[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘జీవన ధర్మం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]
ఆకాశం చిక్కబడింది, మేఘాలు చినుకు ముత్యాలతో- సందడి చేశాయి..! ఆ ముత్యపు జల్లులు , ఆనందాతిశయంతో- భూమిని తడిపేశాయి! మురిసిన మట్టి, సుగంధభరితమైంది. మైమరచిన చిరుగాలి వెదురును వేణువును చేసి, తీయని రాగమాలపించింది! భూమ్యాకాశాల అనురాగానికి, కొండలు కోనలు పరవశించి, కో..అంటే, కో..అంటూ, ప్రతిధ్వనించాయి..! కొండలపై నుండి చినుకు చుక్కలు, ధారలై జలధారలై ఉరికి ఉబికి, ప్రవాహాలై పరుగందుకున్నాయి! ఈ ప్రవాహపు హోరు, కొంటె గాలికలిసి, యుగళగీతమైంది..! వెన్నెల వెలుగులో, కొండ గాలి, ఈల పాటలో- మది మురిసే క్షణాలు- ఏ హృదయానికీ అందని, అనిర్వచనీయ, అతీత సౌందర్యాలు! ఈ ప్రకృతి క్షణాలకు ఊపిరి పోసిందా..? నాలో జీవం నింపిందా.. తేలదు ఎప్పటికీ..!!
కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ముద్దాయి తీర్పు
‘వర్లి’ గిరిజన చిత్ర కళ
ఆధ్యాత్మిక అనుభూతులని కలిగించే – ‘నమామి దేవి నర్మదే’
చెట్టు వేదాంతం
దేశ విభజన విషవృక్షం-42
సంచిక – పద ప్రతిభ – 91
ఖాకీ చొక్కా
కర్మయోగి-4
నూతన పదసంచిక-30
మంచు దుప్పటి – మంచి భావము
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®