కరుణించు తల్లీ! మహంకాళీ భక్తి శ్రద్దలతో నిన్ను కొలిచెదమమ్మా! సింహవాహినీ ప్రీతి పాత్రమైన బోనాలతో క్రొత్తగా చేసిన ఘటాలతో వేపాకు,పసుపు,కుంకుమలతో కోటి కాంతుల ప్రమిదలతో మ్రొక్కెదమమ్మా! శాంభవి మా ఇంటి ఆడపడుచువి మా కంటి ఇలవేల్పువి మము కాపాడ రావమ్మా! నాడు దుష్టులను శిక్షించి మము రక్షించినావు వరదలనుండి ఒడ్డు చేర్చినావు గుత్త వ్యాధులనుండి బ్రతికించినావు నేడు ‘కరోనా’ నుండి కాపాడినావు లాల్ దర్వాజా శాకాంబరి కర్షకులు, కార్మికులు సామాన్యులు సైతం స్వేద బిందువులను నూనెగా మలచి కాయ కష్టాన్ని వత్తిగా చేసి దూప,దీప,నైవేద్యాలతో ఆర్తిగా నీకు హారతులనిచ్చి విశ్వ శాంతికై నిన్ను వేడుకుంటున్నారు కరుణించు తల్లీ! మహంకాళీ లాల్ దర్వాజా సింహవాహినీ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సంచిక – పద ప్రతిభ – 34
మోక్షం
పూచే పూల లోన-24
అజ్ఞాత స్వాతంత్ర్య సమరవీరుల గాథల అక్షరరూపం – ‘తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య యోధులు’
అలనాటి అపురూపాలు-37
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-32
సంకల్ప శక్తి
జ్ఞాపకాల తరంగిణి-23
ఇదేనా మన సంప్రదాయ మిదేనా?
నీ రూపే (గజల్)
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®