రచనా వ్యాసంగంలో ఒక సునామీలా నడివయసులో పైకెగసి, పత్రికల చుట్టూ తిరగకుండానే, రెండు అద్భుతమైన నవలలు, ఫేస్బుక్లో సీరియల్‌గా రచించి, వందల సంఖ్యలో పాఠకులకు పరిచయమై, ఎందరో రచయితల సమీక్షకుల మన్ననలు పొంది, గొప్ప పేరు తెచ్చుకున్న, ప్రతిభావంతురాలైన, చురుకైన రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారు.


నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి
తెలుగు – ఆంగ్లభాషల్లో మంచి పట్టువున్న ఈ రచయిత్రి ‘గొంతువిప్పిన గువ్వ’ ధారావాహిక ద్వారా ‘సంచిక’ పాఠకులకు చిరపరిచితులే! ఝాన్సీ గారు, నవలలే కాదు, కవిత్వం, అర్థవంతమైన కథలు కూడా రాస్తున్నారు. పాఠకుల, విశ్లేషకుల ప్రశంశలు పొందుతున్నారు. కథలు త్వరలో పుస్తక రూపం దాల్చనున్నాయి.
హైదరాబాదు వాస్తవ్యురాలైన ఈ రచయిత్రి, ఆస్ట్రేలియా, అమెరికాలలో ఉన్న పిల్లలతో గడుపుతూ, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిగారిని చూసుకోవడానికి అప్పడప్పుడూ, తాను పుట్టి పెరిగిన భారతదేశం వస్తుంటారు. నిత్యం గృహ సంబంధమైన పనుల ఒత్తిడితో బిజీగా వున్నా, తనకు ఇష్టమయిన రచనా వ్యాసంగాన్ని కొనసాగించటం ఈ రచయిత్రి ప్రత్యేకత.
ప్రతిదానికి ‘సమయం ఉండడం లేదు’ అని చెప్పి తప్పించుకునే కొందరికి ఝాన్సీగారి జీవన శైలి, ఒక అనుచరణీయమైన ఉదాహరణ. తన రచనా వ్యాసంగం గురించి, ఝాన్సీ కొప్పిశెట్టి గారి అభిప్రాయాలు, ఆవిడ మాటల్లోనే చదువుదాం.
***
ప్రశ్న: నమస్కారం, ఝాన్సీ గారు.
జవాబు: నమస్కారం, డా.ప్రసాద్ గారూ.
ప్రశ్న: మీ కలంనుండి జాలువారే కవితలు, కథలు, నవలలు తెలుగు పాఠకులకు సుపరిచితాలే. ఈ మూడు ప్రక్రియల్లోనూ నవలా ప్రక్రియ ద్వారా మీరు అశేష పాఠక లోకాన్నీ ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసలు నవల పట్ల మీకు మక్కువ ఎట్లా ఏర్పడింది?
జవాబు: దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సంఘటనను కథగా మలచవచ్చును. కాని నవల ఒక జీవితాన్ని ఆవిష్కరించగల అతి పెద్ద కాన్వాసు. కథలు రాయటం సుళువు. విస్తారమైన విషయం వుంటే తప్ప నవల రాయలేము. నవల చాలా కష్టసాధ్యమైన సాహిత్య ప్రక్రియ. నా అదృష్టం కొద్దీ నేను అతి దగ్గరగా చూసిన జీవితాలు నాకు నవలలు రాసే స్ఫూర్తిని, మక్కువను కూర్చాయి. ఆ స్ఫూర్తితోనే తక్కువ వ్యవధిలో రెండు నవలలు రాయగలిగాను.


