సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    రామలక్ష్మి

    చాలా బాగుంది సర్ వ్యాసం.

  2. 2

    Kovela

    Wonderful narration. Every so-called feminist.. liberals.. must read this atleast once.

  3. 3

    Srinivasa prasad

    “ఎవరు అసుయాగ్నితో కాలిపోతూ కూడా ప్రశాంతంగా వుండగలరో అతడే నిజమైన నాయకుడు” అద్భుతమైన వాక్యం.. నవలలోని పలుచోట్ల ఇటువంటి పరిణితి చెందిన సందేశాలు వుండటం విశేషం.. మురళీకష్ణ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు

  4. 4

    Dr.Trinadha Rudraraju

    ఈ అంశం ఒక్క చరిత్ర సామజిక విషయమేకాక, ఇంద్రియ నిగ్రహం మరియు తత్త్వం గురించి అద్భుతంగా ఆవిష్కరించారు.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ కోవెల సంతో‌ష్ కుమార్ గారి వ్యాఖ్య
    పైకి కనిపించే విభిన్నత్వాన్ని చూసేవారికి అంతర్గతంగా ఉండే ఆత్మ కనిపించదు. భారతదేశ విషయంలో, భారత జాతి విషయంలో, భారతీయుల చరిత్ర విషయంలో జరిగింది ఇదే. ఈ దేశాన్ని మాతృభూమిగా, పుణ్యభూమిగా, కర్మభూమిగా గుర్తించి ఆరాధించడం.. దేశభక్తిని, కర్మ నిరతిని మేళవించుకొని ఆధ్యాత్మిక సాధన చేయడం అన్నది ప్రపంచంలో భారతీయులకు మాత్రమే సాధ్యమైంది. ప్రపంచానికి అత్యున్నతమైన సాంస్కృతిక జీవన విధానాన్ని, పరిణత నాగరకతను అందించిన సమాజమిది. అనంత వైవిధ్యంతో కూడిన భారత భూభాగం, దానిపైన జనజీవితాన్ని పైపైన చూసేవారికి ఆశ్చర్యం గొలపవచ్చు. కానీ, ఈ వైవిధ్యాల వెనుక లోతుల్లో దేశమంతటా అనుస్యూతంగా అల్లుకొని ఉన్న ఐక్యాన్ని గుర్తించే నిశిత దృష్టి లేకపోవడం వల్ల ఈ దేశ సంస్కృతి, జీవన విధానం అర్థం కాక.. అర్థంపర్థంలేని వ్యాఖ్యానాలు చేసి.. కొన్ని తరాలకు తమ నాగరకత ఔన్నత్యం ఏమిటో తెలియకుండా చేశారు. పైపై విషయాలను మాత్రమే చూపించగల ఇంద్రియ జ్ఞానం మీద ఆధారపడితే పెడధోరణులే పొడచూపుతాయి. ఆ ఇంద్రియాలకు అంతకుమించి లోతుల్లోకిపోయి తత్త్వాన్ని విస్పష్టంచేసే శక్తిలేకపోవడమే దీనికి కారణం. అనంతమైన వైవిధ్యాన్ని అధిగమించి.. భారతీయ చరిత్ర, సాంస్కృతిక జీవన విధానంలోని సూక్ష్మ తత్త్వాన్ని గ్రహించగల నిశిత మనస్సుకే పూర్ణవ్యక్తిత్వం గోచరిస్తుంది.
