[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కాలం నానీలు’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]
~
కాలానికీ
జోహార్లు
గాయమైనప్పుడల్లా
మరుపునిస్తుంది
భవితవ్యం
జరా భద్రం
జారిపోయిందా?
తిరిగి రాదు కాలం
జీవితం
సుదీర్ఘ ప్రయాణం
కాలం
నిరంతర ప్రవాహం
కాలం
నిన్ను శాసిస్తే ప్రకృతి
కాలాన్నే నువ్వు శాసిస్తే
అది వికృతి
కాలం
ఎవరు ఋణం ఉంచుకోదు
కర్మానుసారం
తీర్చేసుకుంటుంది