[కెన్నీ రోగర్స్, డాలి పార్టన్ పాడిన ‘ఐలండ్స్ ఇన్ ది స్ట్రీమ్’ అనే డ్యూయెట్‌ని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
‘ఐలాండ్స్ ఇన్ ది స్ట్రీమ్’ బీ గీస్ అనే గేయ రచయిత 1983లో రాసిన పాట. దీన్ని కెన్నీ రోజర్స్, డాలీ పార్టన్ ఇద్దరూ డ్యూయెట్‌గా రికార్డ్ చేసారు. ఇది ఆగస్టు 1983లో రోజర్స్ పదిహేనవ స్టూడియో ఆల్బమ్ ‘ఐస్ దట్ సీ ఇన్ ది డార్క్’ మొదటి సింగిల్‌గా విడుదలైంది. ఈ పాట యునైటెడ్ స్టేట్స్‌లో బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో నంబర్ వన్‌కు చేరుకుంది. ఇది కంట్రీ, అడల్ట్ కాంటెంపరరీ చార్ట్‌లలో కూడా అగ్రస్థానంలో ఉంది. 2005లో ఈ పాట కంట్రీ మ్యూజిక్ టెలివిజన్, అత్యుత్తమ కంట్రీ యుగళగీతాల పోల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మే 2023 నాటికి, ఇది రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా ద్వారా మూడు మిలియన్ల సర్టిఫైడ్ యూనిట్లకు ట్రిపుల్ సర్టిఫైడ్ ప్లాటినం పొందింది.
Baby, when I met you there was peace unknown
I set out to get you with a fine tooth comb
I was soft inside
There was something going on
(ప్రియా నిన్ను కలిసినప్పుడు తెలియని శాంతిని అనుభవించాను. నా జేబులో ఓ చిన్న దువ్వెన మాత్రమే ఉంది కాని నిన్ను పొందడానికి ముందడుగు వేసాను. నాలో మెత్తదనం పాకింది. లోన నాకే తెలియనిదేదో జరుగుతోంది)
పాటను మొదట ప్రేమికుడు మొదలుపెడతాడు. ఆమెను చూసిన మొదటి అనుభవం దగ్గర నుండి తన ప్రేమ యాత్రను చెప్పుకుంటున్నాడు. ఆమెను చూడగానే అతను ఎనలేని శాంతిని అనుభవించాడట. కాని అతను అప్పటికి జీవితాన్ని పూర్తిగా మొదలుపెట్టలేదు. జేబులో ఓ చిన్న దువ్వెన తప్ప రూపాయి లేదు. అంటే ఇంకా బాధ్యత, సంపాదన తెలియని వయసు అది. అయినా ఆమెను పొందడానికి నమ్మకంగా ముందడుగు వేసాడు. అతనికే అర్థం కాని మెత్తదనం అతనిలో నిండిపోయింది. ప్రేమ అతనిలోకి కరుకుతనాన్ని, ఆ వయసులోని దూకుడుని మాయం చేసింది. అతనికే అర్థం కాని మార్పు అతని మనసులో జరుగుతోంది. అతను ఇక ఆ పాత వ్యక్తి కాదు.
You do something to me that I can’t explain
Hold me closer and I feel no pain
Every beat of my heart
We got something going on
(నేను మాటల్లో చెప్పలేనిదేదో నువ్వు చేస్తున్నావు. నన్ను దగ్గరగా తీసుకుంటే నన్ను ఇక ఏ బాధా అంటదు. నా ప్రతి గుండె చప్పుడు మన జీవితంలో ఏదో జరుగుతోందని చెబుతుంది)
ఇక్కడ ప్రియురాలు అతనితో గొంతు కలుపుతుంది. అతనిలో కలిగిన సంచలనమే తనలోనూ కలిగిందని బదులిస్తుంది. తమ మనసు అనుభవించేదాన్ని మాటల్లో చెప్పడం కష్టమని అంటూనే ఇద్దరూ కలిసి తాము అనుభవిస్తున్న కలవరాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ప్రేమికుడు ముందుగా తన మనసు చెబితే అతనితో పాటు తరువాతి చరణంలో గొంతు కలుపుతూ తానూ అదే అసహాయ స్థితిలో ఉన్నానంటూ ఆమే, ఆమెకు చాలా దగ్గరవుతున్నానని ఇది వర్ణించలేని అనుభూతి అని అతను కలిసి ఆ పై చరణాన్ని ఆలపించడం వింటుంటే చాలా బావుంటుంది. ఈ వాక్యాలు వీరి ఆదర్శవంతమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయి. ఈ ప్రేమ వారిద్దరిలోనూ మార్పు తీసుకువచ్చింది అని వాళ్లు ఒప్పుకుంటున్నారు.
