నేను ఫణి ఇంటి నుండి మా రమక్క దగ్గరకి డాలస్ వెళ్ళాను. మేం పెద్దమ్మ, పిన్ని పిల్లలమే కానీ, చిన్నప్పుడు అందరం ఒకింట్లో అమ్మమ్మ పెంపకంలో కలిసి పెరగడం వలన, ఒక తల్లి పిల్లల్లా వుంటాం ఇప్పటికీ! మా రమక్క వంట చాలా బాగా చేస్తుంది. బావగారు శేషాద్రీ తిరునారాయణన్, ఆయనా వంట బాగా చేస్తారు! నేను డాలస్ చేరేటప్పటికే, అక్కడికి రసరాజు గారూ (అసెంబ్లీ రౌడీ చిత్రంలో ‘అందమైనా వెన్నెల లోనా’ లాంటి పాటలు రాసిన రచయిత, తణుకులో ఉంటారు), వెన్నెలకంటి గారూ, జొన్నవిత్తుల గారూ, ముప్పవరపు సింహాచలం గారూ అంతా చేరుకున్నారు. సింహాచలం గారికి ఆప్తమిత్రుడూ, బాల్య స్నేహితుడు డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు (ప్రముఖ కార్డియాలజిస్ట్) కూడా ఉండేది డాలస్లోనే! సింహాచలం గారు ఎం.వి.ఎల్. గారింట్లో దిగారు. అక్కడ ఆయన పాకశాస్త్రం పట్టు అందరికీ చూపించసాగారు!
మా రమక్కకి ఆలస్యంగా శైలూ పుట్టింది! దాని పూర్తి పేరు శాయి శైలజ. ఇప్పుడు అది లా చేసి ‘విమెన్స్ రిపబ్లికా’ అనే మేగజైన్ నడుపుతోంది. అది ఎంత ఫేమస్ అయిందంటే 24 ఏళ్ళకే, మొన్న జరిగిన యూ.ఎస్. ఎలక్షన్స్‌లో బైడెన్ తరఫున పొలిటికల్ ఎనాలిసిస్ చెయ్యడానికి టీ.వీ. ఛానెల్స్ దాన్ని ఆహ్వానించాయి. చాలా ఆశ్చర్యం వేస్తుంది మన తెలుగు/తమిళ పిల్ల అక్కడ పాలిటిక్స్ గురించి వాయిస్ రెయిజ్ చెయ్యగలగడం! రాయడం మా తాతగారు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులూ అయిన సూరంపూడి శ్రీహరిరావు గారి జీన్స్ వల్ల వచ్చి వుంటుంది. మిగతా కజిన్స్ పిల్లలకి కూడా తెలుగులో కాకపోయినా, ఇంగ్లీషులో అంతో ఇంతో రాసే అలవాటుంది!
కానీ మా శైలు పత్రికలో, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే చీల్చి చెండాడేస్తుందని పేరు! ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘దిల్ ధడక్ నే దో’లో రాహుల్ బోస్, భార్య ప్రియాంకా చోప్రా గురించి “మై వున్ కో కామ్ కర్నే దియా!” అంటాడు… అది అతను ఆమెకిచ్చిన వరంలాగా… ఆ డైలాగ్ గురించి మా శైలు విమెన్స్ రిపబ్లికాలో గట్టిగా వాయించింది! దాంతో రాహుల్ బోస్ శైలూకి పత్రికా ముఖంగా “అది సినిమాలో ఆ పాత్ర స్వభావం, రచయితలు రాసిన డైలాగ్. నా తప్పే! అటువంటి డైలాగ్ అనడం…” అని అపాలజీ చెప్పుకున్నాడు. ఆ తర్వాత నేను “పాత్ర స్వభావం తెలియడానికి అటువంటి డైలాగులు రాస్తారు… అవి నటుల స్వభావానికి సంబంధించినవి కావు అని చెప్పాను. అసలు స్త్రీల గురించి అలా సినిమాల్లో ఇప్పటికీ పాత్ర చిత్రణ చేయకూడదు అనే ఇప్పటి మహిళ అది! అందుకే రాహుల్ బోస్ క్షమార్పణ చెప్పుకున్నాడు! ఆ విధంగా మా పిల్ల పేరు తెచ్చుకుని పరాయి గడ్డ మీద గొంతు విప్పగలగడం, చిన్న వయసులో ఎడిటర్‌గా పత్రిక నడపటం, నాకు చాలా గర్వకారణం! మీరు కూడా విమెన్స్ రిపబ్లికాకి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రీగా!
తోటకూర ప్రసాద్ గారు ఇందరు రచయితలు వున్నారని వాళ్ళ అమ్మాయి ఇంట్లో వెన్నెల్లో ఆరుబయట భోజనాలు ఏర్పాటు చేసారు! అది మరపురాని అనుభూతి! ఆళ్ళ శ్రీనివాసరెడ్డిగారు వృత్తి రీత్యా గుండె డాక్టరే కానీ, సాహిత్యం, సంగీతం ఆయనకి శ్వాసలు! ఆయన అప్పుడు ఓ పాట పాడారు.. కొండా కోనల్లో… అని; ఓ అజ్ఞాత రచయిత ఎవరో రాసారు నా చిన్నప్పుడు అని! ఆ పాట అంతా విని, వెన్నెలకంటి గారు కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. “ఆ అజ్ఞాత రచయితని నేనే, ఆ పాట కూడా పోగొట్టుకున్నాను… ఇన్నాళ్ళకి మీ నోట విన్నాను, ఆ మకుటం మాత్రం ‘కొండా కోనల్లో’ అని స్వాతికిరణం సినిమాలో పెట్టాను” అన్నారు!
