సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Padmaja suraparaju

    అద్భుతం

    Reply
    1. 1.1

      రాధిక

      ధన్యవాదాలు పద్మజగారు

      Reply
  2. 2

    S. Narayanaswamy

    lOtaina vyAsaM. AlOciMcavalasina vishayAlu.

    Reply
    1. 2.1

      రాధిక

      ధన్యవాదాలు నారాయణస్వామిగారు

      Reply
  3. 3

    Sreelatha

    చాలా మంచి విషయాలు. ఆలోచించదగినవి.

    Reply
    1. 3.1

      రాధిక

      ధన్యవాదాలు శ్రీలతగారు

      Reply
  4. 4

    నాగజ్యోతి రమణ సుసర్ల

    చాలా అద్భుతం గా విశదీకరించారు…నిజానికి ఈ మధ్యన చాలా కథల్లో ధర్మానికీ , ధర్మం అని నమ్మించాలి అనుకున్నదానికీ ఒక ఘర్షణ ను సృష్టించి …ఆ నమ్మించిన దానినే సమర్ధిస్తూ కథను ముగించటం నాలాంటి సామాన్య పాఠకులు కూడా తేలిగ్గా గమనించగలుగుతున్నాం …వాటినే విశ్లేషకులు అని చెప్పబడుతున్నవారు సమర్ధిస్తూ మాట్లాడటాన్ని కూడా చూస్తూనే ఉన్నాం ….అసలు ధర్మం గురించిన సరి అయిన అవగాహన లేకపోవటం వల్లనే అలా జరుగుతోందేమో అని మీ వ్యాసం చదివినాక బలంగా అనిపిస్తోంది ….మీకు అభినందనలు శ్రీవల్లీ రాధిక గారూ .

    Reply
    1. 4.1

      రాధిక

      ధన్యవాదాలు నాగజ్యోతీ

      Reply
  5. 5

    అనామకుడు

    “……’ఒక ధర్మాన్ని పట్టుకుని……’ అని చెప్పేదిగా ఉండాలి.”

    ఇలా ఉండాలంటే సత్యహరిశ్చంద్రుని కథ, లేదా ఆ టెంప్లేట్ లో వ్రాసినది మాత్రమే కథ అవుతుంది. చాలాకాలం క్రితం నండూరి రామమోహనరావు గారు బైసికిల్ తీవ్స్ సినిమా రివ్యూ వ్రాస్తూ ఓ మాటన్నారు. “భారతీయులకు మనసు కరిగేలా గొప్ప కరుణరసాత్మక కథ చెప్పాలంటే సత్యహరిశ్చంద్రుణ్ణి కాటికి పంపిస్తే తప్ప జరగదు” అని.

    పరిణామక్రమంలో – “ఇది మంచి, ఇది చెడు” – ఇలా అని చిన్నపిల్లలకు చెబుతారు. (పంచతంత్రం) యువకులకు కేస్ స్టడీలు చెబుతారు. “ఇలా ఉంటే ఇలా జరగొచ్చు, ఈ సిచువేషన్ లో ఇలా ఒకడు ప్రవర్తించాడు..” – ఈ టైపు (అనేక కాల్పనిక కథలు). ఇంకాస్త సాహిత్యానుశీలనంలో ముందుకెళ్ళిన వాళ్ళకు “Futility of life” లాంటి తాత్విక దృక్కోణంలో చెబుతారు (త్రిపుర కథలు). బహుశా అందుకే, “పిల్లలకు కథలు, యువకులకు నవలలు, పెద్దవాళ్ళకు జీవితచరిత్రలు నచ్చుతాయి”. అన్న మాట ఏర్పడింది.

