సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Dr. Kothari vani chalapati Rao

    బాగుంది రంగనాథం గారూ పౌలస్త్యహృదయం ..! దీనిగురించి విన్నాను గానీ ఇంత విపులంగా, ఈ పుస్తకంలో ఏముంది అన్నది .. ఈ మీ వ్యాసం ద్వారానే తెలిసింది .. నవవిధ భక్తులు తెలుసుగాని వైరభక్తి గురించి ఇంత విస్తారంగా ఇప్పుడే తెలిసింది .. రామాంజనేయ , కృష్ణార్జున యుద్ధఘట్టాలలోని పూర్వకథలలో ఈ వైరభక్తి ఛాయలు కనిపిస్తాయిగాని .. రావణుని వైరభక్తి మాత్రం భలేగుంది .. 😊కథానాయకుని గుణగణాలు లోకప్రసిద్దం కావాలంటే ప్రతినాయకుని పాత్రచిత్రణ కూడా బాగుండాలి .ఇందులో .మంచి అంతా ఆయనకే దక్కనీ .. మాటల అంతరార్ధం అదే అనిపించింది .తనని తాను స్వగతంలో రావణుడు సమర్ధించుకోవటం లో కూడా కవి కాటూరి వారు ఔచిత్యాన్ని బాగానే పోషించారు 😊మొత్తానికి వెరైటీ ఆర్టికల్ .. ఇంకా చాలావుంది చెప్పటానికి మీ ఆర్టికల్ గురించి …కామెంట్ .పెద్దదయిపోతుందనిగానీ ..! మీరు ఇచ్చిన పద్య ఉదాహరణలు చూసాక తెలిసింది ఇది ఎంత సరళ సుందర వైవిధ్యభరిత కావ్యమో .. అభినందనలు .. ధన్యవాదాలు మీకు ..💐🙏

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    “పౌలస్య హృదయం” లో రావణుడిది వైరభక్తి గురించి చాలా విపులంగా, పద్యాలతో బాగా వివరించారు. రిఫరెన్స్ గా భద్రపరచుకోవలసిన వ్యాసం ఇది…. ఈ కథ చిన్నప్పుడు రేడియోలో ఏకాంకిక గా విన్నట్లు గుర్తు.,పింగళి, కాటూరి వారలదే కావచ్చు.

  3. 3

    ఎం.వి.ఎస్. రంగనాధం

    క్రింద ఇచ్చిన సందేశం లక్కరాజు ఇందిర గారు (ఈ వ్యాసం ఎవరికైతే అంకితం ఇచ్చానో ఆ కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి పెద్ద కుమార్తె) పంపినది:

    కీ.శే. కాటూరి వేంకటేశ్వరరావు గారి పౌలస్త్య హృదయం – ఖండ కావ్యంపై మీరు రాసిన వ్యాసం హృద్యంగా ఉంది. ఈ వ్యాసంలోని విషయాలని కీ.శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి (మా నాన్న గారి) ద్వారా విన్నానని, 44 వత్సరాల క్రితం విన్న విషయాసక్తితో – పౌలస్త్య హృదయాన్ని కూలంకషంగా చదివి, వివిధ ప్రచురణలను సేకరించిన మీ సాహిత్యాభిలాష అభినందనీయం. ఈ వ్యాసాన్ని మా తండ్రిగారికి అంకిత మిచ్చిన మీ గురుభక్తికి వినమ్ర ప్రణామాలు. మిక్కిలి శ్రద్ధాసక్తులతో 39 పద్యాల విశ్లేషణ – వచనరూప వివరణ – మాబోటి సామాన్య పాఠకులకి అవగతమయ్యేలా అందించారు. కావ్యం మూలాల్లోకి వెళ్ళి – వస్తుసేకరణ ద్వారా వివిధ అంశాల వివరణ, విశ్లేషణ – రచనా కాలాన్ని గ్రహించిన మీ విషయాసక్తి అభినందనీయం.

    పౌలస్త్య హృదయం – రావణుడి వైరభక్తికి నిదర్శనం. సముద్రుడితో – స్వగతంగా – రావణుడి అంతరంగ ఆవిష్కరణ కళ్ళకు కట్టినట్లుగా – విజువలైజ్ (visualize) చేశారు. ఈ ఖండ కావ్యం మహాకవి కాటూరి వేంకటేశ్వరరావు గారి “కాల్పనిక” – శైలికి మచ్చుతునక. రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ, సీతాయాః పతయే నమః – ఇన్ని పేర్లతో పిలవబడే శ్రీరామచంద్రుని చేతిలో మరణాన్ని ఆహ్వానిస్తున్న రావణుడి వైరభక్తి ప్రస్ఫుటమైంది.

