[1 జూలై 2025 డాక్టర్స్ డే సందర్భంగా జాతీయ వైద్యుల దినోత్సవం అనే రచనని అందిస్తున్నారు డా. కె. ఉమాదేవి.]
“మంచి వైద్యుడు వ్యాధికి చికిత్స చేస్తే, గొప్ప వైద్యుడు వ్యాధి ఉన్న రోగికి చికిత్స చేస్తాడు” – విలియం ఓస్లర్.
“వైద్య వృత్తిని ఎవరూ ప్రేమిస్తారో అక్కడ మానవత్వం పట్ల ప్రేమ కూడా ఉంటుంది” – హిపోక్రాటిస్
“మిమ్మల్ని మీరు కనుగొనడానికి ఉత్తమ మార్గం, ఇతరుల సేవలో మమ్మల్ని మీరు కోల్పోవడం” – మహాత్మాగాంధీ.
“వైద్యుడు కేవలం వైద్యం చేసేవాడు మాత్రమే కాదు, బాధలో ఉన్నవారికి ఆశ మరియు ఓదార్పునిచ్చేవాడు. వైద్యం కేవలం ఒక శాస్త్రం మాత్రమే కాదు. ఇది ఒక కళ కూడా. జీవిత నాణ్యతని మెరుగుపర్చడమే!”
వైద్యుడు అనేది ఒక పురాతన పదం. ఇది లాటిన్ పదం డాక్టోర్/డోకోర్ నుండి వచ్చింది. దీనికి గురువు లేదా విద్యావంతుడు అని అర్థం. దీన్ని మొదట మతపరమైన విషయాలు మాట్లాడే వేదాంతవేత్తల సముహాన్ని సూచించేందుకు వాడినప్పటికి క్రమేణా విద్యా వైద్య నిపుణుల్ని సూచించడానికి ఉపయోగపడింది దాంతో 14వ శతాబ్దం నుండి డాక్టర్ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది
పేషంట్/రోగి అనేది లాటిన్ పదం పేషెన్స్ నుండి వచ్చింది. దీనికి బాధపడేవాడు అని అర్థం.
డాక్టర్ రోగి సంబంధం ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య సాధనలో కేంద్రభాగం అనే చెప్పాలి.
వైద్యశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేయడానికి చట్టబద్దంగా అర్హత ఉన్న వ్యక్తిని ‘వైద్యుడు’ అంటారు, వ్యాధులు నయం చేసేవాడని అర్థం. వీరినే మెడికల్ ప్రాక్టీషనర్, ఫిజిషియన్, ఆరోగ్యనిపుణుడు, వైద్య నిపుణుడు, జనరల్ ప్రాక్టీషనర్, క్లినిషియన్, స్పెషలిస్ట్, హాస్పిటలిస్ట్, సర్జన్ – అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు.
ఇది వైద్యశాస్త్రం యొక్క నీతి, కళ, మరియు శాస్త్రం, విశ్లేషణాత్మక నైపుణ్యం, విమర్శనాత్మక ఆలోచనపై ఆధారపడి ఉంటుంది.
రోజు రోజుకి అనేక రోగాలు ప్రజల్ని పట్టి పీడిస్తున్నాయి. అందుకు తగ్గట్లు వైద్య ప్రామాణికాలు లేవు. అందరికి వైద్యం అందుబాటులో తేవడానికి, అసమానతల్ని రూపుమాపడానికి శారీరక, మానసిక, సామాజిక రుగ్మతల్ని ఆరికట్టడానికి డాక్టర్స్ ముందంజలో ఉంటారనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘డాక్టర్స్ డే’ ప్రారంభమైనది
ప్రసిద్ధ బెంగాలీ వైద్యుడు, రెండవ ముఖ్యమంత్రి, భారత రత్న అవార్డు గ్రహీత, వైద్య, రాజకీయ, ఆరోగ్యరంగాల్లో ప్రముఖుడైన డా. బిధాన్ చంద్ర రాయ్ (బి.సి. రామ్) జన్మదినం (1 July 1882) మరియు వర్ధంతిని (1 July 1962) పురస్కరించుకొని – 1 జూలై తేదీన డాక్టర్స్ డే జరపడమైనది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1991లో అధికారికంగా భారత ప్రభుత్వం ప్రకటించడంతో ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపడమైనది.
