సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    రాపాక పవన్ స్వరూప్

    ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Dr. Trinadha Rudraraju

    ఆసక్తికరంగా ఉంది. పాలనలో(రాజు) మార్పు కొంతవరకు ప్రభావితం కావచ్చు కాని సంస్కృతిలో మార్పు!….ఇది నాగరికత అధోకరణం మరియు ఆత్మహత్య తప్ప మరొకటి కాదు.
    కొంతమంది “చరిత్రకారులు” కారణంగా నష్టం లోతుగా మరియు పూర్తిగా అనిపిస్తుంది.

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీ శ్రీధర్ చౌడారపు గారి వ్యాఖ్య:
    సంపాదకులకు ఒక్కమాట….
    చాలా పత్రికల్లో,అదీ అంతర్జాల పత్రికల్లో కూడా ఒక సూచన గమనిస్తూ ఉంటాం… “మీ రచన స్వంతమనీ, ఇతరులు రచనలకు అనుకరణ, అనుసరణ, అనువాదం కాదని హామీ పత్రం జతపరచమని”. అలాగే సదరు రచన గతంలో ఇతరపత్రికలలో ప్రచురింపబడలేదని కూడా…
    ఇకపోతే‌ ఇప్పుడు అంటే అంతర్జాల విస్తృతియుగంలో (ఇంటింటా ఓ పత్రిక బదులు అరచేతిలో చరవాణి లాంటి నేటి సమయంలో) సదరు “రచన ఏ బ్లాగులోనూ ప్రచురించబడలేదని హామీ” ఇవ్వమంటున్నారు. మరికొందరు మరింత ముందడుగు వేసి “ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా రాయబడలేదనీ / ప్రచురించబడలేదనీ హామీ” కోరుతున్నారు.
    ఇది ఎంతవరకు సమంజసం….
    ప్రతి రచయిత (కవి/ రచయిత/ కవయిత్రి /రచయిత్రి) తాను రాసిన దానిని పత్రికలకు పంపేముందు పదిమందికీ చూపించుకుని మంచీ చెడుల విశ్లేషణ చేసుకుంటాడు. అలాగే మార్పులు చేర్పులకై సలహా సంప్రదింపులు చేస్తాడు… బాగా చేయితిరిగిన వాడైతే తప్ప. గతంలో ఆ సన్నిహితులు స్థానికంగా ఉండే మిత్రులు, సాహిత్య శ్రేయోభిలాషులు అయి ఉండేవారు. రాసిన రచనను వారందరూ చదివేవారు. మంచీ చెడూ గమనించి చెప్పేవారు. అవసరమైన మెరుగులు దిద్దేవారు / దిద్దమనేవారు. అలా ఆ రచనాకర్తకు కావలసిన భుజం తట్టే ప్రోత్సాహాన్ని ఇస్తూనే, పత్రికలకు పంపి ప్రచురణను ఆశించే ధైర్యాన్నీ అందజేసేవారు. అలా అయినా అవి అన్నీ ప్రచురితం అయ్యేవా అంటే … ఉహూ. ఒకటి, రెండు శాతం మాత్రం సఫలం కాగా, మిగతావి విఫలం అయ్యేవి. అయినా ఆ పట్టువదలని ఆ విక్రమార్కులు, రాయడం… పత్రికలకు పంపడాన్ని వదిలిపెట్టేవారు కాదు.
    కానీ నేటి ఈ ఆధునిక యుగంలో, స్థానికంగానే కాకుండా అంతర్జాలం పుణ్యమా అని దూర దూర ప్రాంతాల వాళ్ళూ మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానం కలిగినవాళ్ళుగా మారిపోయారు. ప్రత్యక్షంగా ఒకరికి ఒకరు తాకనైనా తాకని వారు కూడా సన్నిహిత సంబంధాలను నెరపుకుంటున్నారు. అటువంటప్పుడు ఒకవ్యక్తి తాను రాసిన రచనలను… అనగా కథ, కవిత, పద్యం, వ్యాసంలాంటివాటిని తన సన్నిహితుల ( ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాల్లో ఉన్నవారి) తో పంచుకుంటే తప్పేమిటి… ? వారి సలహాలతో తగిన మార్పులు, చేర్పులు చేసుకుంటే ఇబ్బంది ఏమిటి … ??
