సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    నిజమేమిటో తెలియజేశారు. సాహిత్య లోకం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పిన సూచనలు ఆచరఇంచదగ్గవి.

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    A comment by a talented young writer, who is now away from literary circles
    తెలుగు సాహిత్యంలో ఇప్పుడిప్పుడే కొత్తగా అడుగులు వేస్తున్న వాళ్ళు, ఎటు పోవాలో దారి తెలియక నన్ను సంప్రదిస్తూ ఉంటారు. ఒకప్పుడు దీపదారిగా వాళ్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఉండేదాన్ని కానీ, ఇప్పుడు మాత్రం ఎవరిని పట్టించుకోవట్లేదు. ఎవరైనా నన్ను అడుగుతున్నా సరే నేను సాహిత్యానికి గుడ్ బై చెప్పేసాను అని చెబుతూ ఉన్నాను. అంతేకాకుండా కొంతమంది రైటర్స్ కి కూడా దూరమైపోయాను. నా ఫోన్లో నుండి వారి కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసేసాను. దీనంతటికీ కారణం ఒకటే.. మన సాహిత్య సమాజంలో ఉన్న ఈ పక్షపాత ధోరణి.
    ఎంత లోతుగా పాతుకు పోయింది అంటే, ఒకప్పుడు కొత్త కొత్త ఐడియాలతో కొత్త కథలు రాసే నేను, ఒక వర్గం పట్ల సానుభూతితో, పీడకులు పీడితులు అంటూ కథలు రాయడం మొదలు పెట్టాను. దానికి కారణం ఒకటే ఎవరో నన్ను ఉత్తమ రచయిత్రి గా గుర్తించాలి అని 😂😂😂 ఇప్పుడు ఇది నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు మాత్రం, వాళ్ళు చెప్పిన ఉత్తమ కథలు అన్నీ చదివాను. అన్నిట్లోని ఒక వర్గం మీద ద్వేషం.. మరో వర్గం మీద సానుభూతి. వాటి నుండి బయటకు వచ్చాక కానీ నాకు నేను ఎందులో కూరుకు పోతున్నానో నాకు అర్థం కాలేదు. To be Frank.. ఇప్పుడు ఇది రాస్తున్నప్పుడు కూడా, నా మీద నాకే నవ్వొస్తుంది. ఎవడో గొట్టం గాడు నా కథ సెలెక్ట్ చేయలేదని బాధపడ్డా 😂 ఇప్పుడు మాత్రం నా అమాయకత్వం మీద నాకే నవ్వొస్తుంది. ఇప్పుడు దీనిని చూసి కూడా వాళ్ళు తిట్టుకుంటారేమో. బట్ ఎవ్వరు ఏమనుకున్నా నాకు ఫికర్ లేదు. నాకు నచ్చినట్టు ఉండడం నేర్చుకున్నాను. ఏ చట్రంలోనూ బందీని కాదలుచుకోలేదు.
    How silly.. బట్ తెలుగు కథ ఈ మాఫియా చేతుల్లో నుండి బయటకు వస్తే కానీ బాగుపడదు. ఇది రాయడానికి కూడా కారణం నా లిస్టులో ఎంతోమంది కొత్తగా కథలు రాస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను అనుభవించింది మీరు అనుభవించకండి. నీ మైండ్ లో ఉన్న కొత్త ఆలోచనల్ని వినూత్నంగా రాయండి. అంతేకానీ ఎవరో ఉత్తమ కథలు ఇలా ఉంటాయని చెప్పడంతో, అవి రొడ్డ కొట్టుడు ఏడుపు కథలు రాసి తగలడకండి. మీరు నమ్ముతాతో నమ్మరో నేను దెయ్యాల మీద కథలు రాశాను, ప్రేమ మీద కథలు రాశాను. ఆఖరికి కీటో డైట్ మీద కూడా కథ రాశా. కానీ ఇప్పుడు నా ఆలోచనలన్నీ, అయ్యయ్యో ఒక వర్గం బాధ పడిపోతుంది. ఇంకో వర్గం వాళ్ళని వేపుకు తింటున్నారే. ఇదే నా కథలకు పీఠిక అవుతోంది. నిజం చెప్పాలంటే నాకు పేరు వచ్చాకే, నేను కథలు రాయడం పూర్తిగా మానేసాను. ఒకప్పుడు అపరాత్రి అర్ధరాత్రి అని కూడా లేకుండా, కథలే ఈ ప్రపంచంగా బతికిన నేను, ఇప్పుడు కథలు అంటేనే అమ్మో తెలుగు కథలా అని మొహం పెడుతున్నాను. నాకు తెలుగు సాహిత్యం పరిచయం లేనంతవరకు నా ప్రపంచం నాది. నా ఊహల ప్రపంచంలో, కొత్తగా రెక్కలు తొడిగిన గువ్వల, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నా క్రియేటివిటీకి పదును పెట్టుకుంటూ రాస్తూ వెళ్లేదాన్ని. అప్పట్లో నాకు అతి తక్కువ కాలంలో గుర్తింపు రావడానికి కూడా కారణం ఆ క్రియేటివిటీ.
    కానీ ఎప్పుడైతే తెలుగు సాహిత్య కారులు పరిచయం అయ్యారో, నన్ను నేను తక్కువ చేసుకుంటూ వాళ్లను ఎక్కువ చేసి చూసానో అప్పుడే నా పతనం మొదలైంది. అది గ్రహించాక ఇక సోషల్ మీడియా కి సాహిత్య గ్రూపులకి అన్నిటికీ గుడ్ బై చెప్పాను. ఇప్పుడు మళ్లీ ప్రశాంతంగా నా ప్రపంచంలో నేను బతుకుతూ, నాకు నచ్చినట్టు రాసుకుంటున్నాను.
    ఎవరో పబ్లిష్ చెయ్యారేమో అన్న చింత లేదు. ఎవరో నన్ను మెచ్చుకోరు అనే బాధ లేదు. ఎవరికో గుర్తింపు లభించేస్తుంది అని పోటీలో ఉరుకులు పరుగులు లేవు. మళ్లీ మొదటి నుండి మొదలు పెట్టాను కాబట్టి, నేర్చుకుంటూ పోతున్నాను.
    ఇక సలహాలు సూచనలు ఇవ్వమంటూ వస్తున్న కథకులకు చెప్పేది ఒక్కటే, మిమ్మల్ని మీరు నమ్మండి. మురళీకృష్ణ గారి స్టైల్ లో చెప్పాలంటే, ఈ ముఠాలలో మాఫియాలో చేరితే, ఎక్కడికి పోయేది లేదు. 😁 కేవలం నీ ఆలోచనలు మీకు తోచినట్టు రాయండి. ఎవరి ప్రభావము మీ మీద పడకుండా చూడండి. ఇప్పుడు జనాలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. వాళ్లు గిరిగీసి పెట్టడం వల్లే తెలుగు సాహిత్యానికి మనవాళ్లు దూరం అవుతున్నారు. పీడితులు పీడకలు అని పిడకలు వేసే సాంప్రదాయం కాకుండా, సమాజ శ్రేయస్సుకు నీకు కనిపించిన సమాజాన్ని, నీ దృష్టి కోణంతో ఆవిష్కరించడానికి ప్రయత్నించండి. అంతకుమించి మీకు ఏ కథా వర్క్ షాప్ లు అవసరం లేదు. ఏ పని పాట లేని మీటింగ్లు అవసరం లేదు. సమయం చాలా విలువైనది. దానిని దేశ విదేశీ సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగని ఎవరో చెప్పిన ఉత్తమ సాహిత్యాన్ని మాత్రం చదవకండి. అది మిమ్మల్ని కచ్చితంగా మార్చేస్తుంది 😁 అప్పుడు మళ్లీ నాలాగే మొదటి నుండి మొదలు పెట్టాల్సి ఉంటుంది. Detox చేసుకోవడం అంత ఈజీ కాదు సుమ.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!