రోగి సంరక్షణ విధానాలకి, రోగుల శ్రేయస్సుకి డాక్టర్ నిబద్ధత ఎంత వరకు వారధిగా ఉందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
శాంతి, త్యాగానికి, అవిశ్రాంత కృషి, శ్రేష్ఠతకి గుర్తుగా తెల్లకోటు ధరించే వీరి కృషి అన్ని రకాల సమాజాలపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుందనే దానికి చిహ్నంగా జాతీయ వైద్యుల దినోత్సవం ఆరంభమైనది
మనం ఎలా పనిచేస్తామో, ఎలా జీవిస్తామో, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో, జీవన ప్రమాణాల్ని పెంపొందించి, వినాశకరమైన ప్రతిఫలాల్ని
ఆశించకుండా, అందరిపై రుద్దకుండా రోగుల్ని శారీరకంగా, మానసికంగా, స్పిర్చువల్ గా స్వస్థత చేకూర్చడమే ‘మిషన్ ఆఫ్ ది ఫిజీషియన్’ అని హామియో వైద్య పితామహుడి వ్యాఖ్యాల్ని నిజం చేయాల్సిన ఆగత్యం ఎంతైనా ఉందనే చెప్పాలి.
ఇది ఒక మెరుగైన శిక్షణా కార్యక్రమం. రోగుల ఆరోగ్య ప్రయోజకుల్ని చేకూర్చే సురక్షితుల్ని చేసే విధాతలుగా డాక్టర్స్ డే ప్రోగ్రామ్స్ ఉండాలని ఆశిద్దాం.
హీలింగ్ హ్యాండ్స్, కేరింగ్ హార్ట్స్ కల్గిన డాక్టర్స్ వారి దైనందిన కార్యకలాపాల్లో ప్రజలు పాలుపంచుకోవడంలో కీలక పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. మెడికల్ ఎథిక్స్‌ని పాటిస్తూ గౌరవప్రదమైన వృత్తిలో ఉంటారని, ఉండగలరని, పది మందికి బి.సి రాయ్ లాగా ఆదర్శప్రాయంగా నిలుస్తారనే ప్రభుత్వ ఆకాంక్షని నిజం చేద్దాం.
నేడు చాలా మందికి డబ్బే లోకంగా బ్రతకడం; ప్రజల ప్రాణాల్ని ఫణంగా పెట్టి పబ్బం గడుపుకోడం కాకుండా ప్రజల నుంచి వచ్చే సద్విమర్శల్ని సద్భవాన్ని పెంపొదించుకోగలరని రోగులకి సంధాన సంరక్షకులుగా ఉంటారని 2025 సంవత్సరం థీమ్‌ని నిజం చేస్తారని కోరుకుంటున్నాం.
‘2025 డాక్టర్స్ డే థీమ్: Behind the Mask: Who Heals the Healers?’.
‘ముసుగు వెనుక: సంరక్షకుల సంరక్షణ’ అనే స్లోగన్‌తో ముందజ వేస్తున్నారు.
వైద్యుడు రోగి సంబంధాల్ని నమ్మకంతో, సౌహార్ద్రతతో బలోపేతం చేయడం, ఆరోగ్య స్పృహని మెరుగుపర్చడానికి వైద్యనిపుణుల్ని ఆహ్వానించడం, నివారణ సంరక్షణని ప్రోత్సహించేలా చేయడం, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల్ని కోవిడ్ 19, అంటువ్యాధులు, మహామ్మారిలో సమర్థవంతంగా ఎదుర్కొనేటట్లు చేయడం, వైద్యుల శారీరక మరియు మానసిక శ్రేయస్సుని తీర్చడమే దీని విధి.