Tender love is blind
It requires a dedication
(సునితమైన ప్రేమ గుడ్డిది. దానికి ఎంతో అంకితభావం కావాలి)
ఇక్కడ ఈ ఒక్క వాక్యాన్ని అతను పలుకుతాడు. అంకితభావం, ఇరువురి ప్రేమలోనూ ఉండడం అవసరం అని అప్పుడే ఈ ప్రేమ, ఈ అనుభూతి కలకాలం నిలిచి ఉంటాయని అతను చెప్పగానే ఆమె తిరిగి అతనితో ఇలా గొంతు కలుపుతుంది..
All this love we feel needs no conversation
We ride it together, ah ha
Making love with each other, ah ha
Islands in the stream
That is what we are
No one in between
How can we be wrong?
Sail away with me
To another world
And we rely on each other, ah ha
From one lover to another, ah ha
(మనం అనుభవించే ఈ ప్రేమకు సంభాషణతో పని లేదు. ఒకరితో ఒకరం ప్రేమను పంచుకుంటూ కలిసి ప్రయాణిద్దాం. నదిలో ద్వీపాలం మనం. మన మధ్య ఎవరూ లేరు. మనం ఎలా తప్పవుతాం. నాతో కలిసి ఈ ప్రవాహంలో మరో ప్రపంచం వైపుకి సాగిపో. మనకు ఒకరిపట్ల మరొకరికి నమ్మకం ఉంది. ఒక ప్రేమికురాలి నుండి ప్రేమికుడి దిక్కుగా ఈ ప్రయాణం సాగుతుంది)
ఈ వాక్యాలలో వారి ప్రేమ పట్ల వారిలో ఉన్న అనంతమైన నమ్మకం వినిపిస్తుంది. వారి మధ్య చాలా బలమైన బంధం ఉందని, దానికి ఏ శక్తీ విచ్ఛిన్నం చేయదన్న నమ్మకం ఆ వాక్యాలలో ఉంది. ఈ జంటకు ఒకరి పట్ల మరొకరికి ఎటువంటి సందేహం లేదు. తాము సరైన మార్గంలో ఉన్నామని వారికి తెలుసు. వారిద్దరి మధ్య నిజమైన సంబంధం ఉంది. దాన్ని మాటల్లో వ్యక్తీకరించుకోవలసిన అవసరం వారికి లేదు.
చాలా భాగం కోరస్‌గా సాగే ఈ పాటలో నాతో మరొక ప్రపంచానికి ప్రయాణించమంటూ వారు ఒకరినొకరు ఆహ్వానించుకుంటున్నారు. ప్రపంచ సరిహద్దులను తమ ప్రేమ అధిగమించగలదనే నమ్మకం వారిది. ఇద్దరూ ఒకరికొకరుగా ఉంటామని, ఒకరిపై మరొకరుగా ఆధారపడతామని, ఒక ప్రేమికుడి నుండి మరొక ప్రేమికుడికి ఇది సందేశం అవుతుందనే భావన ఈ కోరస్‌లో ప్రతిద్వనిస్తుంది.
I can’t live without you if the love was gone
Everything is nothing if you got no one
And you did walk in the night
Slowly losing sight of the real thing
(ఈ ప్రేమ చెదిరిపోతే నేను నీతో జీవించలేను. ఎన్ని ఉన్నా మనకంటూ ఓ మనిషి లేకపోతే అది శూన్యమే. నువ్వు అలాంటి ఓ రాత్రే నా వైపుకు నడుచుకుంటూ రావడంతో నా వాస్తవ జీవితం చెదిరిపోయింది)
తనకంటూ ఓ మనిషి లేక ప్రేమ లేని శూన్యపు జీవితాన్ని అమె అప్పటిదాకా అనుభవిస్తుంది. అలాంటి ఓ నిశిరాత్రి అతను ఆమె జీవితంలోకి వెలుగును తీసుకొచ్చాడు. ఈ ప్రేమ చెదిరిపోతే ఆమె ఇక జీవించలేదు. ఈ చరణాన్ని ప్రియురాలు పలుకుతుంది. వెంటనే అతను ఆమెతో ఇలా గొంతు కలుపుతాడు..
