[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘జీవన సత్యం!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
అలసట చెంది నయనాలు వాల్చుతుంటే కమ్మని కలలేవో పలకరిస్తుంటాయి! కలతలు లేని కమ్మని కలల పరిచయాలతో రేయంతా హాయిగా గడిచిపోతుంది! పగలంతా శ్రమించి నిద్రకు ఉపక్రమించాక ఆలోచనలన్నిటికి సెలవిచ్చి ఆనంద హృదయాన్ని తట్టి నింపాదిగా నిద్రిస్తే కలల లోకంలో పారవశ్య విహారమే కదా! ఎన్నో సమస్యలు తీరిక లేనన్ని పనులు ఆలస్యమవుతున్న కొద్దీ ఆరాటాలను పెంచుతున్న కష్టాలు నిత్యం ఉరుకుల పరుగుల జీవితం నిద్రలేకుండా.. లెక్కలేనన్ని ఆలోచనలు, వ్యథలు, కన్నీటి గాథలని మోస్తున్న యువకుల్లారా.. కాలం విలువ గ్రహించి.. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ.. చేస్తున్న పనిపై పూర్తి శ్రద్ధాసక్తులు పెట్టి కృషి చేయండి! తప్పక విజయాలు సాధిస్తారు! కంటి నిండా నిద్ర ఉన్నప్పుడే.. పగలంతా హాయిగా పని చేసుకోగలుగుతారు! ఎప్పటి పని అప్పుడే చేస్తుంటే.. అదే విజయ రహస్యం! తెలుసుకోండి నేస్తాలు ఇదే జీవన సత్యం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు. ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు. ‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
యద్భావం తద్భవతి
చిరుజల్లు-97
కనువెలుగు – కనుమరుగు
నా బాల్యం కతలు-1
అశ్విన్
ఒక్క పుస్తకం-10
ఆటోమొబైల్/వాహన రంగంలోని వారి కథల సంకలనం కోసం ప్రకటన
ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-8
గాంధి
నీలమత పురాణం – 59
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®