Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కసువు

“మన చేనులా వుండే కసువునంతా కొలత యేయాలని
వుంది తాతా” అంట్ని.

“అది అయ్యే పని కాదు మనవడా. కావాలంటే కసువు కోయి
మోపు కట్టు” అనిరి.

“ఏల అయ్యేలే తాత”

“ఏలంటే కసువు నేలంతా వుంది, నువ్వు యేలంత వుండావు?”

“తాత కొలతకి యేలే కదా మొదలు”

“నిజమే మనవడా, కాని కసువు ముందు పుట్టి ఆమీట
కొలత పుట్టే చూసి నడి (నడు)”

“సరే తాత”

“కానీ మనవడా”

***

కసువు = గడ్డి

Exit mobile version