    ప్రస్తుతం సంచిక మ్యాగజైన్ లో విఖ్యాత చరిత్రకారుడు కస్తూరి మురళీకృష్ణ ఈ సూక్ష్మ తత్త్వాన్ని దుర్భిణి పెట్టి వెలికితీస్తున్నారు. ఇంతకాలం వెకిలి వ్యాఖ్యలతో, వెకిలి రాతలతో ఈ దేశ చరిత్రను, ఈ దేశ నాగరకతను విధ్వంసంచేసిన వారికి.. మూలాలను పెకిలించి చూపిస్తున్నారు. గత నలభై వారాలుగా కాశ్మీర రాజతరంగిణి సంచిక మ్యాగజైన్ లో ధారావాహికంగా వస్తున్నది. ఇది సీరియల్ కాదు. భారతీయ చరిత్ర పునర్నిర్మాణం. భారతీయ చరిత్రపై ఇంతకాలం కప్పి ఉంచిన అన్ని పొరలనూ ఛేదించుకొని లోపలికి వెళ్లి.. సునిశిత మనస్సుతో వేల ఏండ్ల నాడే భూమి నుంచి ఆకాశం దాకా ప్రజ్వరిల్లిన సర్వతోముఖ వికాస భారతాన్ని ఆవిష్కరిస్తున్నారు.
    నివురు గప్పినంతవరకే నిప్పు పైకి కనిపించదు. అక్కడక్కడా సన్నని పొగలా మాత్రమే దాని ఉనికి బాహిరమవుతూ ఉంటుంది. పైనున్న నివురు తొలిగిపోయిందంటే.. చాలు.. నిప్పు ప్రజ్వరిల్లుతుంటుంది. కాశ్మీర రాజతరంగిణి ద్వారా కస్తూరి మురళి చేసిన పని ఇదే. నివురును తొలిగించారు. ఇప్పుడు నిప్పులాంటి వాస్తవ భారతీయ చరిత్ర వెలుగులీనుతున్నది. ఇప్పటివరకు మనకు తెలిసిన ఏ చంద్రగుప్తుడో, అశోకుడో, లేక చోళులో, పల్లవులో కాదు.. వీళ్లందరినీ మించిన.. అసమాన నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకొన్న ఎంతోమంది చక్రవర్తులను గురించి మనకు తెలియనే లేదు. ఎవరూ చెప్పనే లేదు. ఎంతసేపు అక్బర్ ది గ్రేట్, అశోక ది గ్రేట్ అన్నారే కానీ.. ఇదిగో ఈ దేశాన్ని చొరబాట్ల నుంచి రక్షించి.. మతోన్మాదుల నుంచి కాపాడి.. సుశ్యామలంగా పరిపాలించిన ఎందరో చక్రవర్తులు లుప్తంగా ఉండిపోయారు. వీరిని గురించి ఈ తరానికి తెలియటం అత్యంత అవసరం. మనల్ని మనం తెలుసుకోకుండా ముందుకు ఎలా సాగుతామో అర్థంకాని విషయం.
    ఈ రాజులు పరిపాలనా పరంగానే కాదు.. సామాజికంగా, జీవన శైలి పరంగా కూడా ఈ దేశానికి, ఈ సమాజానికి ప్రేరకులు. ఏ దశలోనూ ఈ దేశ విచ్ఛిన్నతకు, సామాజిక అసమానతలకు ఆస్కారం ఇచ్చినవారు కాదు. సమస్యలు వస్తే తాము కష్టపడ్డారే తప్ప.. సామాజిక విలువలను లుప్తం కానివ్వలేదు. మహత్తరమైన రాజులంటే వీరే. 