    ఇది ధర్మం అని డిఫైన్ చేస్తూ, దాన్ని సమర్థించేదే కథ అన్నది అంత సబబు కాదు. ఎందుకంటే చెబుతున్న ధర్మానికి super set లో మరో ధర్మం ఉండొచ్చు. “ఉద్ధరేత్ అత్మనాత్మానం…” ఇదొక ధర్మం. ఈ ధర్మంలో భాగంగా ఒకడు “అబద్ధాలే చెప్పకుండా ఉండుట” అనే మరో ధర్మాన్ని పాటించాడు. (లేదా “అబద్ధం చెప్పడం” అనే ధర్మాన్ని.). ఈ నేపథ్యంలో ధర్మాన్ని ఎలా డిఫైన్ చేసి పరిధులను ఏర్పరుస్తారు? నిజాయితీ గల రచయిత (బహుశా గొప్ప రచయిత) సందర్భాలను, వాటి వెనుక తన ఆలోచనలను చెప్పి, పాఠకులకు వదిలేస్తాడంతే. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, అన్ని జీవితసందర్భాలు ఉన్నాయి కాబట్టి. ప్రిస్క్రైబ్ చేయడం రచయిత పని అనడం సమంజసమని అనిపించట్లేదు.

    ఏ కథకూ నిర్దుష్టంగా ఒక డిఫైన్డ్ ప్రయోజనం ఉండాలి/ఉంటుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. ఎనీ వే, ఇక్కడితో ఆపడం బెటరు.

    Reply
    1. 5.1

      రాధిక

      ధన్యవాదాలు అనామకుడుగారు,
      భారతీయుల రసహృదయం గురించి మీ అభిప్రాయం చూశాక ఇక ఏమైనా చెప్పడం అనవసరమేమోనని సందేహిస్తూనే ఈ సమాధానం వ్రాస్తున్నాను. (మీరు ఉదాహరించిన అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారు కనుకనే దానిని ఉదాహరించి ఉంటారని భావిస్తూ మీ అభిప్రాయం అంటున్నాను)
      మీరు వ్యాసంలో నుంచి ఉదాహరించిన “ఒక ధర్మాన్ని పట్టుకుని” అన్న వాక్యం ఒక స్వతంత్ర వాక్యం కాదు. “రచయిత కనుక కథలో ప్రస్తావిస్తున్న ధర్మాన్ని నమ్ముతున్నానని అంటూ దానిని సమర్ధించేందుకే కథ వ్రాస్తున్నానని చెప్తున్న పక్షంలో కథ ఎలా ఉండాలి?” అన్నది ముందరి వాక్యంలోని ప్రశ్న. ఈ వాక్యం దానికి జవాబు. రచయిత “ఇదీ నేను వ్రాయాలనుకున్న ఇతివృత్తం” అన్నపుడు/అనుకుంటున్నపుడు ఆ ఇతివృత్తానికి అనుకూలంగా కథ ఉండాలని మాత్రమే చెప్తోంది ఈ వాక్యం. ఒకటి వ్రాస్తున్నామని అంటూ/అనుకుంటూ ఇంకొకటి వ్రాయడం సమంజసం కాదు కదా! (పాఠకులు ఒక రచన నుంచి ఆమాత్రం ఆశించవచ్చుననుకుంటున్నాను)
      ఈ వ్యాసం రచయితలకు టెంప్లేటులు ఇవ్వడం లేదు. ఇలాగే వ్రాయండి అని నిర్దేశించడమూ లేదు. కొన్ని సూచనలు మాత్రమే చేస్తోంది.
      “ఇది ధర్మం అని డిఫైన్ చేస్తూ, దానిని సమర్ధించేదే కథ అన్నది అంత సబబు కాదు” – అసలలాంటి మాటలు ఈ వ్యాసం అనలేదే!
      చివరి వాక్యంలో మీరు నిర్దిష్ట ప్రయోజనం అనబోయి నిర్దుష్ట ప్రయోజనం అన్నారని అనుకుంటున్నాను.
      లేక ఒకవేళ “కథకి నిర్దుష్టమైన ప్రయోజనమే ఉండనక్కరలేదు, దుష్టమైన ప్రయోజనం కూడా ఉండవచ్చును” అన్నది మీ అభిప్రాయమయితే, నిజమే ఈ వ్యాసం ఆ అభిప్రాయానికి అనుకూలంగా లేదు.

