహం వ్యక్తం చేశాడు కౌశిక్.
“మట్టి పొరల మధ్య ఉండే ఖాళీ ద్వారా గాలి పీల్చుకుంటాయి” అని చెప్పింది.
అమ్మ పిలుపు విని కుందేలుకు టాటా చెప్పి ఇంటికి చేరుకుని జరిగినదంతా తల్లికి చెప్పాడు కౌశిక్.
“ఏ తల్లి అయినా పిల్లలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటుంది. నువ్వు కనపడక ఎంత గాభరాపడ్డానో తెలుసా?” అని అక్కున చేర్చుకుంది తల్లి. అమ్మ మనసు తెలుసుకున్న కౌశిక్ నాటి నుంచి అమ్మకి చెప్పకుండా బయటకి వెళ్ళేవాడు కాదు. కొడుకులో వచ్చిన మార్పును చూసి మురిసిపోయింది తల్లి.
కాశీవిశ్వనాధం పట్రాయుడు వృత్తిరీత్యా ఆంగ్ల భాషా ఉపాధ్యాయులు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నివాసి. ఎక్కువగా బాలసాహిత్యము మీద దృష్టి, అప్పుడప్పుడు సాంఘిక కధలు రాస్తూ ఉంటారు. విద్యార్థులను బాల రచయితలుగా తీర్చిదిద్దడం, వారిచే వివిధ సేవాకార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. ‘జనజీవన రాగాలు’ వచన కవితా సంపుటి, జిలిబిలి పలుకులు బాగేయసంపుటి, దేవునికో ఉత్తరం, అద్భుతం, కాశీ మావయ్య కథలు, తాతయ్య కల మొదలగు బాలల కథా పుస్తకాలను వెలువరించారు. సహస్రకవిమిత్ర, లేఖా సాహిత్య మిత్ర, కవితా విశారద, జాతీయ ఉత్తమ బాలసేవక్, ఉత్తమ ఉపాధ్యాయ ఇలా మరెన్నో.. బిరుదులు పొందారు. అంతేకాక పిల్లలకోసం “కాశీ మావయ్య కథలు” యూ ట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
99 సెకన్ల కథ-33
99 సెకన్ల కథ-44
నిన్నటిదాకా శిలనైనా…
సినిమా క్విజ్-26
ఫీల్ గుడ్ చిత్రం హ్రిదయం (మలయాళం)
అమెరికా నానీలు!
లెదర్ శాస్త్రవేత్త – విశ్వవిఖ్యాత సాంకేతికవేత్త – పద్మశ్రీ డా. నాయుడమ్మ
తందనాలు-6
సినిమా క్విజ్-75
మానవ సమాజంతో మమేకమౌతూ..
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®