కుటుంబ సభ్యులతో రచయిత్రి
ప్రశ్న: యుక్తవయసులో మీరు నవలలు బాగానే చదివి ఉంటారు. మీకు ఇష్టమైన నవలా రచయిత ఎవరు? ఎందుచేత?
జవాబు: అవును, నా హై స్కూల్ రోజుల్లోనే నేను విపరీతంగా నవలలు చదివేదానిని. వీరు, వారు అనే తారతమ్యాలు లేకుండా ప్రతీ నవల చదివేదానిని. యద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, అరికెపూడి కౌసల్యా దేవి, తెన్నేటి లత, కొమ్మనాపల్లి గణపతిరావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, చలం… ఇలా ఎవరి రచనలూ వదలలేదు. అయితే యద్దనపూడి సులోచనారాణిగారి నవలలను ఎక్కువగా ఇష్టపడి చదివేదానిని. ఇప్పుడు నా నవలలు చదివిన పాఠకులు నా శైలి యద్దనపూడి గారిని తలపిస్తుందని అన్నారు. నాకు తెలియకుండానే వారి ప్రభావం నా రచనల పైన వుందనుకుంటా.
ప్రశ్న: మీరు అందరిలా పత్రికలకు ప్రయత్నించకుండా సరాసరి ఫేస్బుక్లో సీరియల్ రాసి ప్రభంజనం సృష్టించారు. మీ ఈ సాహసం వెనుక నేపథ్యం వివరించండి.
జవాబు: ఇది సాహసమని నేననుకోను. బహూశా నాలో ఓర్పు, సహనం పాళ్ళు తక్కువేమో. నా రచనను పత్రికలకు పంపించి, ఎప్పుడెప్పుడు వేస్తారా, అసలు వేస్తారా లేదా అంటూ ఎదురుచూడటం కన్నా ఫేస్బుక్లో పెట్టటం వలన పాఠకుల సత్వర అభిప్రాయాలు, అభినందనలతో నాకు వెనువెంటనే సంతృప్తికర ఫలం దక్కుతుంది. అందుకే ఈ మాధ్యమాన్ని ఎన్నుకోవటం జరిగింది.


రచయిత్రి మొదటి నవల
ప్రశ్న: మీరు రెండు నవలలు రాసి – రాశి కంటే వాసి గొప్పదని నిరూపించారు.ఇది మీకు ఎలా సాధ్యం అయింది?
జవాబు: నేను సాహిత్య ప్రస్థానం ప్రారంభించి దశాబ్దాలు దాటితే మీరు ఈ మాట అనాలి. నేను 2018లో రాయటం మొదలుపెట్టి మూడేళ్ళలో రెండు నవలలు, ఒక ఆత్మకథ, పదిహేను కథలు, యాభైకి పైగా కవితలు రాసాను. రాశికేమీ తక్కువ లేదు. కాకపోతే నవలలు రెండూ అచ్చవటం వలన వాసికెక్కాయి. ఇప్పుడు నా ఆత్మకథ, కథాసంపుటి ప్రచురణకు ముస్తాబవుతున్నాయి. ‘గొంతు విప్పిన గువ్వ’ పేరుతో ఇదే సంచికలో ధారావాహికంగా వెలువడి అశేష అభిమానుల ఆదరణను పొందిన నా ఆత్మకథను అదే పేరుతో త్వరలో పుస్తకంగా తెస్తున్నాను.
ప్రశ్న: మీరు ఉండేది ఆస్ట్రేలియాలో.. పుస్తక ప్రచురణ, పుస్తకావిష్కరణ హైదరాబాదులో. ఇది మీరు అంత సులభంగా ఎలా నిర్వహించగలిగారు?
జవాబు: మంచి ప్రశ్న. ఈ విధంగా మరోసారి నా హితులకు, స్నేహితులకు ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం కల్పించారు. నేను చేసుకున్న పుణ్యం, సహృదయ ఆత్మీయులు నాకు స్నేహితులుగా లభించటం. నా రెండు నవలలు పాలపిట్ట ప్రచురణలే. పాలపిట్ట ఎడిటర్ శ్రీ గుడిపాటి గారు నా నవలల ప్రచురణ విషయంలో ప్రత్యేక శ్రద్ధాసక్తులను చూపి నేను ఇండియాలో లేనప్పటికీ అనుకున్న సమయంలో అన్న ప్రకారంగా అద్భుతంగా నవలలను సిద్ధం చేసారు. వారికి సాహిత్యం పట్ల వున్న అభిమానాన్ని, నా రచనల పట్ల వున్న గౌరవాన్ని నేను ఎన్నటికీ మరువలేను. అలాగే కవిసంగమం రథసారధి కవి యాకూబ్ గారు నా తొలి నవల ఆవిష్కరణ సభను స్వయంగా పూనుకుని ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించారు. వారికి నేను ఆజన్మాంతమూ ఋణపడి వుంటాను. రెండో నవల ఆవిష్కరణ కరోనా కారణంగా ఆన్లైన్లో జరిగింది. నా జీవితంలో అడుగడుగునా స్నేహితుల సహకారం, అభిమానుల ఆదరణ నాకు మానవతా విలువలను, మానవ సంబంధాల్లోని గొప్పతనాన్ని వెల్లడి చేస్తుంటాయి.


