నా చరణ ద్వయం వెనుకంజ వేసిన ప్రతిక్షణం
మనసులో ఏదో అలజడి కలిగిందనే యోచన
మీనమేషాలు లెక్కేసుకునే లోపే లక్ష్యం పెద్దది
వాల్లభ్యం ఊబిలో కూరుకుపోయిన రాక్షసులు
ఆ పాడు భవము ఎందుకు తప్పో తెలియదు
ఒయ్యన్ మనసులో మళ్లీ పాత జ్ఞాపకాలు
గహనములో గుల్మం చాటున హుతభుక్కు
అజాత పక్షుల వలే దారితెలియని అజ్ఞానం
జవము పెంచుతూ నా ప్రయాణ యాత్ర
క్రాగుతున్న అరణ్యము సాక్షిగా శబ్దాలు
ఎనిమిది దెసల నుండి ఏవో చుట్టుకున్నట్లు
అసలీ అనలం సెగలు అంత భయంకరమా
కోల్పోయిన బాల్యాన్ని తలచుకుంటే అంతా…
నిరాశే మిగిలిందని గుండె రాయిలా మారిందని
ఎదురు చూసిన లక్ష్యం కోసం ఉద్విగ్న క్షణాలు
ఒకటేమిటి జీవితం బుద్బుద ప్రాయం
సముద్రం కడలి లోంచి నిప్పుల వాన
కత్తి మొనకు వడగండ్ల వర్షం కురిసినట్లు
ఒకటేమిటి అంతా వినాశనమే నా గతం
శ్రీ అంజి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పరిశోధక విద్యార్థి.