    ఫేస్బుక్, వాట్సాప్ లలో వచ్చిన రచనలు అన్నీ పత్రికల్లో ప్రచురింపబడేంత స్థాయిలో ఉంటాయా, సంపాదకుల మెప్పుపొందేంత గొప్పగా, నవ్యమైన వస్తువు, రచనా విలువలు, చక్కనిశైలిని కలిగి ఉంటాయా అంటే సందేహమే… అయినప్పటికి వందవరకు కథలూ, వేయివరకు కవితలు ఈ మాధ్యమాల్లో ప్రతిరోజూ పుట్టుకొస్తున్నాయి. అందులో చాలా మట్టుకు పుబ్బలో పుట్టి ముఖంలో మాడిపోయేవే. అయినా అలుపెరుగని ఆయా రచయితలూ కవులూ రాసీరాసీ తమ రచనల్లో రాసినే కాదు వాసినీ పెంచుకుంటున్నారు. నాణ్యతనూ, మంచి శైలిని సంతరించుకుని, ప్రచురణకు నోచుకునే యోగ్యతను తమ రచనలకు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో “ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాల్లో పదిమందితో పంచుకున్న రచనలను మా పత్రికల్లో ప్రచురించకూడదని మేం పెట్టుకున్న నియమం” అని పత్రికాసంపాదకులు అనడం ఎంతవరకు సమంజసం.
    ఫేస్బుక్, వాట్సాప్ మాధ్యమాల్లో తమ రచనలను నిత్యం పంచుకుంటూ, పదిమంది చేత మెప్పు పొందుతూన్నవాళ్ళు తమ రచనలను పత్రికలకు మరి ఎందుకు పంపుతున్నట్టు…? ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న రచన, పత్రికల్లో ప్రచురింపబడిన దానికి సమానం కాదు కనుక. అది వారికీ తెలుసు…
    ఒక పాఠకుని, అభిమాని, సన్నిహితుని దృష్టికోణంనుంచి కాకుండా సంపాదకుని దృష్టికోణం నుంచి చూస్తేనే రచన యొక్క నాణ్యత తెలుస్తుందనేది‌ వారికి ఎరుకే గనుక. శంఖంలో పోసిన నీరే, పవిత్రతీర్థంగా మారినట్లు, పత్రికలో ప్రచురితం అయితేనే ఒక రచనకు తగిన గొప్పదైన విలువ సంప్రాప్తిస్తుంది అని తెలుసు కనుక. అందుకే కవులైనా, రచయితలైనా పత్రికలకు తమ రచనలు పంపి ప్రచురణ అయ్యేంతవరకు చకోరపక్షులై ఎదురుచూసేది.
    కొందరంటారు… “ఈ సామాజిక మాధ్యమాల్లో చదివిన రచనలను మా పత్రికలో వేస్తే ఎవరు చదువుతారు” అని. అది సరైన అభిప్రాయం కాదు. తప్పకుండా చదువుతారు. ఒక వ్యక్తికి కాంటాక్ట్స్ ఎన్ని ఉంటాయి. వంద, రెండు వందలు, ఐదు వందలు, వేయి…. సదరు వ్యక్తి తరచుగా రచనలు చేస్తుంటే, అందులో పస లేకపోతే ఆ కాంటాక్ట్స్ లోని పది పదిహేను మంది తప్ప మిగిలిన ఎవ్వరూ చదివరు. కానీ అదే వ్యక్తి రచన ఒక పత్రికలో ప్రచురితం అయితే అతని / ఆమెకు సంబంధించిన అందరు కాంటాక్ట్స్ ఆ రచనను తప్పకుండా చదువుతారు. అదే పత్రిక గొప్పదనం.
    సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, వాట్సాప్ లు పత్రికలకు పోటీ కాదు… ప్రత్యామ్నాయం కూడా కాదు. గుణాత్మకమైన, నాణ్యత కలిగిన రచనలు తయారయ్యేంత వరకు ఈ మాధ్యమాలు రచనలు చేసేవారికి పాఠశాలలు… ప్రయోగశాలలు.
    ప్రతీ రాయసకాడు రాస్తున్నవన్నీ మీరు ప్రచురించలేదు కదా. మీకూ కొన్ని విలువలూ, విధానాలు ఉంటాయి కదా. వాటిని మీరలేరు కదా… అటువంటప్పుడు పాఠకలోకానికి రచనలను విస్తృతంగా చదివి ఆనందించే అవకాశం దూరంచేయడం ఎందుకు.
    అందుకే అందరు పత్రికా సంపాదకులకు ఓ విజ్ఞప్తి… మీమీ పత్రికల్లో మంచి కథలు, కవితలు… బాగున్న, మీరు ఆశిస్తున్న నాణ్యత కలిగిన రచనలు ప్రచురించండి… అవి గతంలో ఫేస్బుక్ వాట్సాప్ లాంటి అంతర్జాల మాధ్యమాల్లో చెడతిరిగినవి అయినా కూడా… కాపీవి కానంత వరకూ, మరో పత్రికలో ప్రచురితం కానంత వరకు…
    చదివే మాకూ మంచి, విలువైన రచనలు కొన్ని మీ పత్రికల ద్వారా అందుతాయి.
    ధన్యవాదాలతో…. మీ శ్రీధర్ చౌడారపు (15.06.2021)

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!