[బాలబాలికల కోసం కాయగూరల పొడుపు కథలు అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్. ఇది మొదటి భాగం.]
~
ప్రశ్నలు:
1.
ఈ పువ్వు గాని పువ్వుని
ఎలా ఉన్నావని పలకరిస్తే
‘క్యా బే’ అంటూ
హిందీలో కోప్పడుతుంది.
2.
కాయలలో కెల్లా పొడుగు
చీకట్లో భయం కలుగు
3.
భార్య పేరు పెట్టుకున్నది
భూమి లోపల దాక్కున్నది
4.
పచ్చని పక్షి పేరు
పంటలో ఊరింది వేరు
5.
రక్తం ఊరే దేహం
బొంగరం లాంటి ఆకారం
మట్టి కిందే నివాసం
6.
చేప పేరు పెట్టుకున్న పెట్టె కాయ
తెల్ల పూలు పూచే పొడుగు కాయ
7.
ఒళ్ళంతా పెళుసు విరుపులు
చెట్టుకు పాకే గొంగళి పురుగులులు
మారెడు మారెడు కాయలు
8.
పొట్ట నిండా రసం
పండు ఎరుపు శరీరం
రుచిలో తొలి స్థానం
9.
నెత్తి మీద కీరిటం
కూరల్లో రారాజు
10.
నేలలో మొలిచే కర్రలు
ఒళ్ళంతా షుగరు నిల్వలు
జవాబులు:
1. క్యాబేజీ 2. పొట్లకాయ 3. ఆలుగడ్డ 4. చిలకడ దుంప 5. బీట్ రూట్ 6. సొరకాయ 7. మునక్కాయ 8. టమోటా 9. వంకాయ 10. చెరకు
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.