      Reply
  6. 6

    అనామకుడు

    వ్యాఖ్యను పట్టించుకున్నందుకు ధన్యవాదాలు. కాకపోతే వ్రాసిన దాన్నే మళ్ళీ వివరించవలసి వస్తోంది.

    “ఏ కథకూ నిర్దుష్టంగా ఒక డిఫైన్డ్ ప్రయోజనం..” – నా వ్యాఖ్యలోని ఆ వాక్యంలో “డిఫైన్డ్ ప్రయోజనం” అన్నది వివక్షనీయం. ఈ మాటను వదిలి, “దుష్టప్రయోజనం” అనే విషయాన్ని నా వ్యాఖ్యకు ఆపాదించారు .ఎందుకో తెలుస్తోంది. పర్వాలేదు లెండి.

    – “పాఠకులు ఒక రచన నుంచి ఆ మాత్రం ఆశించవచ్చుననుకుంటున్నాను”

    ఇంతకూ ఈ వ్యాసం పాఠకులు రచన నుండి ఏమి ఆశిస్తారు/ఆశించాలి అని వివరించటానికా లేక రచయిత తన ఆశయవివక్షను ఎలా నిర్వహించాలి? అన్నవిషయాన్ని చెప్పటానికా? రెండూ ఒకటే అని అనుకోవాలేమో, సరే.

    “ధర్మం మీద విశ్వాసం లేక, దాన్ని ఖండించటం కోసమే కథ అల్లినప్పుడు, ఆ రచయిత ధర్మం (విలువ) లో దోషం ఉందని భావిస్తే, ఆ దోషాన్ని స్పష్టం చేయాలి కానీ, ధర్మనిర్వహణ కష్టం అనే భ్రమ కలిగించే మెలికను కథలో చెబితే అది మంచికథ లక్షణం కాదు. ధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ, ఆ సాధనలో పరాకాష్ట చెందిన వాడు ధర్మాన్ని ఎలా నిలబెట్టుకుంటాడో దాన్నే చెప్పాలి ” – ఇది మీ వ్యాసంలో భావం; “ఇతివృత్తానికి అనుగుణంగా కథ ఉండాలి” – ఇది మీ వివరణ. ఇంత కాంప్లెక్సు గా మాట్లాడుతున్నప్పుడు, పైగా ’యిది మంచికథ లక్షణం, ఇది మంచికథ లక్షణం కాదు’ అంటూ మీరు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నప్పుడు కనీసం మన సాహిత్యంలో వచ్చిన వేలకథల్లో ఒక్క కథనైనా కేస్ స్టడీ కింద తీసుకుని వివరించి ఉంటే స్పష్టమయ్యేది. మంచికథ కు వ్యతిరేకంగా వచ్చిన కథల గురించైనా మాట్లాడుంటే స్పష్టత వచ్చుండేది. “మంచికథ” ఏదో తెలిసేది. మీ “సూచన”లకూ మీ వ్యాస “పఠిత”లకూ కూడా పరమార్థం దక్కేది. పోనీలెండి.

    Reply
    1. 6.1

      రాధిక

      నేనా? ఆపాదించానా? 🙂
      “ధర్మం మీద విశ్వాసం లేక, …..” – ఇది మీ వ్యాసంలో భావం; —- కాదండి. అది కాదు ఈ వ్యాసంలోని భావం.
      పోనీలెండి.
      మళ్ళీ వివరించను.

      Reply
  7. 7

    G.S.Lakshmi

    కాస్త ఆలోచిస్తూ చదవవలసిన వ్యాసం. మరోసారి చదువుతాను. ఇంకాస్త అర్ధమవుతుందేమో.. మొత్తానికి మెదడుకి పదును పెట్టారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!