But that won’t happen to us and we got no doubt
Too deep in love and we got no way out
And the message is clear
This could be the year for the real thing
(కాని అది మన విషయంలో జరగదు. అందులో సందేహం లేదు. మనం పూర్తిగా ఈ ప్రేమలో మునిగిపోయాం. ఇందులోనించి బైట పడలేం. స్పష్టమైన సందేశాన్ని ఈ ప్రేమ మోసుకొచ్చింది. ఇది మన నిజమైన జీవితం వైపుకు మనల్ని తీసుకుని వెళ్లే సంవత్సరం)
ఈ ప్రేమను కోల్పోయి జీవించవలసిన అవసరం తమ మధ్య రాదని, ఏ ఏడబాటు లేని జీవితం వైపుకే తాము ప్రయాణిస్తున్నాం అని. అన్ని శకునాలు ఇది తమ జీవితంలోని ముఖ్యమైన సంవత్సరం అని సూచిస్తున్నాయని ఇద్దరూ కలిసి ప్రకటించుకుంటున్నారు. అంటే ఈ బంధం వివాహం వైపుకు దారి తీస్తుందనే సూచన ఇందులో వినిపిస్తుంది.
No more will you cry
Baby, I will hurt you never
(నువ్వు ఎప్పుడూ దుఃఖపడవు ప్రియతమా, నేను నిన్ను ఎప్పుడూ గాయపరచను)
ఈ వాక్యాన్నిఆమె ఒక వాగ్దానంగా వినిపిస్తుంది. అప్పటిదాకా తన జీవితంలో ఉన్న దుఖం గురించి చెప్పుకుంది. కాని దాని తరువాత అతని జీవన సంఘర్షణను గౌరవిస్తూ, జేబులో ఒక దువ్వెన తప్ప మరేమీ లేని ఆ ప్రేమికుని ప్రేమను అంగీకరిస్తూ తాను అతన్ని స్వీకరిస్తున్నానని, ఎప్పుడూ అతన్ని గాయపరచనని తన తరుపున ఒక వాగ్దానాన్ని ఆమె వినిపిస్తుంది. అది విన్న అతను ఆమెతో ఇలా గొంతు కలుపుతాడు..
We start and end as one
In love forever
We can ride it together, ah ha
Making love with each other, ah ha
Islands in the stream
That is what we are
No one in between
How can we be wrong?
Sail away with me
To another world
And we rely on each other, ah ha
From one lover to another, ah ha
(మనం ఒకటిగా మొదలయి ప్రేమతో చివరిదాకా సాగి ఒకటిగానే కలకాలం నిలుస్తాం. ఒకరితో ఒకరం ప్రేమను పంచుకుంటూ కలిసి ప్రయాణిస్తాం. నదిలో ద్వీపాలం మనం. మన మధ్య ఎవరూ లేరు. మనం ఎలా తప్పవుతాం. నాతో కలిసి ఈ ప్రవాహంలో మరో ప్రపంచం వైపుకి సాగిపో. మనకు ఒకరిపట్ల మరొకరికి నమ్మకం ఉంది. ఒక ప్రేమికుడి నుండి ప్రేమికురాలి దిక్కుకు ఈ ప్రయాణం సాగుతుంది.)
ఇద్దరూ మానసికంగా ఒకటయి, జీవితాలకు కలుపుకునే సందర్భంలో, భవిష్యత్తును తాము ఎలా దిద్దుకోబోతున్నారో ఒకరికొకరు చెప్పుకుంటూ తమ ప్రేమ పట్ల, జీవితం పట్ల తమకు ఉన్న నమ్మకాన్ని ఈ పై వాక్యాలలో వ్యక్తీకరించుకుంటున్నారు. ఇదంతా ఆద్యంతం కోరస్‌గా సాగుతుంది. ఇద్దరూ రెండు ద్వీపాలు అంటే విభిన్న వ్యక్తులు, ఒకరిపై మరొకరు నమ్మకంతో కలిసి ప్రపంచం అనే ప్రవాహం నడుమ ఒకటవబోతున్నారు, తమదైన ప్రపంచాన్ని పరస్పర నమ్మకంతో సృష్టించుకోబోతున్నారు.
Sail away
Oh, come sail away with me
(సాగుదాం.., పద నాతో కలిసి సాగిపోదువు గాని)
సాగుదాం అంటూ అతను ఆమెను తనతో రమ్మని అనుమతి కోరితే, పద నాతో కలిసి జీవిత ప్రయాణంలో సాగిపోదువుగాని అంటూ ఆమె తన అనుమతి తెలుపుతుంది. అలా ఇద్దరూ తమ ప్రేమ పునాదిగా తమ జీవిత ప్రయాణాన్ని మొదలెట్టబోతున్నారు.
