Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జాతీయ బాలచెలిమి కథల పోటీ – 2025 – ప్రకటన

చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, బాలచెలిమి సంపాదకులు శ్రీమణికొండ వేదకుమార్ గారి సారథ్యంలో, బాలల దినోత్సవం-14వ నవంబర్ 2025 సందర్భంగా జాతీయ స్థాయిలో బాలచెలిమి కథల పోటీలు నిర్వహిస్తున్నారు.

పిల్లల కోసం, పిల్లలు రాసిన కథలు, పిల్లల కోసం పెద్దలు రాసిన కథలు పంపవచ్చు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్యాలు – నివారణ, మానవతా నైతిక విలువలు, దుర్వ్యసనాలకు దూరం వంటి అంశాలకు ప్రాధాన్యం. మూఢనమ్మకాలను ప్రేరేపించేవి ఉండకూడదు, శాస్త్రసాంకేతికాలకు అవకాశం. చేతిరాతలో (A4) మూడు పుటలు, టైపులో 2 పుటలకు మించరాదు. కథలను సంకలనం గాను, బాల చెలిమి పత్రికలోను ప్రచురణకు అవకాశం. పిల్లలకు, పెద్దలకు బహుమతులు వేరువేరుగా ఉంటాయి.

కథలు పంపటానికి గడువు తేది: 20 సెప్టెంబర్ 2025; దిగువ ఈమైల్ కు పంపాలి:

Email: edit.chelimi@gmail.com

లేదా

చిరునామా:
బాల చెలిమి ‘కథల పోటీ’
‘భూపతి సదన్’, ఇ. నం: 3-6-716,
స్ట్రీట్ నం: 12, హిమాయత్ నగర్,
హైదరాబాద్ -500029, తెలంగాణ రాష్ట్రం.
వివరాలకు: 8686664949; 9030626288

గరిపెల్లి అశోక్
కన్వీనర్, Mob: 9849649101.

Exit mobile version