Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవిత ఘర్షణ..

[వి. భాగ్యలక్ష్మి గారు రచించిన ‘జీవిత ఘర్షణ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ది కవిత కాదు నాలోని భావాల కలయిక
నల్లటి మబ్బులు కమ్మిన ఒక సాయత్రం వేళ
మనసులోని బాధ ఉప్పెనలా ఉప్పొంగిన వేళ
కళ్ళు నేలని చూస్తూ కాళ్ళు నడవలేని వేళ
నా భవిష్యత్తు ఆచూకీ నా కళ్ళకి కనిపించని వేళ
నిరాశ నిరంకుశత్వాల నడుమ నా మనుసు నలిగిన వేళ
బాధ్యతలకి బంధాలకి నన్ను నేను బాధించుకున్న వేళ
చిరునవ్వుకు తావు లేని వేళ
ఆనందాన్ని అందుకోలేక ఆగిపోయిన వేళ
కష్టాలనే కటిక రాత్రిలో నిద్ర లేని వేళ
ఆలోచనలనే పిశాచాలు పట్టి పీడిస్తున్న వేళ
కంటిలోని నీరు ఇంకి, కన్ను ఎడారి అయిన వేళ
మరునాటి ఉదయం నీకు భరోసా ఇస్తుందని
నా మనసు నాకు చెప్పిన వేళ
ప్రతి కాలం శాశ్వతం కాదు అని
నాకు నేను నచ్చ చెప్పుకున్న వేళ
కనిపించని నా మనసు కలం కదుపుతున్న వేళ
ఈ నా జీవిత ఘర్షణ..

Exit mobile version