సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    మథు చిత్తర్వు

    విశ్లేషణ ఆరవ భాగం చదివాను.చాలా వివరం గా ఆధారాలతో రాశారు.ఈ వీరకోడిదండు, డైరీ లో పేజీలకథ మళ్ళీ చదవాలి అప్పుడు నా కయితే సరిగా అర్థం కాలేదు.చారిత్రక కల్పనా సాహిత్యం మీద ఫోకస్ చేసిన ఈ సంకలనం గురించి సాయి పాపినేని గారికి అభినందనలు తెలియజేయడం కూడా బావుంది.వారు ఆయా రచయితలు పాజిటివ్ గా స్వీకరించాలని ఆశిస్తున్నాను.
    తెలుగు లో వివిధ రకాల సాహిత్య జానర్ లలో కథలు నవలలు రావడమే కాకుండా ,వాటి నాణ్యత కూడా బావుండాలని మీరు అన్నది నచ్చింది.

  2. 2

    k.p.ashok kumar

    మంచి విశ్లేషణ.విమర్శతో పాటు ముగింపు బాగా వచ్చింది.

  3. 3

    రాపాక పవన్ స్వరూప్

    చరిత్ర ఆధారిత కథలు రాయడానికి పూనుకోవడం ఒక బాధ్యతాయుతమైన కార్యమని అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పారు. రాబోయే కాలంలో కాబోయే రచయితలకు చేసిన మీరు సూచనలు ఆచరణీయం.

  4. 4

    డా. సిహెచ్. సుశీల

    సూటిగా, నిష్కర్షగా, కొంచెం కఠినంగా నైనా-సాయి పాపినేని గారి “కాలయంత్రం” కథా సంకలనం పై కస్తూరి మురళీకృష్ణ గారి విమర్శ వ్యాస పరంపర పూర్తయింది. “చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు” పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మొదటి నుండి చెప్తూనేవున్నారు మురళీకృష్ణ. కాల యంత్రం కథలపై విమర్శనం పక్కన పెట్టినా, ఈ సూచనల వరకు విడిగా ఒక మంచి వ్యాసం అవుతుంది. తెలుగు సాహిత్యంలో విభిన్న రచనలు చేయాలనుకునేవారికి ముఖ్యంగా చారిత్రక నవలలు కథలు రాయాలనుకునే వారికి ఇది ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.
    1. చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు రాయాలి అన్న ఆసక్తి ‘బాగా’ ఉండాలి.
    2. ఏ అంశాన్ని కథగా మలచాలో నిర్ణయించుకునే విచక్షణ ఉండాలి.
    3. కేవలం కల్పన మీదనే దృష్టి పెట్టకుండా చరిత్ర పట్ల ఒక అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే ఆనాటి పాత్రల వ్యక్తిత్వ చిత్రణ సవ్యంగా చేయగలరు.
    4 అలాగే ఆయా కాలం నాటి రాజకీయ సాంఘిక పరిస్థితుల విషయమై పరిశోధన చేయాలి. అధ్యయనం చేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఔచిత్య భంగం కలుగుతుంది.
    5. “ఏ దేశ చరిత్ర చూసినా ఎంతో కొంత గర్వకారణం వుంటుంది. ఎందుకు ‘పర పీడన పరాయణత్వం’ కలిగింది… అని పరిశీలన చేసి, దాచేస్తే దాగని సత్యాలని , చరిత్ర సారాల్ని” చెప్పే బృహద్భారాన్ని తలకెత్తుకున్నప్పుడు అత్యంత జాగరూకతతో ఆవిష్కరించాలి.
    అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిళ్ళ తలుపు గొళ్ళెం హారతి పళ్లెము గుర్రపు కళ్ళెం… అన్నీ కవితా వస్తువులే అని శ్రీశ్రీ అన్నదానికి, కథలుగా రాసి నిరూపించారు రావిశాస్త్రి.
    తాజ్ మహల్ గురించి కవితలు, కథలు వచ్చాయి. మరి, ‘ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల’ చరిత్ర తవ్వితీయాలనుకుంటున్న వారు ఎంత చరిత్రని అధ్యయనం చేయాలి! ఎంత కాలాన్ని వెచ్చించాలి! ఎంత స్వేదాన్ని చిందించాలి! అలాంటి కృషి తర్వాతే ఉన్నతమైన, ఉత్తమమైన చరిత్ర ఆధారిత కాల్పనిక కథలు వస్తాయన్న ‘ఆవేదన’ మురళీకృష్ణ గారి ఈ వ్యాస పరంపరలో నాకు గోచరిస్తోంది. సాయి పాపినేని వంటి ఉత్సహవంతులకు ఇది మరింత ఉత్సాహాన్ని, భవిష్యత్ లో రాయాలనుకునే వారికి మార్గదర్శకాన్ని ఇస్తుంది.
    సాయి పాపినేని గారికి, కస్తూరి మురళీకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు.

  5. 5

    Dr.Trinadha Rudraraju

    గత సంకలనాల విశ్లేషణ ప్రయత్నమే పెద్ద సాహసం. కస్తూరి మురళీకృష్ణ గారి శోషణ శక్తి మరియు సున్నిత (మైక్రో లెవల్) – సమగ్ర నిర్మాణాత్మక విమర్శ అమోఘము. వీరి సామర్థ్యం ప్రశంసనీయం.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!