రచయిత్రి రెండవ నవల
ప్రశ్న: ఎప్పుడో వదిలేసిన రచనా వ్యాసంగాన్ని మళ్ళీ ఇంతకాలానికి మొదలు పెట్టి అంత త్వరగా ఎలా పుంజుకోగలిగారు? దీని వెనుక రహస్యం ఏమిటి?
జవాబు: బహూశా స్వతహాగా సాహిత్యాభిలాష, రచనా నైపుణ్యం నా నరనరాల్లో జీర్ణించుకుపోయి నిద్రావస్థలో ఉండటంతో మేల్కోవటమే ఆలస్యంగా పరుగు అందుకుని వుంటుంది. నిజానికి నేను పదుగురి సాహిత్యం అధ్యయనం చేసింది లేదు.. చదివింది లేదు. ఇంకా చెప్పాలంటే తెలుగు భాషలో ఏమయినా చదివి కూడా అప్పటికి చాలా కాలమయింది. అయినప్పటికీ వెనువెంటనే పుంజుకోగలిగానంటే నాలో వున్న సాహిత్య జిజ్ఞాస, ఆ సరస్వతీదేవి కృప అనే చెప్పాలి.
ప్రశ్న: మీ మొదటి నవల ‘అనాచ్ఛాదిత కథ’ ఒక తల్లి ప్రధాన పాత్రగానూ, రెండో నవల ‘విరోధాభాస’ ఒక కూతురి జీవిత నేపథ్యంగానూ తీసుకుని రాసారు. ఒక స్త్రీగా మీరు ఈ అంశాలను ఎంచుకున్నారా? లేక ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా?
జవాబు: మొదటి నవల ‘అనాచ్ఛాదిత కథ’ మా అమ్మగారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రచించినదే. భగవంతుని అద్భుత సృష్టి అయిన స్త్రీ, జీవితంలో అనేక పాత్రలను సునాయాసంగా పోషిస్తుంది. నేను దాదాపు రెండు నవలలలోనూ, మరి కొన్ని కథల్లోనూ తల్లిగా, ఆలిగా, తనయగా స్త్రీ గొప్పతనాన్ని చూపించే ప్రయత్నమే చేసాను. ఒక స్త్రీగానే నా రచనల ద్వారా స్త్రీ శక్తియుక్తులను వివరించే ప్రయత్నం చేస్తున్నాను.
ప్రశ్న: మీ నవలల్లో గానీ, కథల్లో గానీ, మీ రచనా విధానం, సంభాషణలు, పాఠకుడిని కట్టి పడేసేలా వుంటాయని చాలా మంది అంటుంటారు. దీని పైన మీ స్పందన ఏమిటి?
జవాబు: మాతృభాషపై పట్టు, మమకారం, ఎం.ఏ. తెలుగు అధ్యాపకుల భిక్ష, భగవంతుని కృప…


మొదటి నవల ఆవిష్కరణ రవీంద్రభారతి (హైదరాబాద్)
ప్రశ్న: మీ కథల్లో కవిత్వం పాళ్ళు ఎక్కువగా ఉంటుందని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. వివరించండి.
జవాబు: కవిత్వం అంత గొప్పగా రాయలేని నా వచనం లయబద్దంగా వుండటం నా అదృష్టం. నా స్నేహితులు ఒకరు తరుచూ అంటుంటారు.. “నీ కవిత్వం కన్నా కథనంలో కవిత్వం బావుంటుంది. కథల పైనే ఎక్కువగా శ్రద్ధ వహించు..” అని. అందుచేతనే ఈ మధ్య కథలకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాను.


ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా కథ.. రికార్డింగ్
ప్రశ్న: విదేశాల్లో వుంటూ కూడా మాతృ భాష పైన గొప్ప మమకారం పెంచుకుని సాహిత్య సేవ చేస్తున్నారు. మరి మాతృభాష పరంగా ఆస్ట్రేలియాలో మీరు చేస్తున్న కృషి ఎలాంటిది?
జవాబు: నిజానికి ఆస్ట్రేలియాలో తెలుగు పత్రికల వివరాలు నాకు ఇంకా పూర్తిగా తెలియవు. ఈ మధ్యనే పరిచయమైన అచ్చులో వచ్చే ‘తెలుగు పలుకు’ మాస పత్రికలో గత ఆరు నెలలుగా దాదాపుగా ప్రతీ నెలా నా కవితలు అచ్చవుతున్నాయి. ఈ నెలలో నా కవితతో పాటు ‘ప్రయాణం’ శీర్షికతో నా తాస్మేనియా యాత్రా విశేషాలు కూడా వచ్చాయి.


మొదటి నవలకు అంపశయ్య నవీన్ పురస్కార ప్రదాన సన్మానం (హనంకొండ)
ప్రశ్న: మీ సాహిత్య కృషికి సంబంధించి మీ పిల్లల స్పందన ఎలా ఉంటుంది?
జవాబు: పిల్లలు సాధించిన ఘన విజయాలకు తల్లిదండ్రులు గర్వించినట్టే, తల్లిదండ్రుల అచీవ్మెంట్స్కి పిల్లలు ఆనందిస్తారు. దురదృష్టం కొద్దీ మా అమ్మాయిలు తెలుగు సరిగ్గా చదవలేక పోయినా నా ప్రతి రచన గురించి స్నేహితులతో గర్వంగా చెప్పుకుంటుంటారు. నా తొలి నవలావిష్కరణలో మా చిన్నమ్మాయి, అల్లుడు ఎంతో గర్వంగా పాలుపంచుకున్నారు. వారిద్దరు దగ్గరుండి సభ ఏర్పాట్లను, అతిథి సత్కారాలను చూసుకుని నాకు మరువలేని మధుర స్మృతులను మిగిల్చారు. మా పెద్దమ్మాయి నేను ఏదయినా రాసుకునే వేళ ఎంత అత్యవసర పరిస్థితుల్లోనూ నన్ను డిస్టర్బ్ చేయక ఎంతో సహకరిస్తుంది. ఆఖరికి మనుమరాళ్లు కూడా నేను లాప్టాప్ తెరిస్తే నిశబ్దమైపోతారు.


మొదటి నవల ఆవిష్కరణ సభలో రచయిత్రికి శ్రీమతి & డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్ దంపతుల చిరు సన్మానం
ప్రశ్న: మీకు లభించిన అవార్డులు, సన్మానాల గురించి వివరించండి.
జవాబు: ప్రతిలిపిలో కొన్ని కథలకు, కవితలకు బహుమతులు, తొలి నవల అనాచ్ఛాదిత కథకు అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక సాహితీ పురస్కారం లభించాయి. నేను నా రచనలను పత్రికలకు పంపకుండా ఫేస్బుక్లో పెట్టటమూ, భౌతికంగా నేను ఇండియాలో లేకపోవటం వలన కొన్ని పురస్కారాలు, సన్మానాలు కోల్పోయానని నమ్మకంగా చెప్పగలను.
~
ఇన్ని విశేషాలు అందించిన మీకు సంచిక పత్రిక పక్షాన ధన్య వాదాలండి, ఝాన్సీ గారూ
సంచికకూ, మీకూ ధన్యవాదాలండీ, డాక్టర్ ప్రసాద్ గారూ.

