Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కార్మికుడే

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కార్మికుడే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

మి చేసిన
ఎక్కడ చూసిన

అంతట అతడే
అన్నిట అతడే
ఇష్టపడేది కష్టపడేది
పనిచేసేది కార్మికుడే

యంత్రం అతడే
తంత్రం అతడే
పాటుపడేది పోటీపడేది
పరుగెత్తేది కార్మికుడే

బతుకు అతడే
మెతుకు అతడే
చెమటోడ్చేది శ్రమకోర్చేది
ఎదురేగేది కార్మికుడే

శాంతి అతడే
కాంతి అతడే
సాధించేది శోధించేది
ఎదురీదేది కార్మికుడే

కృషీవలుడతడే
ఋషివరుడతడే
పసిగట్టేది పనిపట్టేది
కనిపెట్టేది కార్మికుడే

Exit mobile version