[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘జీవితం’ అనే కవితని అందిస్తున్నాము.]
ఓ జీవితమా
జీవిస్తున్న
ఎనభై ఏళ్ల నుంచి
పడుతూ లేస్తూ
ఓడుతూ
గెలుస్తూ
మన పోరాటం
సాగుతూనే వుంది
నిరంతరం
గెలవాలని నేను
ఓడించాలని నువ్వు
పంతం పట్టి
ఆడుతున్నాము
ఈ ఆట
గెలిపిస్తావు
మురిపిస్తావు
ఓడిస్తావు
ఏడిపిస్తావు
చివరకు నువ్వే
గెలుస్తావు
నేను ఓడుతాను
ఓటమి ఒప్పుకోను
ఓడుతానని
తెలిసే ఆడాను
అందువలన
అనాదిగా నీదే కదా
గెలుపు
ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.