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
41 Comments
Sambasiva+Rao+Thota
Dr.Prasad Garu!
Jhansi Garitho mee interview chaalaa interesting konasaagindi..
Chaalaa vishayalu thelusukogaligaanu..
Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
Jhansi koppisetty
సాంబశివరావు గారూ, ధన్యవాదాలండీ….
Sagar
ఝూన్సీ మేడంగారి నవల విరోధాబాస ను చదివి సమీక్షించే అదృష్టం నాది. అంతే కాక వారికున్న ఆసక్తి మాత్రమే భాషపై వారికున్న పట్టు కూడ వారి రచనల్లో ద్యోత్యకమవుతుంది. ఇక ముఖ్యమైన విషయంలో తన రచనల్లో ఉన్న విషయాలనూ ఉన్నట్లుగా చెప్పగలిగే దైర్యం, తెగువ మేడమ్ గారికి స్వంతమని వారి గొంతు విప్పిన గువ్వ రచనను చదివి అర్ధం చేసుకున్నాను. అంటే ఎవరో ఏదో అనుకుంటారని జరిగిన విషయాలను దాచిపెట్టడంలాంటివి చేయకుండా కుండబ్రద్దలు కొట్టినట్లుగా చెప్పడం వారిలాంటి దైర్యవంతమైన కవయిత్రులకే సాధ్యం. వారి కి అభినందనలు మరియు ధన్యవాదములు. వారి అమూల్య ఇంటర్వూ అందించిన ప్రసాద్ సర్ కు ప్రత్యేక ధన్యవాదములు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందనకు ధన్యవాదాలు.
Jhansi koppisetty
సాగర్ గారూ మీ ఆత్మీయాభిమానాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు


డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చిన్నప్పటి పుస్తక పఠనం, ఎదుగుతున్న కొద్దీ నిద్రపోనివ్వదు. రచయితల జీవితంలో ఇదే జరుగుతుంది. అల్లుడుగారు, అత్తగారి నవలావిష్కరణ సభకు కృషి చేయడం పంచ్ లైన్. ఝాన్సి గారిది అద్భుతమైన కృషి. వారు రాస్తూనే వుండాలి. రాస్తారు కూడా …
——మారుతీ కిరణ్
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng doctor garu,
A great writer, Vaariki naa hrudaya poorvaka namah sumananjalu.
—–surya narayana rao
Rtd.DGM-SBI
HYDERABAD
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sir
Thank you so much.
Jhansi koppisetty
ధన్యవాదాలు మారుతీకిరణ్ గారూ….
Bhujanga rao
కొప్పిశెట్టి ఝాన్సీ రచయిత గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా ఆసక్తికరంగా కొనసాగింది.వారి గురించి చాల విషయాలు తెలుసుకున్నాము.ధన్యవాదములు సర్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
భుజంగరావు గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Jhansi koppisetty
ధన్యవాదాలు భుజంగ రావుగారూ…
ఎన్.వి.ఎన్.చారి
రచయిత్రి కొప్పశెట్టి ఝాన్సిగారి పరిచయం బాగుంది మీరు సమయోచితప్రశ్నలతో సమాధానంరాబట్టడంలో దిట్ట మంచి ప్రేరణాత్మక
పరిచయం బహుశా వరంగల్ పురస్కారానికి సన్మానపత్రం నేనే రాసానేమో
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారిగారూ
ధన్యవాదాలు.
Jhansi koppisetty
ధన్యవాద నమస్సులు చారిగారూ