వృత్తిపరమైన విజయాలు, వ్యక్తిగత త్యాగాలకి గౌరవంగా కూడా సమాజ నిర్మాణంలో వారి పాత్రని గుర్తు చేసుకునే గౌరవార్థం ‘డాక్టర్స్ డే’ని జరుపుకుంటున్నారు.
పాత రోగి కొత్త డాక్టర్లో సమానమనే ఆర్యోక్తి ఉండనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ కృతజ్ఞతని, జీవితంలో వారి స్థానం, ఎలా మార్పు తెచ్చారో, ఇన్నాళ్ళు మిమ్మల్ని టెస్ట్స్, ఫీజులతో ట్రీట్ చేసినందుకు డాక్టర్స్‌ని గ్రీట్ చేయండి.
ముఖ్యంగా డాక్టర్స్ 3 రకాలుగా ఉంటారు.
వీరు ప్రాథమిక సంరక్షణ వైద్యులు, స్పెషాలిటీ వైద్యులు, సర్జన్స్. వీరు వ్యాధి నివారణ మరియు నిర్వహణతో వ్యవహరించే వైద్యనిపుణులు. భారతదేశంలో 70,000 హాస్సిటల్స్ ఉంటే, ప్రెవేట్ సెక్టార్‌లో 44,000, పబ్లిక్ సెక్టార్‌లో 26,000 హస్పిటల్స్ ఉన్నాయి.
WHO అంచనాల ప్రకారం భారతదేశంలో 13,08,009 అల్లాపతి డాక్టర్స్ ఉంటే 5.65 లక్షల మంది ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు. వైద్యుడు జనాభా నిష్పత్తి 1: 834 గా ఉందనే చెప్పాలి.
మామూలుగా అయితే 1: 1000 ప్రతిపాదికన అంటే వెయ్యి మంది జనాభాలో ఒక డాక్టర్ ఉండాలి. కానీ భారతదేశంలో 1:1456. అంటే ప్రతి 1456 మంది జనాభాకి ఒక డాక్టర్ ఉన్నారు.
దక్షిణ కొరియన్లు సగటున 16 సార్లు డాక్టర్‌ని ఎక్కువసార్లు సందర్శిస్తే, మన దేశంలో ఇది తారుమారుగా ఉందనే చెప్పాలి.
మన దేశంలో పురుషుల్లో బి.సి. రాయ్ లాగానే – ఆనంద బాయి, గోపాలరావు జోషి, కాదంబినీ గంగూలీ, ఎస్. పద్మావతి రఖ్మాబాయి – వంటి స్త్రీ వైద్యులు ప్రాముఖ్యతని సంపాదించుకున్నారు.
జాతీయ వైద్య కమీషన్ (ప్రకారం (NHC) పురుషుల్లో 34%, స్త్రీ లలో 29 % వైద్యులున్నారని అంచనా. గత సంవత్సరంలో పోలిస్తే వీరి సంఖ్య 53% పురుష వైద్యులుంటే, 47% స్త్రీ వైద్యులు న్నారని (3:2), వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలుస్తుంది.
అత్యధిక వైద్యులున్న దేశంగా క్యూబా ఉంది. అంటే ప్రతి వెయ్యి మందికి 8.4 డాక్టర్స్ ఉన్నారు.
2030 నాటికి పెరుగుతున్న జనాభా కారణంగా భారతదేశం వైద్యుల కొరతని ఎదుర్కొంటుందని తెలుస్తుంది. 2.07 మిలియన్ల అదనపు వైద్యుల అవసరం ఎంతైనా ఉందనడం బాధాకరంగా ఉంటుందనే చెప్పాలి. వేగవంతమైన జీవన ప్రమాణాలకు అనుగుణంగా వీరి సంఖ్య కన్నా పరిణితి, కృషి, నమ్మకాన్ని ప్రజల్లో సాధించడం ఎంతైనా ఉందనే చెప్పాలి.
