Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – సిద్ధాంత వ్యాసం – త్వరలో

డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.

ఈ పరిశోధనని వారు ఆచార్య డా. అమరేశం రాజేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో కొనసాగించారు. పరిశోధనకు కోసం 1989లో విశ్వవిద్యాలయం వారి అనుమతి పొంది 1995లో డాక్టరేట్ సాధించారు.

కాకతీయుల గురించి, వారి కాలంలోని చారిత్రక స్త్రీల గురించి, ఆనాటి సమాజంలో స్త్రీలు – వర్గాలు, వారి జీవన విధానం సమాజంలో, కుటుంబంలోనూ వారి స్థానం, ఆనాటి రాజకీయాలలో వారి పాత్ర, వివాహాది సంస్కారాలు వారు నేర్చిన విద్యలు, కళలు, ఆనాటి మత సంప్రదాయాలలో స్త్రీల పాత్ర, వారు అనుసరించిన వృత్తులు, వారి వేషభూషలు, వస్త్రధారణ అన్న అంశాల గురించి ఈ సిద్ధాంత వ్యాసంలో చర్చించారు. ఈ సిద్ధాంత వ్యాసాన్ని తొమ్మిది ప్రకరణలుగా విభజించారు.

***

ఈ సిద్ధాంత వ్యాసం – సంచికలో వచ్చే వారం నుంచి ధారావాహికంగా ప్రచురితం అవుతుంది.

చదవండి.. చదివించండి..

‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ – సిద్ధాంత వ్యాసం

Exit mobile version