డా.కె.ఎల్.వి.ప్రసాద్
నవలా రచయిత్రి ఝాన్సీ గా
రితో మీరు చేసిన ముఖాముఖి కార్యక్రమం బహుచక్కగా సాగింది.
రచయిత్రి గారి మొదటి రెండు నవలలు అనాచ్చాదిత కథ,అలాగే విరోధా భాష …మీరు చదివే ఉంటారనుకుంటాను. ఈ రెండు నవల పేర్లు నాకు కొత్త గా అనిపిస్తున్నాయి .ఏ సబ్జెక్టు పైన ఇవి రాశారో టూకీగా తెలియజేయగలరు.
——–బి.ఎన్. కృష్ణా రెడ్డి
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
ధన్యవాదాలు సర్ మీకు.
Jhansi koppisetty
రెడ్డిగారు ధన్యవాదాలండీ…
Jhansi koppisetty
ధన్యవాదాలు భుజంగ రావుగారూ…
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sir namasthe andi.
Jhansi gari interview chesina vidhanam bagundi.sir.
Avida kuda madhya vayasu nunchi unna kalala ni mergu pettukodam goppa ga anipinchindi.
Aruna garini mimmulani ala chudam happy anipinchindi.
——శ్రీమతి సుజన పంత్,
భీమారం
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బాగుంది ఇంటర్వ్యూ
——-బ్రహ్మ చారి(నిధి)
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
రమాదేవి+బాలబోయిన..మృదువిరి
మంచి మనసుకు ఎల్లలుండవు అనేందుకు తార్కాణం ఝాన్సి గారు.. అందుకే విదేశాల్లో ఉన్న సొంత గడ్డపై ప్రేమానురాగాలకు నోచుకున్నారు…వారి సాహిత్య కృషి గొప్పదనం.. అభినందనలు మేడం
మంచి పరిచయం అభినందనలు డాక్టర్ గారు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా రమాదేవి గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Jhansi koppisetty
Thank you so much రమా…. మంచి మనసులను మంచి మనసులే గ్రహిస్తాయి… మీ సహృదయ స్పందనకు మనః పూర్వక ధన్యవాదాలు డియర్
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ.ఇంటర్వ్యూ చదివాను
నేను. నవలా రాణి గారి రచనలు ఏవీ చదవలేదు కాబట్టి ఏమని స్పందించాలో అర్ధం కాలేదు
బహుశా మీరు చెప్పిన దాని బట్టి 2018 నుండి ఆవిడ వ్రాస్తున్నారు అనుకుంటున్న
నాకు. ఆవిడ రాశి వాసి రెండు తెలియవు
బహుశా చాలా గొప్ప రచయిత్రి అయి ఉండాలి.
—–డా.పి.ఎల్.ఎన్.ప్రసాద్,
హన్మకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ప్రసాద్ గారూ,
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
మొహమ్మద్+అఫ్సర+వలీషా
చాలా చక్కని ఇంటర్వ్యూ జరిపి మరెన్నో ఝాన్సీ గారి మవోగతాన్ని తెలుసు కునే అవకాశం కల్పించారు ప్రసాద్ సార్ గారు చాలా సంతోషంగా ఉంది ఝాన్సీ గారి కలం నుండి జాలువారి పుస్తక రూపం దిద్దుకుంటున్న కధలకు.తన కధలు గానీ నవలలు కానీ చదువు తున్న పాఠకులకు మనసు తన్మయత్వంతో ఊగిసలాడుతుంది.















సమయం ఉండి వ్రాయలేక పోయే వారి కంటే సమయము లేకపోయినా ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఎన్నో మంచి భావుకతతో వ్రాస్తూ కధన రంగంలో దూసుకెళుతున్న ఝాన్సీ గారికి, చక్కని ప్రశ్న లతో ఇంటర్వ్యూ నిర్వహించిన ప్రసాద్ సార్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు.
Jhansi koppisetty
Thanks a lot Afsara dear….Love your comment darling
Dr.Harika
Good morning sir,
Madam is really an inspiration to the women out there as it is very difficult to maintain a work – life balance.
It’s truly cherishable to see her efficiency in maintaining that.
This interview created an interest in me to read the novel as soon as possible as it shows the importance of roles of a woman.
Hearty congratulations to madam &
Thank you sir for sharing.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Dr.Harika,
Thank you so much.
Jhansi koppisetty
Thanks a lot Dr Harika garu

డా.కె.ఎల్.వి.ప్రసాద్
——బొందల నాగేశ్వరరావు
చెన్నయ్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
నాగేశ్వరరావు గారు.
Jhansi koppisetty
నాగేశ్వరరావు రావు గారు మీ స్పందనకు ధన్యవాదాలండీ…