Islands in the stream
That is what we are
No one in between
How can we be wrong?
Sail away with me
To another world
And we rely on each other, ah ha
From one lover to another, ah ha
Islands in the stream
That is what we are
No one in between
How can we be wrong?
Sail away with me
To another world
And we rely on each other, ah ha
From one lover to another, ah ha
Islands in the stream
That is what we are
No one in between
(ఒకరితోఒకరం ప్రేమను పంచుకుంటూ కలిసి ప్రయాణిద్దాం. నదిలో ద్వీపాలం మనం. మన మధ్య ఎవరూ లేరు. మనం ఎలా తప్పవుతాం. నాతో కలిసి ఈ ప్రవాహంలో మరో ప్రపంచం వైపుకి సాగిపోదువుగాని రా. మనకు ఒకరిపట్ల మరొకరికి నమ్మకం ఉంది. ఒక ప్రేమికుడి నుండి ప్రేమికురాలి దిక్కుకు, ప్రియురాలి నుండి ప్రియుడి దిక్కుగా ఈ ప్రయాణం సాగబోతుంది).
ఈ పాట ఇదే చరణాన్ని కోరస్‌గా పలుకుతూ ఇలాగే సాగుతూ ముగుస్తుంది. ఈ పాటకు ప్రాణం ఈ కోరస్. నిజానికి కెన్నీ రోగర్స్, డాల్ పార్టన్‌ల గొంతులు రెండూ భిన్నమైనవి. కాని ఈ పాట కోసం వారు గొంతు కలిపి ఒకరి శైలిని మరొకరు అర్ధం చేసుకుని అనుకరించిన విధానం గొప్పగా ఉంటుంది. పాటంతా కోరస్ గానే సాగుతూ మధ్యలో ఓ రెండు వాక్యాలు అతను, మరో రెండు వాక్యాలు ఆమె అందుకుని పాడుతూ వెంటనే కోరస్ లోకి కలిసిపోవడం ఈ పాట ప్రత్యేకత. దీని సంగీతం, పాటను పాడిన విధానం ఈ సాహిత్యాన్ని అజరామరం చేశాయి. ఎన్నో పెళ్లి ప్రాంగణాలలో అమెరికా, ఇంగ్లండ్, అస్ట్రేలియా దేశాలలో ఈ పాట నేటికీ వినిపిస్తుంది.
ఈ పాటలోని ఇద్దరు వ్యక్తుల కలయిక రెండు ఆత్మల కలయిక అనిపిస్తుంది. వినే శ్రోతలకు వింత ఓదార్పునిస్తుంది, సరళమైన, స్పష్టమైన చిత్రాల ద్వారా నిజమైన భాగస్వాముల మధ్య లోతైన సంబంధానికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ డ్యూయెట్. వీరి గాత్రం ఈ సాహిత్యానికి మార్మికతను జోడించి శ్రోతలకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గాయకులిద్దరి కెరీర్‌ని ఎంతో పైకి తీసుకువెళ్లిన పాట కూడా ఇది.
ఈ పాట ఆ తరువాత ఎన్నో సినిమాలలోనూ టి.వి. సీరియల్లలోనూ వినిపించింది. ఇప్పటికీ అమెరికాలోని రేడియో స్టేషన్లలో వినిపిస్తూ ఉంటుంది. ఎన్నో లైవ్ షోలలో కెన్నీ, డాలీలు ఈ పాటను కలిసి ప్రదర్శించారు. ఆ తరువాత కొందరు గాయకులు ఈ డ్యూయెట్‌ను వారి గొంతులలో పాడినా, రీమిక్స్ లాంటి ప్రయోగాలు చేసిన ఇప్పటికీ ప్రపంచంలోని సంగీత ప్రియులందరూ అందరూ కెన్నీ రోగర్స్, డాలి పార్టన్ స్వరాల కలయికతో వచ్చిన ఈ గీతాన్నే ఇష్టంగా వింటారు. ఇంగ్లీష్ డ్యూయెట్లలో, కంట్రీ డ్యూయెట్లలోనూ అన్ని శైలుల గీతాల నడుమ ఈ పాట నేటికీ ఓ గొప్ప యుగళ గీతంగా నిలిచిపోయింది.
ఈ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు/వినవచ్చు:
https://youtu.be/uObstcmJeLw?si=_5JYMTEGkHl3jwdH