    1వ పద్యంలో వ్యాస విశ్లేషణ – లోకరీతిని తెలియజేస్తూ –
    2వ పద్యంలో – మనస్సులోని భయాన్ని గాంభీర్యంగా ప్రదర్శిస్తున్న తీరు –
    3వ పద్యంలో రావణుడి మనస్సులోని భయానికి – ప్రకృతిని ఛాయామాత్రంగా చెప్పటం – షేక్స్పియర్ (Shakespeare) మాక్బెత్ (Macbeth) నాటకీయతని ప్రతిబింబిస్తోంది.
    4, 5 పద్యాలలో – శత్రువుకి అహ్వానం పలకటం – వీరోచితం –
    6, 7 పద్యాలలో – గతస్మృతులను పునరావలోకనం చేసుకోవటం –
    8, 9 పద్యాలలో – శ్రీరాముడిని ఆగ్రహింప చేయడానికి తాను ఏఏ పనులు చేశాడో – వివరణాత్మకంగా విపులీకరించారు.
    10, 11 పద్యాలలో – రాముడి శోకవర్ణన – తనను విస్మరించాడు రాముడని రావణుని వేదన – “నన్ను మరచివిభుడు” అనటం – వైరభక్తికి పరాకాష్ఠ.
    12, 13, 14 పద్యాలలో – రావణుడి దుష్టకార్యాలు – రాముడి దృష్టిని ఆకర్షించడానికి చేసిన పనులు – సామాన్య శైలిలో వివరించిన తీరు బావుంది.
    15, 16, 17 పద్యాలలో – మానవ ప్రవృత్తి, లోకరీతి, రావణుడి చేత స్వామిద్రోహం – సీతాపహరణం – వివరణ సార్వజనీనంగా ఉంది.
    18, 19, 20 పద్యాలలో – నవవిధ భక్తిమార్గాలు – రావణుడికి నచ్చక పోవటం – కొత్తమార్గంలో భగవంతునికి వైరిగా – వైరభక్తి ద్వారా స్వామిని చేరాలని – “కల సకలాధ్వముల్ ….” వ్యాసకర్త ఐచ్ఛికాన్ని ప్రతిఫలిస్తొంది.
    21వ పద్యంలో – రావణుడి స్వాతిశయం – ఈ పద్యాన్ని మా నాన్నగారి నోటివెంట పలుమార్లు విన్న అనుభూతిని – వ్యాసకర్త రంగనాధంగారి ద్వారా గుర్తు చేసుకుంటున్నాను.
    22, 23, 24 పద్యాలలో – స్వామి పరాక్రమ వర్ణనలో – స్వామిభక్తి ప్రకటన – బావుంది.
    25, 26 పద్యాలలో – రాముని అందచందాల వర్ణన – అద్భుతం – “పుంసాం మోహనరూపాయ” –
    27, 28 పద్యాలలో – సముద్రుడి ధన్యత – 28లో తోయధీ ధన్యుడవు నీవు – స్వజనం అందరి కంటే – “నేనే” ఎక్కువ మక్కువ అని రావణుడు ప్రకటించుకోవటం – బావుంది.
    29, 30, 31 పద్యాలలో – ఆశ్రిత జనబాంధవుడైన – నా స్వామిని చూసే భాగ్యం – సీతాపహరణం వలన దక్కిందనుకోవటంలో – ద్వైదీభావన ప్రకటితమైంది.
    32, 33, 34 పద్యాలలో – అవతారపురుషుడు రాముని – చంద్రహాస ఖడ్గానికి “మేటి పండుగ” అనటం – రావణునికి మాత్రమే సాధ్యం. వీరవ్రతానికి పరాకష్ఠ.
    35, 36, 37 పద్యాలలో – నిరాయుధునిగా వచ్చే స్వామికి తన చేతులు ఆయుధాలుగా ధరింప చేస్తాననడం – భక్తి పారవశ్యానికి పతాక స్థాయి.
    38, 39 పద్యాలలో – “రాముని రాకకై” “విరహాగ్నిగ్రాగు” – అనటంలో పరిపూర్ణ భక్తి – unconditional surrender to God.

    కాటూరి వారి శైలిని – 39 పద్యాలలోని పౌలస్త్య హృదయం – ఖండకావ్య నిశిత పరిశీలన చేసిన వ్యాసకర్త, మిత్రులు – శ్రీ రంగనాధంగారికి – సాహిత్యాభినందనలు. వ్యాసం ముగింపులో మీరు పద్యరూపంలో సమర్పించిన పద్యకుసుమాంజలి ఈ ఖండకావ్యానికి కవి పట్ల మీ భక్తితత్పరతని చాటాయి. మన దైనందిన జీవితంలో ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు మనకి తారస పడతారు. చాలా విషయాలు తెలుసుకుంటాము. 4 దశాబ్దాల క్రితం విన్నవి, స్మృతిపథంలోని విషయాలకి మనోజ్ఞమైన అక్షర రూపాన్ని ఇచ్చి – కావ్యానికి పునఃప్రాణప్రతిష్ఠ చేశారు మీరు. మీ ఈ ప్రయత్నం శ్లాఘనీయం. మీరు మరిన్ని పరిశీలనా వ్యాసా లందించాలని ఆకాంక్షిస్తున్నాను. ఇంత శ్రమకోర్చి చేసిన – మీ సాహితీప్రక్రియారూపాన్ని మా తండ్రిగారు – కీ. శే. లక్కరాజు శ్రీనివాసరావు గారి స్మృతికి అంకితమిచ్చిన – మీకు సాహితీ ఋణగ్రస్తులం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!