Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కన్నయ్య కోసం

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కన్నయ్య కోసం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

మున తరంగాల గలగల
రాధ మనసు అందులో అల
కన్నయ్య కోసం
కాగుతున్న కాసారం ఆ హృదయం
నల్లనయ్య రాకకై నిరీక్షణలో
తనను తానే మరచిన వైనం
క్షణాలను యుగాలుగా మారుస్తున్న కాలం
చూపు అంతా యమున వైపే
అసలే నిశి
అంత కంటే చీకటి యమునా తటి
కానీ రధ కన్నులలో మాత్రం వెన్నెల
అది కృష్ణ లీల
వలచిన విభుడు
ఎదలో నిలిచిన అనుభూతి
రాధా హృదయమే
మాధవుని ప్రణయ సీమ
అమలిన ఆ ప్రేమకు
ఈ భువిలో ఏదీ సాటి కాదు సుమా!

Exit mobile version