అలా ఆళ్ళగారికి ప్రతి ప్రైవేట్ సాంగ్ కూడా నోటికొచ్చు. అంత ధారణ. వెన్నెల్లో భోజనాల్లో కూడా మాతో వచ్చిన చిటపటలాడే వ్యక్తి బాగానే తన గుణం చూపించాడు! పెద్ద పెద్ద ఆఫీసర్లు, డాక్టరు 24 రకాల కూరలు విస్తళ్ళు వేసి వడ్డిస్తుంటే – “ఇదేమైనా పద్ధతటండీ? దేని పక్కన ఏది వడ్డించాలో తెలియద్దూ? ఇలా అయితే ఎలా? మేం అంటే ఏం అనుకుంటున్నారు?” అంటూ మండిపడ్డాడు. “పో పోవయ్యా… ఏంటి నీ గొప్ప” అని పాపం ఆ పెద్దవాళ్ళు అనకపోవడం వాళ్ళ గొప్ప!
ఫొటోలు తీసేటప్పుడు కూడా ఆయనని చివరకి పెట్టేసారని “నేను ఇలా సైడ్ కిక్‌గా, ఎక్స్ట్రాగా ఫొటోల్లో వుండను… నేను నిలబడను” అని వెళ్ళిపోయాడు! మేం మాత్రం అందరం స్పీచ్‌లూ, కవితా శ్రవణాలూ, పాటలూ, జోక్స్‌తో బాగా ఎంజాయ్ చేశాం. మా రమక్క కూడా తెలుగు ఎం.ఏ. చేసి బి.వి.కె. కాలేజీ, వైజాగ్‌లో కొన్నాళ్ళు తెలుగు లెక్చరర్‌గా చేసింది. తెలుగు అంటే ప్రాణం, అది నాతో వస్తే బావుండేది అనిపించింది!
మరునాడు తోటకూర ప్రసాద్ గారు డాలస్ మహాపట్టణం నడిబొడ్డున కట్టిన గాంధీ పార్క్, గాంధీ గారి విగ్రహం చూపించడానికి తీసుకెళ్ళారు. అప్పుడు రమక్క నాతో వుంది! ఎందుకంటే అంతకు ముందే, టాన్టెక్స్ వాళ్ళ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం అయింది. అందులో నేను మాట్లాడాను!
నేను మాట్లాడక ముందు మన చిటపటలాడే వ్యక్తి – తన ప్రసంగం మధ్యలో జనం మాట్లాడారని, కోపంతో స్టేజ్ దిగిపోయారు. నేను వాళ్ళు మాటలు మానేటట్లు టీవీ సీరియల్స్‌లో మేం కథ ఎలా రాస్తామో, ఎలా మారుస్తామో, ఆర్టిస్టులతో చీకాకులొస్తే ఎలా చంపేస్తామో, సీరియల్ కిల్లర్స్ అంతే మేమే…రచయితలం అని చెప్పి నవ్వించాను. అందరూ మాటలు మానేసి ఎంజాయ్ చేసారు. అక్కడి ఆడియన్స్‌లో రమక్కకి కొంతమంది అమ్మాయిలు స్నేహితులు కూడా అయ్యారు.
ఇక్కడ గాంధీ స్టాట్యూ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఒకాయన, ఓ ఫైలు వెంట తెచ్చారట! ఆ కార్లో అది వదిలి రావడంతో, ఆ కారు వెళ్ళిపోయింది. మళ్ళీ వేరే కార్ ఎరేంజ్ చేసారు… అంటే ఇంకో ఓనర్ తన కార్లో దింపుతానన్నాడు. “నా ఫైలు ఏది? ఆ కారేది? దాన్ని ఆపండి.. నా ప్రాణం అందులో వుంది… మీకు మర్యాద లేదు… మన్నన లేదు” అని రెచ్చిపోయాడు ఆ వ్యక్తి! సో… ఆ సమయంలో నేను పక్కనే వుండడం వల్ల నా చేతిలో వున్న ఫోన్ ఇచ్చి (ఆ వ్యక్తి అమెరికా వచ్చి ఫోన్ కూడా తీసుకోలేదు) “ఇందులోంచి అతనికి ఫోన్ చేసి వెనక్కి రమ్మనండి” అన్నాను.
“ఏంటి? ఈ దిక్కుమాలిన ఫోన్ నేను నేర్చుకుని, వాళ్ళకి చేసి వెనక్కి పిలవాలా? వాడు నా బంధువా? ఆ నెంబర్ నా దగ్గర వుంటుందా?” అని నా మీద ఎగిరిపోయాడు! ఉపకారానికి పోతే ఏదో ఎదురైనట్లు….
ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు ఈ తరహా వ్యక్తుల భార్యలని చూస్తే చాలా జాలివేసింది. ఏ వ్యక్తి అయినా తన కళలో ఎంత లబ్ధప్రతిష్ఠుడైనా, తన ప్రవర్తన వల్ల ఇతరులని బాధిస్తూ, ఇబ్బంది పెడ్తూ, కించపరుస్తూ వుంటే, ఇలాగే వాళ్ళ లోపాలు ఎక్కువ గుర్తుండిపోతాయి, ప్రతిభ కన్నా!
(సశేషం)
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కొరియానం – A Journey Through Korean Cinema-58
నా పల్లెటూరు
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 53, 54: అత్తలూరు
జ్ఞాన తస్కరణ
రా… దసరా
రెండు ఆకాశాల మధ్య-38
ఎంత చేరువో అంత దూరము-27
‘ఆటుపోట్ల కావేరి’ – శ్రీమతి కావేరి చటోపాధ్యాయ ఆత్మకథ-7
రెండు ఆకాశాల మధ్య-11
దేశ విభజన విషవృక్షం-54
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®