21 వ శతాబ్దంలోనూ మనం ఏ విధంగా ఉండాలో.. ఏ విధంగా జీవిస్తే సమాజం సామరస్యంగా, సౌభ్రాతృత్వంతో ఉండగలదో వందల ఏండ్లనాడే ఆచరించి చూపించినవారు. మతావలంబనలో కానీ, వృత్తుల పరంగా కానీ, వర్ణాల పరంగా కానీ, స్త్రీల విషయంలో కాశ్మీర రాజులు అనుసరించిన విధానం తక్కిన ప్రపంచం నుంచి భారతదేశాన్ని ప్రత్యేకంగా చూపిస్తున్న సహజ జీవ లక్షణం. ఇక్కడ నేను ఒక్కో ఉదాహరణ చూపించుకొంటూ పోతే.. మొత్తం నలభై భాగాలను ప్రత్యేకించి ప్రస్తావించాల్సి వస్తుంది. ఇవాళ సోకాల్డ్ ఫెమినిస్టులు, లిబరలిస్టులు.. మేధావులమంటూ తమకు తామే ప్రకటించుకొని సంఘాలు పెట్టుకొన్నవారు. హేతువే ప్రమాణమని ట్యాగ్‌లైన్ తగిలించుకొని తిరిగేవారు.. ఒక్కసారి ఈ కాశ్మీర రాజతరంగిణి చదవాలి. వీరిలో నూటికి నూరుపాళ్లు సంస్కృతం తెలిసినవారు ఉంటారని నేను అనుకోను. వీరిలోచాలామంది కల్హణుడు ఇలా అన్నాడు. వాల్మీకి ఇలా అన్నాడు, వ్యాసుడు ఇలా అన్నాడని తీర్మానాలు చేసేస్తుంటారు. కానీ వీరిలో ఏ ఒక్కరికీ సంస్కృతం తెలిసి ఉండదని నా ప్రగాఢ నమ్మకం. ఎవరికైనా తెలిసి ఉంటే.. సంతోషం. కనీసం కస్తూరి రాస్తున్న ఈ ధారావాహికను చదవండి. ఇందులో సూత్రీకరించిన అంశాలను ఎక్కడ అంగీకరించాల్సి వస్తుందేమోనని భయపడాల్సిన పనిలేదు. భారతీయులై ఉండి.. ఈ దేశాన్ని.. ఇక్కడి అసమానతలను రూపుమాపాలని.. అణచివేతకు గురయ్యారంటూ మహిళలకు విశృంఖల స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న.. హిందువులు మాత్రమే మతోన్మాదులని, హిందుత్వంలో మాత్రమే మతోన్మాదం ఉన్నదని.. సంభావించే మహామానవులు ఒక్కసారి చదవండి. సతార్కికంగా విమర్శించుకొండి. ప్రకృతి పోషణ, భౌగోళిక పరిస్థితులు, చారిత్రకానుభూతులు, మత సిద్ధాంతాలు, రాజకీయాశయాలు.. అన్నింటి సమాగమంతో విశిష్టదేశంగా తన్ను తాను తెలుసుకొని ప్రపంచ సాంస్కృతిక చరిత్రలో మహత్తరమైన పాత్రను నిర్వర్తించి, మానవత్వ వికాసంలో భారతీయ భావనను ప్రత్యేకంగా నిర్వచించగలిగిన, ప్రపంచ జీవన విధానంలో భారతీయ జీవన విధానాన్ని విశిష్టంగా పాదుకొల్పగలిగిన భారతీయత గురించి తెలుసుకోవాలంటే కస్తూరి మురళీకృష్ణ కాశ్మీర రాజతరంగిణి ఒక్కసారి.. మరొక్కసారి.. ఇంకొక్కసారి చదవాలి.
    భారతీయత అన్నది లుప్తమైతే.. మానవ సంస్కృతి అసంపూర్ణమవుతుంది. ఎందుకూ పనికిరానిదవుతుంది. భారతం అంటే జీవద్భారతం. దాని అస్తిత్వానికి ఇవాళ సజీవ సాక్షాత్కారం కాశ్మీర రాజతరంగిణి.
    కోవెల సంతో‌ష్ కుమార్