మన జీవితాల్లో వైద్యులు పోషించే ముఖ్యమైన పాత్రని గౌరవించడానికి, వైద్యవృత్తిలో, వైద్య పరిశోధనలో కూడా అంకిత భావంతో ముందుకు వెళ్ళగలరని ప్రజల విషష్ తో ‘Happy Doctor’s Day’ జరుపుకుంటున్నాము. మొదటి వైద్యుల దినోత్సవం మార్చి 22, 1933న యుఎస్ లోని జార్బియాలోని విండర్‌లో విందులు, వినోదాలతో ఒక వైద్యుడు ఆరాధన, ప్రేమ, గౌరవాన్ని సూచించే రెడ్ కార్నేషన్ పువ్వు ఇవ్వడంతో డాక్టర్ డే రోజున రెడ్ కార్నేషన్ పువ్వును చిహ్నంగా సూచిస్తారు.
పాముతో ఉన్న కర్రని చాలా కాలంగా వైద్యానికి, వైద్యవృత్తికి పురాతన గ్రీక్ వైద్యుడు అస్ల్కెపియస్ లోగో గుర్తుగా WHO గుర్తించడమైనది.
ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితుల్లో రాజకీయ ప్రమేయం లేకుండా రోగిని ఇబ్బంది పాలు చేయకుండా వారికి ఉపశమనం కలించాలి. స్ఫూర్తిదాయకమైన డాక్టర్‌గా చరిత్రలో నిలబడితేనే ‘డాక్టర్స్ డే’ కి సార్థకత చేకూరుతుంది.
అలాగే ఒక వైద్యుడు స్వచ్ఛందంగా సమాజానికి గొప్పగా దోహదపడ్డానని సంతృప్తి చెందుతాడో అప్పుడే వారి జీవితానికి ప్రాముఖ్యత ఏర్పడుతుందని ‘వైద్యో నారాయణ హరి’ గా డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుందాం.
వృత్తిరీత్యా ప్రభుత్వ హోమియో వైద్యురాలైన డా. కొప్పెర్ల ఉమాదేవి ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వీరు 22.6.1965 న కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్య కర్నూలు లోను, హైస్కూలు విద్య – కదిరి, శ్రీకాళహస్తి లోనూ,
ఇంటర్ డోన్ లోనూ, బి. హెచ్. ఎం. ఎస్ – కడప లోనూ పూర్తి చేశారు.
ప్రసిద్ధ కథ, నవల, నాటక రచయిత డా॥ వి.ఆర్. రాసానితో 5.11.1989 న వివాహం జరిగింది యశ్వంత్ కుమార్ (USA), కాంచన్ కృష్ణ పిల్లలు.
వీరివి కొన్ని కవితలు, కథలు, 1500 దాకా వైద్యపరమైన వ్యాసాలు పలు పత్రికల్లో ముద్రింపబడ్డాయి.
ఆంధ్రజ్యోతి ఆదివారంలో, 1998 జులై నుంచి నవంబర్ వరకు ‘స్త్రీ శరీర విజ్ఞానం’, వార్త దినపత్రికలో 1996 నుంచి నేటివరకు ప్రతి సోమవారం ‘హెల్త్ కాలమ్’, విశాలాంధ్ర – ఆదివారంలో 2017 నుంచి 2020 వరకు ‘ఆరోగ్యం’, 1993 నుంచి 1995 వరకు ప్రముఖ మాసపత్రికలో ‘హెల్త్ కాలమ్’ నిర్వహించారు.
1997-1998 మధ్య తిరుపతి రేడియో కేంద్రం నుంచి ‘యవ్వన సౌరభం’ శీర్షికతో ధారావాహిక ప్రసంగాలు చేశారు.
స్త్రీల వ్యాధులు – హోమియో వైద్యం (1996, 2000), స్త్రీ శరీర విజ్ఞానం (2000), హోమియో వైద్యం – సాధారణ వ్యాధులు (2003), హోమియో వైద్యం (2011), ఇన్ఫెక్షన్స్ (2016), పిల్లల పెంపకం (2017), కరోనా – నివారణ (2021) అనే పుస్తకాలు వెలువరించారు.