శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘ఇవ్వాళ్టి రాత్రి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఇవ్వాళ్టి రాత్రి నిన్నటి రాత్రి లాగే ఉందా
మరింత చిక్కటి చీకటిని వెంట తెచ్చుకుందా
కురుస్తున్న వెన్నెల ఇంత హాయిగా వుంది
నిన్నటి లాగే ఉందా
మరింత తెల్లదనాన్ని లేత దినాన్ని
అరువు తెచ్చుకుందా
ఆకాశంలో కమ్ముకొస్తున్న మబ్బులు
కన్నీటి కొలనులను
ఎక్కడినుంచి మోసుకొస్తున్నాయి
కురిసిన మేఘాలు
భారాన్ని దించుకున్నామని మురుస్తాయా
నా లోపలి దుఃఖం రెట్టింపయిందని
ఈ రాత్రికి వెన్నెలకి మబ్భులకు తెలుసా
తెలిసే తెల్లారేసరికి
తరలి వెళ్లి పోతున్నాయా
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత