సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీకంఠ స్ఫూర్తి గారి వ్యాఖ్య: *బహు బాగు బాగు.. కన్యాశుల్కం నాటక ప్రదర్శన వార్తా కథనం.. అభినందన వందనం! – శ్రీకంఠ స్ఫూర్తి.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ద్విభాష్యం రాజేశ్వరరావు గారి స్పందన: * 🙏🙏🙏🙏👌👏👏👏 – ద్విభాష్యం రాజేశ్వరరావు*.

  3. 3

    శాంతారామ్

    విశాఖపట్నంలో ప్రదర్శింపబడిన కన్యాశుల్కం నాటకం పైన మల్లాప్రగడ రామారావు గారు పంపిన వార్తపై నా స్పందన:
    కన్యాశుల్కం నాటకం పైన మీ విహంగవీక్షణం అద్భుతంగా అలరింది నాటి మాట, అదిరింది నేటి మాట.
    వివరణ:
    ఏనాటకమైన చూస్తున్నప్పుడు పాత్రల నటన, వాచకం (డైలాగ్ డెలివరీ) మొదలైనవి, మనల్ని (ప్రేక్షకులను) మైమరిపించి, అద్భుతంగా వుంది నాటకం అని ప్రశంసలు కురిపించడం సహజం.
    కాని అంత హృద్యమైన ప్రదర్శనకు నేపథ్యంలో (తెరవెనుక) కృషిచేసిన కృషీవలులు, రచయిత, మేకప్ మేన్, రంగన్థలాన్ని అలంకరణ చేసిన వారు ఇలా వివిధ రంగాల్లో ప్రావీణ్యం వున్నవారి పూనిక, సహకారంతో మాత్రమే ప్రదర్శన రక్తి కడుతుంది అన్నది అరుదుగా పరిగణనలోకి తీసుకుంటారు అని భావిస్తున్నాను.
    అయితే రామారావు గారు ఈ విహంగ వీక్షణలో వాటికి కూడా ప్రాధాన్యతని ఇవ్వడం, ముదావహం.
    అలాగే విశ్వ విఖ్యాత నాటక రచయిత “శ్రీ గురజాడ”
    వారికి ‘కవిచంద్రునికి రచయితల నూలుపోగు” అని హృదయ పూర్వకంగా ఆవిష్కరించడం, “చంద్రునికొక నూలు పోగు” అనే నానుడి ని ఇనుమడింశజేస్తూ, ఆ చంద్ర తారార్కం నిలుస్తుంది అని ధ్వనించే విధంగా సంబోధించడం ప్రశంసనీయం.
    ఇంక అలరించిన ‘కన్యాశుల్కం’ కైమోడ్పు’ ఈ పదం “కన్యాశుల్కం” నాటకాన్ని వివిధ కోణాల్లో, మదిలో, మధించగా వచ్చిన నవనీతంగా భావిస్తున్నాను.
    కారణం ఏకకాలంలో (భూయాత్, భవిష్యత్, వర్తమానాల లో నైనా) ఈ నాటకం చదివినా, దర్శించినా నవ్యతను సంతరించుకుని, వర్తమానానికి వర్తించే విధంగా ప్రేక్షకుల మదిలో నర్తిస్తుంది అన్నది నిర్వివాదాంశం.
    నా ప్రత్యక్ష అనుభవం:
    ఈ నాటకాన్ని 50 సంవత్సరాల కిందట అఫీషియల్ కాలనీలో ఉన్నప్పుడు, కలెక్టర్ ఆఫీస్ లో వేదిక అప్పుడు దానికి “గురజాడ కళా వేదిక” అని పేరు ఉండేదని జ్ఞాపకం. అందులో కీర్తిశేషులు జె. వి. సోమయాజులు గారు, రమణమూర్తి గారు, మెదలైన వారు నటించినది చూసే అదృష్టం కలిగినది.
    అలాగే నేను ఉద్యోగం చేసినా విశాఖపట్నం పోర్ట్ వారి నిర్వహణలో జరిగిన, ఇంటర్ డిపార్ట్మెంట్ నాటక పోటీల్లో వేసింది చూశాను.‌
    కన్యాశుల్కం సినిమా కూడా చూశాను.
    సినిమా కంటే నాటకమే అద్భుతంగా వుంది అని మాత్రం చెప్పగలను.
    ఏదైనా, ఒక మంచి నాటకం గూర్చి చర్చించుకొనుట కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను.
    శుభం భూయాత్
    శాంతారామ్

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!