  6. 6

    Sanath

    అహల్యా శాప విమోచనం విషయంలో మీరు వ్రాసినది సరి చూసుకోమని ప్రార్థన.
    ఈ క్రింది విషయం బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి (చందోలు శాస్త్రి) గారిచే వ్రాయబడింది.

    వ్యాస వాల్మీకులు యథాతథముగా వారివారి నాయకులను, పాత్రలను తీర్చిదిద్దిరి కాని సామాన్య కవులవలె కల్పనా భూయిష్టముగ రచింపలేదు. భారతమున యుధిష్ఠిరుడు – ”అశ్వత్థామా హతః కుంజరః” అన్న మాటను పాత్ర పోషణమునకుగా దీసివేయకుండ ఉన్నది యున్నట్లు వ్రాసెను. కాబట్టి సామాన్య కావ్యముల దృష్టిలో పై వ్యాస వాల్మీకుల కావ్యముల చేర్చరాదు. పై కవులు సృష్టించిన పాత్రలు మరే కావ్యమందున్నను, అందలి విషయమే ప్రామాణికమని భావించరాదు. అహల్యా సంక్రందనము, తారాశశాంకము, పారిజాతాపహరణము మొదలగు కావ్యములలో పౌరాణిక పాత్రలున్నవి. అందలి కవి వర్ణిత విషయమే ప్రమాణమని భావించరాదు.
    రామాయణమున అహల్యా వృత్తాంతము రెండుచోట్ల వచ్చుచున్నది. ఈ రెండింటిలో ఐక్యతలేదు. మొదట విశ్వామిత్రుడు రామునికి చెప్పిన కథ లోకమున వాడుకలోనున్న కథ. అసలు కథ ఉత్తర కాండలో బ్రహ్మ చెప్పినది. గౌతముడు రాజస తపస్సు చేయుచుండగా ఒకసారి పితృలోకము లన్నియు మండిపోచొచ్చెను. అపుడు బ్రహ్మ అహల్యను సృష్టించి యుంచగా అందఱు ఆమెకై తహతహలాడిరి. కాని ఎవ్వరికిని బ్రహ్మ ఆ కన్య నివ్వలేదు. ఇంద్రుడు మాత్రము ఆ కన్నెను తనకిమ్మని అడుగడాయెను. గౌతముడును ఆ అతిలోకసుందరిని అడుగలేదు. అపుడు బ్రహ్మ చేయునదిలేక అహల్యతో సంచారముగా వచ్చి ఆమెను కొన్నాళ్ళపాటు ఆశ్రయమున నుందుకొనవలసినదిగా గౌతముని కోరి అచ్చటనుంచి పోయెను. కాని లోకోత్తర సౌందర్యవతి యగు నామెను చూచినను గౌతమునకు కామాపేక్ష కలుగలేదు. బ్రహ్మ మిక్కిలి నిరాశుడైపోయెను. పితృలోకజ్వాలలు ఆరుటలేదు. గౌతముడు తపస్సును విడుచుటలేదు. కాని 1000 సంవత్సరములకు పిమ్మట గౌతముడే స్వయముగ అహల్యను బ్రహ్మ కర్పించుటకు తెచ్చెను. బ్రహ్మ గౌతముని ఆమెను వివాహము చేసికొమ్మని చెప్పెను. కాని గౌతముడు ఆమెను వివాహమాడియు తపస్సు మానలేదు. అపుడు ఇంద్రుడు ఒక పన్నాగము పన్నెను. స్త్రీ విషయకోపముగాని తపస్సు మాన్పలేదని భావించి, గౌతముడు స్నానమునకు పోవునట్లు కోడియై కూసెను. కాని గౌతముడు స్నానమునకు పోగా గంగ నిద్రలో నున్నది. కాబట్టి, ఇది వేళగాదని గౌతముడు తిరిగి రాబోవుచున్నాడు. ఈ లోపల ఇంద్రుడు గౌతముడై అహల్యను తాకి నేను ఇంద్రుడననియు చెప్పెను. అపుడహల్య భర్తయొక్క కోపతాపము లసాధ్యమని హెచ్చరించినది. భర్తకు కోపము వచ్చిన నేమి చేసెదవని అడిగినది అంతలో గౌతముడు వచ్చుచుండగా ఇంద్రుడై ఎదురు వచ్చెను. గౌతముని కోపము ఇంద్రుని శపించినది. ఈ కోపములో పితృలోకము చల్లారినది. అహల్యను ఱాయిగమ్మనియు శపించెను. అహల్య ఎంతయో తనతప్పులేదని ప్రాధేయపడినది. అపుడు గౌతముడు దివ్యదృష్టితో చూడగ ఇంద్రుడు కామముతో గాక, తనపై కోపముతో తపస్సు చెరచుటకు వచ్చినట్లు తెలిసికొన గల్గెను మరియు అహల్యకు శాపవిమోచనము రామపాద రజస్పర్శమనియు వివరించెను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!